హైదరాబాద్

పాతబస్తీ అభివృద్ధికి కేసిఆర్ కృషి: మహమూద్ అలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సైదాబాద్, అక్టోబర్ 3: తెలంగాణ ప్రభుత్వం సిఎం కెసీఆర్ నాయకత్వంలో పాతబస్తీ అభివృద్దికి సమగ్ర చర్యలు తీసుకుంటుందని ముఖ్యంగా మైనార్టీలను విద్యా రంగంలో మిగతా వర్గాలతో సమానంగా అభివృద్ధి చేసేందుకు వీలుగా పాఠశాలలను ఏర్పాటుకు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. యాకుత్‌పురా నియోజకవర్గంలోని ఐఎస్ సదన్ సమీపంలోని హేమానగర్‌లో ఎమ్మెల్సీ నిధుల నుండి మంజూరు చేసిన రూ.5.10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఇంగ్లీషు మీడియం మోడల్ స్కూలుకు హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్‌తో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ పాతబస్తీలోని విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలు కలిగిన నాణ్యమైన విద్యను ఉచితంగా అందజేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యాపరంగా వెనుకబడిన యాకుత్‌పురా నియోజకవర్గంలో పాఠశాలల అభివృద్ధికి తన ఎమ్మెల్సీకి సంబంధించిన రెండు సంవత్సరాల బడ్జెట్‌లో సింహభాగం నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ఈ పాఠశాలల వల్ల నియోజకవర్గంలో నివసిస్తున్న ముస్లిం, ఇతర వర్గాల పేదపిల్లలకు ఇంగ్లీషు మీడియంలో ఉచితంగా చదువుకునే అవకాశం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ మైనార్టీలకు విద్యాపరంగా పలు అవకాశాలు కల్పించి తద్వారా అతర్జాతీయ విద్యా సంస్థల్లో చదువుకునేందుకు వీలుగా సిఎం నిబద్దతతో ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా పాల్గొన్నారు.