హైదరాబాద్

నిలోఫర్ ఆసుపత్రికి ‘తెలంగాణ జాగృతి’ తరపున పది వార్మర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డితో కలిసి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బుధవారం నగరంలోని నిలోఫర్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి తరపున రూ. 14 లక్షల విలువైన పది వార్మర్స్‌ను ఆసుపత్రికి అందజేశారు. నెలలు తక్కువగా ఉన్న శిశువులకు వినియోగించే ఈ వార్మర్లను ఆమె బుధవారం ప్రారంభించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవల గురించి ఈ సందర్భంగా ఆమె రోగుల సహాయకులను అడిగి తెల్సుకున్నారు. వివిధ వార్డుల్లో పర్యటిస్తూ ఆమె అపుడే పుట్టిన పలువురు చిన్నారులను ఎత్తుకుని మురిసిపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సహాయ కార్యక్రమాలైనా సరే జాగృతి ముందుంటుందని ఆమె పేర్కొన్నారు. వైద్య రంగం అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆ తర్వాత నిలోఫర్ ఆసుపత్రి ఉద్యోగులతో కలిసి ఆమె ఆసుప్రతి ఆవరణలో బతుకమ్మ ఆడారు. అనంతరం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశాఖను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నరు. 500 బెడ్స్ ఉన్న నిలోఫర్ ఆసుపత్రిలో ఎపుడూ వెయ్యి మంది పిల్లలు ఉంటున్నారని తెలిపార. నిలోఫర్‌లో ఉద్యోగుల కొరత కూడా ఉందన్నారు. రాష్ట్రంలో కొత్త పోస్టులను క్రియేట్ చేస్తున్నామని తెలిపారు. అదనంగా మరో 3వేల పోస్టులను సిద్దం చేస్తున్నట్లు ఆయన వివరించారు. త్వరలో వీటిపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. అవిభక్త కవలలు వీణావాణిను స్టేట్ హోం కు తరలిస్తామని, ఆస్ట్రేలియా వైద్యుల నుంచి రిపోర్టు రాగానే తగు చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.