హైదరాబాద్

సమగ్ర సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: వర్షం కాస్త దంచికొట్టిందంటే చాలు ఎపుడు ఏ ప్రాంతం నీట మునిగిపోతుందో తెలియని ఆందోళనకర పరిస్థితులు. కొద్దిరోజుల క్రితం నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినపుడు ఎపుడు ఎం జరుగుతుందోనన్న ఆందోళన పాలకులు, ప్రజల్లో వ్యక్తమైన నేపథ్యంలో ఎంత వర్షం పడినా, వర్షపు నీరు సజావుగా ప్రవహించేందుకు అనుకూలమైన పరిస్థితులను కల్పించేందుకు సర్కారు నడుం భిగించిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా నాలాలకిరువైపులా, చెరువుల్లో వెలసిన ఆక్రమణలను పెద్ద ఎత్తున తొలగించే చర్యలు చేపట్టారు. అయితే నగరంలో ప్రస్తుతమున్న నాలాలు, వాటిపై వెలసిన ఆక్రమణలు, చెరువుల్లో నిర్మితమైన అక్రమ నిర్మాణాలకు సంబంధించి జిహెచ్‌ఎంసి, రెవెన్యూ విభాగాల్లోనున్న రికార్డుల్లో సమాచారం ట్యాలీకాకపోవటం, ఇదే లొసుగును ఆసరాగా చేసుకుని ఆక్రమణదారులు తప్పించుకోవటం వంటి లోపాలను గుర్తించిన జిహెచ్‌ఎంసి ఉపగ్రహం సహాయంతో నాలాల పాతకాలపు ఛాయాచిత్రాలను ఆధారంగా చేసుకుని అప్పటికీ, ఇప్పటికీ నాలాలు, చెరువులు కుదించుకుపోయిన తీరు, ఇరువైపులా వెలసిన ఆక్రమణలను గుర్తించేందుకు చేపట్టిన ప్రత్యేక సర్వే సోమవారం చురుకుగా కొనసాగింది. ఇందులో భాగంగా జిహెచ్‌ఎంసి, రెవెన్యూ, పోలీసు, నీటి పారుదల శాఖలతో ఏర్పాటు చేసిన 32 ప్రత్యేక బృందాలు 23 నాలాలను పరిశీలించారు. పక్కాగా శాస్ర్తియంగా ఆక్రమణలను గుర్తించి, వాటి తొలగింపుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని సైతం సిద్దం చేయటంతో పాటు ఆక్రమణదారుల్లో వాస్తవానికి నివసించేందుకు ఇళ్లు లేక నాలాల ఆక్రమణల్లో తలదాచుకుంటున్న వారిలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలెన్ని అన్నది కూడా ఈ బృందాలు తమ సర్వేలో ప్రామాణికంగా తీసుకుని ముందుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
అధ్యయనం ఇలా...
ఈ సర్వేలో భాగంగా గతంలో నాలా రూపురేఖలు, ప్రస్తుత తీరు, వచ్చిన ఆక్రమణలు, వాటి తొలగింపుకున్న న్యాయపరమైన అడ్డంకులు వంటివి అధ్యయనం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పక్కా సమాచారాన్ని శాస్ర్తియంగా ఈ సర్వే ద్వారా నిర్ధారించనున్నారు. నాలాలు, వాటిపై వెలసిన ఆక్రమణలకు సంబంధించి ఇప్పటి వరకున్న వివరాలతో జిఐఎస్ విభాగం ఆటోక్యాడ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి నాలా మొత్తం పొడువును భాగాలుగా విభజించి కొలతలు నమోదు చేశారు. నాలాల టోటోశీట్స్, రిమోట్ సెన్సింగ్ ఆధారంగా గుర్తించిన మ్యాప్‌ల ఆధారంగా ఆక్రమణలను గుర్తిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రిమోట్ స్పేస్ అప్లికేషన్స్ శాఖ అందించిన చిత్రాలను కిర్లోస్కర్, వాయింట్ కన్సల్టెంట్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సర్వే ఆఫ్ ఇండియా టోపోశీట్స్, విలేజ్ మ్యాప్‌లను అత్యాధునిక ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి నాలా వెంబడి ఆక్రమణలను ఈ బృందాలు గుర్తిస్తాయి. ఈ ప్రక్రిను జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నారు.