హైదరాబాద్

నేడు సేవ్ టెంపుల్స్ డాక్యుమెంటరీ చలన చిత్రోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్.ఆర్గ్ (యుఎస్) సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సేవ్ టెంపుల్స్ డాక్యుమెంటరీ చలన చిత్రోత్సవం నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రచార సారథి డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. బంజారాహిల్స్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో 1న మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 8గంటల వరకు చిత్రోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కురుమూర్తి రాయ, మహేంద్రగిరి, మనుషులు చేసిన దేవుడు, కొలిమిగుండ్ల లక్ష్మీ నరసింహ స్వామి, మా వూరి దేవుడు అందిరి వాడు, మన వైభవం, మరో నాలుగు డాక్యుమెంటరీలు ప్రదర్శిస్తారని వెల్లడించారు.
జ్యూరీ సభ్యులుగా దర్శకుడు గోపాలకృష్ణ, సినీ నట శిక్షక్షుడు డిఎస్ దీక్షిత్, గేయ రచయత సిరాశ్రీ వ్యవహరిస్తారు. సాయంత్రం 7గంటలకు జరిగే బహుమతి ప్రదానోత్సవానికి స్వరూపానందేంద్ర సరస్వతి, ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, పూర్వ డిజిపి అరవిందరావు తదితరులు హాజరవుతారని సంస్థ అధ్యక్షుడు ప్రొ.ప్రకాశరావు వెలగపూడి, ప్రచార సారథి డా.గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు.