హైదరాబాద్

పాతబస్తీలో నకిలీ నోట్ల చెలామణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: హైదరాబాద్ పాతబస్తీలో నకిలీ నోట్ల చెలామణి ముఠా గుట్టు రట్టయింది. సోమవారం నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముగ్గురిని సౌత్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 7 లక్షలు విలువచేసే నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు బెంగాల్ వాసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ తలాబ్‌కట్టకు చెందిన షేక్ గౌస్‌పాషా గత మే నెలలో నకిలీ కరెన్సీ చెలామణి చేస్తుండగా చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో జైలుకెళ్లిన గౌస్‌పాషా జైలు నుంచి విడుదలై వెస్ట్‌బెంగాల్‌కు చెందిన కల్మల్ హక్, సలీం మియాతో పరిచయమై నకిలీ కరెన్సీ దందాను మళ్లీ మొదలుపెట్టాడు. 1:2 నిష్పత్తి బేసిస్‌పై వెస్ట్‌బెంగాల్ నుంచి ఫేక్ ఇండియన్ కరెన్సీ తెచ్చేందుకు కల్మల్ హక్, సలీం మియాను కోల్‌కత్తలోని సైదుల్లా వద్దకు పంపించాడు. దీంతో వారు అక్కడి నుంచి రూ. 7 లక్షలు నకిలీ ఇండియన్ కరెన్సీని తెచ్చారు. సోమవారం వారిని అరెస్టు చేసి నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం భవానీనగర్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్టు టాస్క్ఫోర్స్ డిసిపి కోటిరెడ్డి తెలిపారు.