హైదరాబాద్

ప్రశాంతంగా రాహుల్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జనవరి 19: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్‌డి విద్యార్థి రోహిత్ వేముల మృతితో వేడెక్కిన వాతావరణం చల్లారలేదు. ఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు వచ్చి రోహిత్ కుటుంబాన్ని పరామర్శించడంతో యూనివర్సిటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు జెఎసిగా (ఎబివిపి తప్ప) ఏర్పడి నిరసనలు తెలుపుతున్నారు. రోహిత్ మరణంపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీ బృందం యూనివర్సిటీలోని లేక్‌వ్యూ అతిధిగృహంలో సమావేశమై విచారణ ప్రారంభించింది. ఉదయం 11 గంటలకు సమావేశమైన కమిటీ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగులతోపాటు విద్యార్థి సంఘ వినతులు వింటామని ప్రకటించాయి. కమిటీ సభ్యులైన సూరజ్‌కుమార్ షఖీల టి శంషాద్‌లను నిరసన ప్రదేశానికి రావాలని విద్యార్థులు కోరారు. అయితే కమిటీ సభ్యులు అందుకు అంగీకరించలేదు. అతిధిగృహం బయట నిలబడి విద్యార్థి సంఘాలు నిరసనలు వ్యతిరేక స్లోగన్స్ ఇవ్వసాగారు. దీంతో కమిటీ సభ్యులు బయటకు వచ్చి విద్యార్థి సంఘ సభ్యులు కూడా సమస్యలను వినతిపత్ర రూపంలో ఇవ్వాలని ఇద్దరు ముగ్గురు ప్రతినిధులు వచ్చి వివరించ వచ్చని చెప్పడంతో విద్యార్థులందరు షాపింగ్ కాంప్లెక్స్‌కు వెళ్లిపోయారు. అంతకు ముందు విద్యార్థులు యూనివర్సిటీలోని అన్ని విభాగాలు తిరుగుతూ బంద్ చేయించారు. సౌత్ క్యాంపస్ నుండి ప్రధాన ద్వారం మీదుగా పరిపాలన భవనం వైపు నుండి ర్యాలీగా షాపింగ్ కాంప్లెక్స్‌కు చేరుకున్నారు.
రెండోరోజు విద్యార్థులు క్లాసులు బహిష్కరిస్తే ఉద్యోగులు విధులకు గైర్హాజరైనారు. ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మధ్యాహ్నం 1.10కు యూనివర్సిటీలోని షాపింగ్ కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 2.50 గంటలకు రాహుల్ వెళ్లిపోయారు. రాహుల్‌గాంధీ పర్యటన పురస్కరించుకుని భారీగా పోలీసులను మోహరించారు. స్పెషల్ బ్రాంచ్ కౌంటర్ ఇంటిలిజన్, ఇంటిలిజన్ పోలీసులతోపాటు నిఘా బృందాలు అణువణువు జల్లెడపట్టాయి. మాదాపూర్ సిపి కార్తీకేయ రాహుల్ పర్యటనను పర్యవేక్షించారు.
యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులు ఉండడంతో భారీగా పోలీసులను మోహించారు. ఉదయం నుండే యూనివర్సిటీలోని మూడు మార్గాలలో బలగాలను మోహరించి ప్రధాన ద్వారం నుండి అనుమతించారు. రాహుల్‌గాంధీని చూసేందుకు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చినా ఎవరిని లోపలికి అనుమతించలేదు. కార్యకర్తలందరు యూనివర్సిటీ ప్రధాన ద్వారం బయట జెండాలతో స్వాగతం పలికారు. రాహుల్‌గాంధీ రోడ్డు మార్గం వచ్చి వెళ్ళారు. రాహుల్ పర్యటన ప్రశాంతంగా జరగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

బ్యాంకు ఖాతాల్లోని డబ్బును
మళ్లించే ముఠా గుట్టు రట్టు
హైదరాబాద్, జనవరి 19: బ్యాంకుల్లో దాచుకున్న ఖాతాలోని డబ్బులను ఆన్‌లైన్ ద్వారా దొంగలిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టయింది. సిటీ సైబర్, సిసిఎస్, డిడి పోలీసుల కథనం ప్రకారం బేగంపేట ప్రాంతానికి చెందిన అబ్దుల్ అలీమ్‌కు స్థానిక ఐసిఐసిఐ బ్యాంక్‌లో సేవింగ్ అకౌంట్ ఉంది. తన బ్యాంకు అకౌంట్‌లో దాచుకున్న డబ్బుల్లో డిసెంబర్ 3న రూ.2.70లక్షలు చొప్పున రెండుసార్లు, రూ.2.50వేలు, 11వేలు మొత్తం కలుపుకొని రూ.7.90వేల రూపాయలు వేరే వేరే ఆకౌంట్‌లలోకి ట్రాన్స్‌ఫర్ చేసినట్టు తన ఫోన్‌కు మేసేజ్ రావడంతో అశ్చర్యానికి గురయ్యాడు. తిరిగి మరుసటి రోజు డిసెంబర్ 4న వెయ్యి రూపాయలు, రూ.4886 ఆన్‌లైన్ ద్వారా వేరే ఆకౌంట్‌లలో జమ అయ్యాయి. దీంతో బాధితుడు ఐసిఐసిఐ బ్యాంకు అధికారులకు సమాచారం అందించి న్యాయం చేయాలని కోరాడు. హైదరాబాద్ సిసి, డిడి, సైబర్ క్రైమ్ పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అబ్దుల్ అలీంకు అకౌంట్ నుండి వేరే ఆకౌంట్‌లకు ట్రాన్స్‌ఫర్ అవుతున్న డబ్బుల వివరాలకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. బేగంపేటలోని ఐసిఐసిఐ ఆకౌంట్ హాల్డర్ అలీంఖాన్‌కు వచ్చిన ఎస్‌ఎంఎస్‌ల అధారంగా నిధులు మళ్లించిన మధ్యప్రదేశ్ జబల్‌పూర్, భోపాల్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. దీంతో ప్రత్యేక పోలీసుల బృందం జబల్‌పూర్‌లోని సాగర్‌కుమార్ రాందాస్‌కు సంబంధించిన ఐసిఐసిఐ బ్యాంక్ ఆకౌంట్‌లోకి రూ.2.70లక్షలు, భోపాల్‌లోని ఐసిఐసిఐ బ్యాంక్‌లో ఖాతాదారుడు ఫరాజ్ అహ్మద్‌ఖాన్ అకౌంట్‌లోకి రూ.2.61లక్షలు జమయ్యాయి. సాగర్‌కుమార్ రాందాస్ సహచరుడు సంజయ్ పటేల్(40)తో పాటు మరో ఖాతాదారుడు ఫరాజ్ అహ్మద్‌ఖాన్‌ను ఈనెల 17న నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన రోహిత్‌శర్మ, రాజాఠాకుర్, తోమార్, నరేష్ మాల్వియా, యుపి వారణాసికి చెందిన రాహుల్ తివారీ, ముంబయికి చెందిన డెవీడ్‌తో కూడిన ఆరుగురు సభ్యుల ముఠా కోసం తీవ్రంగా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇతర కేసుల్లో రాహుల్ తివారి, నరేష్ మాల్వియాలు భోపాల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ముఠాలోని సభ్యులో ప్రధాన నిందితుడు సాగర్‌కుమార్ రాందాస్, ఫరాజ్ అహ్మద్‌ఖాన్.. కరెంట్, సేవింగ్స్ ఆకౌంట్స్‌తో పాటు చెక్‌లు, ఎటిఎం కార్డులు సహకారంతో ముంబయిలో ఉన్న రోహిత్‌శర్మ, రాహుల్ తివారీ.. ఆన్‌లైన్ ద్వారా దొంగలించిన డబ్బును గుట్టు చప్పుడు కాకుండా డ్రాచేసేవారు. ఇన్స్‌పెక్టర్ విపి తివారీతో కూడిన బృందం సిహెచ్ సునిల్, గణేష్‌దూబే, డి.రఘు, ఎంఎ కరీం పట్టుకున్నారు.

మేడారం జాతరకు 450 ప్రత్యేక బస్‌లు
చాదర్‌ఘాట్, జనవరి 19: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా రెండేళ్లకోమారు వచ్చే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు టిఎస్ ఆర్టీసి 450 ప్రత్యేక బస్‌లను నడిపేందుకు నిర్ణయించింది. ఈ బస్‌లు ఎంజిబిఎస్, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్, కెపిహెచ్‌బి, జగద్గిరిగుట్ట నుంచి బయలుదేరి ఉప్పల్‌లోని వరంగల్ పాయింట్ మీదుగా జాతరకు చేరుకుంటాయని హైదరాబాద్ జోన్ ఇడి నాగరాజు తెలిపారు. ఫిబ్రవరి 14 నుంచి 21 వరకు బస్‌లు నడుస్తాయని, భక్తుల కోసం ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు నగరం నుంచి బయలుదేరే ప్రత్యేక బస్‌లు 11 గంటలకు మేడారం చేరుకుంటాయన్నారు. అదనపు బస్‌లకు 50 శాతం చార్జీలు అదనంగా వుంటాయని, రిజర్వేషన్ కోసం ఎంజిబిఎస్, జూబ్లీ, ఆర్టీసి ఏజెంట్లను సంప్రదించాలన్నారు. జాతరకు నడిచే ఏసి బస్‌లకు పెద్దలకు-రూ.552, పిల్లలకు రూ.432, సూపర్‌లగ్జరీ రూ.447, రూ.247, ఎక్స్‌ప్రెస్- రూ.337, రూ.187గా అమలు చేస్తున్నట్లు నాగరాజు తెలిపారు.

పోలింగ్ వెబ్ కాస్టింగ్‌కు విద్యార్థుల సుముఖత
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 19: జిహెచ్‌ఎంసి ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మొత్తం పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ చేయాలని అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే! గ్రేటర్‌లోని 150 డివిజన్లలోని మొత్తం 7757 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 3వేల చోట్ల వెబ్‌కాస్టింగ్ కోసం విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని భావించిన అధికారుల ప్రయత్నానికి సానుకూలత లభించింది. ఇందుకు తాము సిద్దమేనంటూ 3వేల మంది విద్యార్థులు అంగీకార పత్రాలను పంపినట్లు అదనపు కమిషనర్(ఎన్నికలు) సురేంద్రమోహన్ తెలిపారు. వీరందరికి మరో మూడు,నాలుగు రోజుల్లో తగిన శిక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు వివరించారు. వెబ్ కాస్టింగ్‌కు అవసరమైన డేటా కార్డు, వెబ్ కెమెరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి సమకూర్చుకోనున్నట్లు వివరించారు.
5లక్షల మంది విద్యార్థులకు ప్రతిజ్ఞా పత్రాలు
జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు పాఠశాల విద్యార్థులతో సరికొత్త ప్రచారాన్ని నిర్వహించేందుకు సిద్దమైన జిహెచ్‌ఎంసి అధికారులు ఇందుకు సంబంధించి అయిదు లక్షల మంది విద్యార్థులకు ప్రతిజ్ఞ పత్రాలను నేటి నుంచి అందజేయనున్నట్లు అదనపు కమిషనర్ సురేంద్రమోహన్ తెలిపారు. నగరంలోని అయిదు లక్షల మంది విద్యార్థులకు వారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హెడ్ మాస్టర్లకు వీటిని అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. తన వయస్సు 18 ఏళ్లు నిండే వరకు తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చక్కటి పాలక మండలిని ఎన్నుకునేందుకు వీలుగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న సారాంశంతో రూపొందించిన ఈ ప్రతాలను పాఠశాల విద్యార్థులకు తమ తల్లిదండ్రులకు ఇచ్చి, అందుకు అనుకూలంగా వారి సంతకాలను తీసుకుని, తిరిగి స్కూల్‌లో సమర్పిస్తారని అదనపు కమిషనర్ వివరించారు.

ప్రభుత్వ పథకాలే ప్రజలను తెరాసకు దగ్గర చేసాయ
* మంత్రి పద్మారావు
సికింద్రాబాద్, జనవరి 19: సికింద్రాబాద్ నియోజకవర్గంలో తెరాస రెబల్స్ ఉండరని మంత్రి పద్మారావు పేర్కొన్నారు. మంగళవారం తార్నాక డివిజన్ నుంచి రెబల్‌గా నామినేషన్ వేసిన వరికుప్పల ముత్యాలు తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. తెరాస అభ్యర్థి ఆలకుంట సరస్వతితో కలిసి మాణికేశ్వర్‌నగర తదితర ప్రాంతాల్లో ప్రచారంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఐదు డివిజన్‌లలో తెరాస అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలను తెరాసకు మరింత దగ్గర చేశాయని మంత్రి పేర్కొన్నారు. తెరాస గ్రేటర్‌లో వంద డివిజన్‌లకు పైగా సీట్లను సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని అన్నారు. తార్నాక డివిజన్‌లో ప్రజలు గత ఎన్నికల్లో సైతం తెరాసవైపే ఉన్నారని ఈ ఎన్నికల్లో సైతం ఆలకుంట సరస్వతిని బలపర్చి కార్పోరేటర్‌గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలకుంటహరి, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
ఇదే డివిజన్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతె శోభన్‌రెడ్డి సతీమణి మోతె శ్రీలత తమ నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇదే డివిజన్ నుంచి చాలా మంది వివిధ పార్టీల నుంచి రెబల్స్‌గా నామినేషన్‌లు దాఖలు చేశారు. చాలామంది బుధవారం తమ ఉపసంహరించుకోవాల్సి ఉంది.

పరిశీలన...
ఉపసంహరణ!
* ఏడుగురి నామినేషన్లు విత్‌డ్రా
* రెబెల్స్‌తో కొనసాగుతున్న పార్టీ నేతల బుజ్జగింపులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 19: మహానగర పాలక సంస్థ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పరిశీలన ఇంకా పూర్తికాకముందే ఉపసంహరణ మొదలైంది. మంగళవారం పలు డివిజన్లలో పరిశీలన కొనసాగుతుండగానే వివిధ పార్టీలు, స్వతంత్రులు ఏడుగురు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు. అధికార టిఆర్‌ఎస్ పార్టీతో పాటు విపక్షాలు, ఇతర పార్టీలకు కూడా ఈ సారి ఎన్నికల్లో రెబెల్స్ బెడద తప్పకపోవటంతో ఆయా పార్టీ నేతలు తిరుగుబాటుదార్లను బుజ్జగించే పనిలో పడ్డారు. టిడిపి, బిజెపి పార్టీలకు చెందిన తిరుగుబాటు దారులను బుజ్జగించేందుకు ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా కమిటీని కూడా నియమించింది. మంగళవారం విత్‌డ్రా చేసుకున్న వారిలో టిఆర్‌ఎస్, టిడిపి పార్టీలకు చెందిన ఒక్కొక్కరు అభ్యర్థులుండగా, ఇతర గుర్తింపు పొందిన రాజకీయపార్టీలకు చెందిన వారు మరొకరుండగా, మిగిలిన నలుగురు స్వతంత్రులున్నారు. టిఆర్‌ఎస్, టిడిపి, బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఒక్కో డివిజన్ నుంచి అయిదారుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే!
పరిశీలన తర్వాత వీటి సంఖ్య అంతంతమాత్రంగానే తగ్గటంతో ఆయా పార్టీల నేతలకు తలనొప్పిని పెంచిందని చెప్పవచ్చు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో సమర్థుడైన అభ్యర్థిని ఎంపిక చేయటంతో పాటు మిగిలిన వారిచే నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు నేతలు నానా తంటాలు పడుతున్నారు. ఇదిలా ఉండగా, టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి మరోలా ఉంది. ఈ రెండు పార్టీలకు చెందిన తిరుగుబాటుదారులకు గాలం వేసేందుకు పరస్పరం ప్రయత్నాలు చేస్తున్నాయి.
వీరిలో ఒక పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన వారు చివరి నిమిషం వరకు మరో పార్టీ అభ్యర్థిగా మారే అవకాశం ఉంది. అయితే అధికారులు అభ్యర్థులు నామినేషన్‌లో రాసిన పార్టీ బి ఫారం మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. కానీ ఏ పార్టీ బి ఫారం సమర్పిస్తే అభ్యర్థి ఆ పార్టీ అభ్యర్థిగా పరిగణిస్తారని మరికొందరు అధికారులంటున్నారు. ఈ వాదననే బలపరుస్తూ పలు డివిజన్లలో ఒకే అభ్యర్థి రెండు,మూడు నామినేషన్లు దాఖలు చేసి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు.

దేశ ఔన్నత్యాన్ని కాపాడాల్సింది విద్యార్థులే
హైదరాబాద్, జనవరి 19: విద్యార్థులు జాతి సంపదనీ, తెలంగాణ రాష్ట్ర సంపద విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, దేశ ఔన్నత్యాన్ని కాపాడాల్సింది విద్యార్థులేనని తెలంగాణ శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో వికాస్ విద్యాలయ వార్షికోత్సవానికి స్వామిగౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు పాఠశాల గదిలోకి వెళ్లగానే ఐదు నిమిషాలు ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే మనసు ఏకాగ్రతతో వుండి పాఠాలు అర్థం చేసుకోగలరని ఆయన అన్నారు. ఏదైనా ప్రశ్నకు సమాధానం చెప్పేటపుడు తెలిసిన విషయాన్ని నిర్భయంగా చెప్పాలని ఆయన సూచించారు. విద్యార్థులు తోటివారిని చూసి ఈర్ష్య పడకుండా పరీక్షలలో వారితో పోటీపడాలని ఆయన విజ్ఞప్తి చేసారు. విద్యార్థులకు పాజిటివ్ థింకింగ్ వుండాలని, చెడు ఆలోచన వుండకూడదని, తల్లిదండ్రులు పిల్లల మనోభావాలకు అనుగుణంగా నడచుకోవాలన్నారు. చిరుతిండి తనకుండా ఆరోగ్యంగా వుండాలని, భవిష్యత్ గురించి ఆలోచించేటపుడు అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని, యువత కలలు కనడంలో తప్పులేదనీ, గాంధీ, భగత్‌సింగ్ వంటి మహనీయుల మార్గంలో నడిచి డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ కావాలని కలలు కనాలని, ఆ కలలను నిజం చేసుకోవడానికి విద్యార్థులు కృషి చేయాలని గౌడ్ అన్నారు. ఈ సంవత్సరం ఏం సాధించాలి అనే ప్రణాళిక వేసుకోవడానికే వార్షికోత్సవం అని ఆయన అన్నారు. కార్యక్రమంలో పారిశ్రామికవేత్త ఎస్.వెంకటయ్య, ఉప విద్యాశాఖాధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. తొలుత పాఠశాల కరస్పాండెంట్ ఎన్.జయంత్‌రావు మాట్లాడుతూ, చిన్న పాఠశాలగా ప్రారంభించామని, ప్రస్తుతం 650 మంది విద్యార్థులతో కళలు, క్రీడలు, వక్తృత్వ పోటీలలో తర్ఫీదు ఇస్తున్నామని అన్నారు. పదవ తరగతిలో 95 శాతం ఉతీర్ణత సాధిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పారదర్శకత కోసం
తెలంగాణ ఎలక్షన్ వాచ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 19: జిహెచ్‌ఎంసి ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ఇరవై స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ ఎలక్షన్ వాచ్‌గా ఏర్పాటయ్యాయి. ముఖ్యంగా గతంలో రెండు పర్యాయాలు జిహెచ్‌ఎంసికి జరిగిన ఎన్నికల్లో 26 నుంచి 46 శాతానికే పరిమితమైన పోలింగ్ శాతాన్ని ఈసారి వీలైనంత ఎక్కువగా పెంచేందుకు, ఓటర్లను చైతన్యవంతులను చేయటమే ప్రధాన లక్ష్యంగా ఈ వేదిక ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ కన్వీనర్ పద్మనాభరెడ్డి తెలిపారు. నగరవాసులకు మెరుగైన పౌరసేవలందించేందుకు, అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి చేపట్టేందుకు జిహెచ్‌ఎంసికి ఓ చక్కటి, అంకితభావంతో పనిచేసే పాలకమండలి రావాలని ఆకాంక్షించారు. ఇందుకు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గురించి ఓటర్లలో పూర్తి స్థాయి అవగాహన కల్పించటంతో పాటు పోలింగ్ రోజు ప్రతి ఓటరు విధిగా తమ ఓటుహక్కును సద్వినియోగం చేసేలా వారిని చైతన్యవంతులను చేస్తామన్నారు. ఇందుకు 20 స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేసేందుకు ఒక గొడుగు కిందకు వచ్చాయని వివరించారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ రోజు, ఆ తర్వాత కూడా ఎన్నికల విధులకు సంబంధించి ఈవాచ్ ఎన్నికల సంఘంతో కలిసి పనిచేయనున్నట్టు వివరించారు. ఎన్నికల్లో డబ్బులు, మద్యం వంటివి పంపిణీ చేసినా, ఇతర రకరకాలుగా నిబంధనలను ఉల్లంఘించినట్లు సమాచారమొస్తే ఎన్నికల కమిషన్‌కు సత్వరమే సమాచారం అందించనున్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి తెలిపారు. తెలంగాణ ఎలక్షన్ వాచ్ వేదికగా జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పని చేసేందుకు తమతో పాటు అప్స, కోవా, ఛత్రీ, ఎవీ ఫౌండేషన్, రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్, అభిప్రాయ, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక, కన్స్యూమర్ కౌన్సిల్ వంటి సంస్థలు ముందుకొచ్చినట్లు తెలిపారు. భారతఎన్నికల ముఖ్య అధికారిగా విధులు నిర్వర్తించిన లింగ్డో వంటి అపారమైన అనుభవం కల్గిన ప్రముఖులు కూడా ఈ ఎలక్షన్ వాచ్‌కు సూచనలు, సలహాలివ్వనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం అసోసియేషన్ ఫర్ ప్రమోటింగ్ స్పెషల్ యాక్షన్(అప్స) ఆధ్వర్యంలో ఓటర్లకు సహకరించేందుకు, అభ్యర్థుల పట్ల ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు డివిజన్ల వారీగా ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు. డివిజన్లవారీగా పోటీ చేసే వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతో ఓటర్ల ‘ముఖాముఖి’ వంటి కార్యక్రమాలతో పాటు పోలింగ్ రోజు ఎవరి ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉన్నది అన్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంపిణీ, కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఫిర్యాదులను స్వీకరించేందుకు జిహెచ్‌ఎంసి టోల్‌ఫ్రీ నెంబర్‌తో పాటు త్వరలోనే ప్రత్యేకంగా మరో నెంబర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు తెలంగాణ వాచ్ భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు వెల్లడించారు.

ఉద్యమ లక్ష్యాలకు
విరుద్ధంగా రాష్ట్రంలో పాలన
- టిడిపి నేత రేవంత్ రెడ్డి -
ఖైరతాబాద్, జనవరి 19: ఉద్యమ లక్ష్యాలకు విరుద్ధంగా తెలంగాణలో పాలన కొనసాగుతుందని టిడిపి నేత రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో టియూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కెటిఆర్ విసరిన సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని, సవాల్‌కు వారు కట్టుబడి ఉంటారా అన్నారు. ఏళ్ల పోరాటాల అనంతరం ఏర్పడ్డ పాలన గతంలో కంటే భిన్నంగా ఏమి లేదని, అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో చివరకు అమరులను గుర్తించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. లక్ష్యాలకు విరుద్ధమైన పాలనపై ఆగ్రహంగా, ఆవేదనగా ఉందని చెప్పారు. ప్రభుత్వాన్ని నడిపే మెజారిటీ ఉన్నా.. నయానో, భయానో ఇతర పార్టీల నాయకులను లాక్కోవడం దారుణమని చెప్పారు. స్వయంగా సిఎం హాదాలో కేసిఆరే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని, దీంతో దేశంలోని 28 రాష్ట్రాల ముందు తలదించుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలక పక్షం మాత్రమే ఉండాలనే ధోరణిలో తెలంగాణలో పాలన కొనసాగుతుందని, ఇది ఎక్కడా సాధ్యం కాదని, కాలేదని తెలిపారు. అమరవీరులకు తీరని అన్యాయం జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. సమైక్య రాష్ట్రంలో అధికారికంగా ప్రారంభం కాని అమరు వీరుల స్థూపాన్ని ఇప్పటికీ ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెడుతూ పాలన చేస్తున్నారని, దీనిపై ప్రజలకు వివరించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని పేర్కొన్నారు. గ్రేటర్‌లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఈనెల 21 నుంచి 27 వరకు పార్టీ అగ్రనేతలు నారా లోకేష్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లితో పాటు ప్రచారం నిర్వహిస్తామని వివరించారు. చంద్రబాబు 27, 28, 29 తేదీల్లో రోడ్‌షోలలో పాల్గొంటారని చెప్పారు. చివరి రోజు 150 డివిజన్లలో లక్ష బైక్‌లతో ర్యాలీలు నిర్వహిస్తామని వివరించారు. టికెట్లు అమ్ముకున్నార