హైదరాబాద్

వైభవంగా బతుకమ్మ సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 30: బతుకమ్మ పండుగను రాష్టవ్య్రాప్తంగా వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ అన్నారు. శుక్రవారం సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లతో బతుకమ్మ పండుగ ఏర్పాట్ల పై సమీక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకైన బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. బతుకమ్మ పండుగకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు అక్టోబర్ ఎనిమిదవ తేదీన నగరంలోని ఎల్‌బి స్టేడియంలో బతుకమ్మ పండుగను జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ సంస్కృతికి వనె్న తెచ్చే విధంగా వాడవాడలా బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్‌లను ఆదేశించారు. అక్టోబర్ 9వ తేదీన ఊరూరా బతుకమ్మ ముగింపు వేడుకల్లి ట్యాంక్‌బండ్ పై ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బతుకమ్మ వేడుకలను చక్కగా నిర్వహించిన జిల్లాలను గుర్తించి వారికి మొదటి బహుమతిగా రూ.5 లక్షలు, రెండవ బహుమతిగా రూ.3 లక్షలు, మూడవ బహుమతిగా రూ.2 లక్షలను ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా వీలైన జిల్లాలలో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ డ్వాక్రా మహిళలు చేసిన వస్తువులతో ప్రదర్శన ఏర్పాటు చేయాలని అన్నారు. బతుకమ్మ నిర్వహించే చెరువుల దగ్గర లైటింగ్, సౌండ్ సిస్టమ్ తదితర వసతులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి మాట్లాడుతూ బతుకమ్మ పూలపండుగని క్రియాశీలకంగా, ఉత్సాహంగా అన్ని జిల్లాలు నిర్వహించాలని అన్నారు. ఎక్కడా లేని విధంగా ఆడబిడ్డలే జరుపుకునే ఈ పండుగను తెలంగాణ సంస్కృతి ఇనుమడించే విధంగా జరుపుకోవాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి మాట్లాడుతూ జిల్లాలో బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 8వ తేదీన వికారాబాద్‌లో పెద్దఎత్తున మహిళలతో జిల్లాస్థాయి వేడుకలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పర్యాటన సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, టిఎస్‌ఎస్ చైర్మన్ రసమయి బాలకృష్ణ, డ్వామా పిడి హరిత, సమాచార శాఖ ఉపసంచాలకులు పిబి సరస్వతి పాల్గొన్నారు.