హైదరాబాద్

మైనారిటీలను మోసగిస్తున్న ఎంఐఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జనవరి 20: మైనారిటీ ముస్లింలను మభ్యపెడుతూ ఎన్నికల్లో గెలుపొందుతున్న ఎంఐఎంకి తగిన బుద్ధి చెప్పాలని రంగారెడ్డి జిల్లా తెదేపా అధ్యక్షుడు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. బుధవారం శాస్ర్తిపురం, సులేమాన్‌నగర్ డివిజన్లలో టిడిపి అభ్యర్థులకు మద్దతుగా ఆయా బస్తీల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ముందుగా దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికల్లో ముస్లింలను అమాయకులను చేసి ఎంఐఎం పబ్బం గడుపుతూ అధికారంలోకి వస్తుందని అన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకొని ఎంఐఎం ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మారిందని చెప్పారు. ముస్లింలు అప్రమత్తంగా ఉండి తమ అభివృద్ధికి పాటుపడుతున్న పార్టీలను ఎన్నుకోవాలని సూచించారు. ఎంపిగా ఉన్న అసదుద్దీన్.. హైదరాబాద్‌కు ఏమి చేశాడో చూపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహ్మద్ ఇసాక్, తౌఫిక్, జోహాన్, షబ్బీర్, షాంగ్, నిజాముద్దీన్ పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్, బిజెపిలకు తగిన గుణపాఠం చెప్పాలి
ఎల్‌బినగర్, జనవరి 20: రానున్న జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజలను మభ్యపెడుతున్న టి ఆర్ ఎస్, బిజేపిలకు గుణపాఠం చెప్పాలని ఆర్కేపురం డివిజన్ కాంగ్రేస్ పార్టీ కార్పోరేటర్ అభ్యర్థి దేప సురేఖ భాస్కర్‌రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని అల్కాపురి, హరిపురికాలనీలలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ, రాష్ట్రాలలో అధికార ప్రభుత్వాలు అమలు కానీ హామీలను గుప్పించి ప్రజలను మోసం చేస్తున్నారని, అలాంటి ప్రభుత్వాలకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఐదు సంవత్సరాలుగా ఆర్కేపురం డివిజన్‌లో కార్పోరేటర్‌గా ఎంతో అభివృద్ధి చేశానని, మళ్ళీ అధికారంలోకి వస్తే డివిజన్‌ను ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అనంతరం మల్‌రెడ్డి రంగారెడ్డి సమక్షంలో బిజేపి, టిడిపి, టిఆర్‌ఎస్ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రేస్ పార్టీలో చేరగా వారిని మల్‌రెడ్డి రంగారెడ్డి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. సీనియర్ నాయకుడు దేప భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రీశైలం, సురేందర్, బాలు, మనోజ్, శ్రీకాంత్, భరత్, నాగమహేశ్, కృష్ణ, అనీల్, నాగరాజు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.