హైదరాబాద్

భాగ్యనగరానికి బతుకమ్మ శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్న భాగ్యనగరం బతుకమ్మ శోభను సంతరించుకోనుంది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న బతుకమ్మ పండుగకు బల్దియా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సారి నగరం వేదికగా ఒకవైపు పర్యాటక శాఖ, మరో వైపు జిహెచ్‌ఎంసిలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ పూల పండుగలో మహిళలు, చిన్నారులు ఎక్కువ మంది పాల్గొనే అవకాశమున్నందున మహిళలకు వౌలిక వసతులు కలన, వారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సారి బతుకమ్మ పండుగకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు లభించేలా భారీ ఏర్పాట్లతో పండుగను నిర్వహించటంలో బల్దియా తలమునకలైంది. ఇందులో భాగంగానే సాగర తీరన ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక లైటింగ్, సౌట్ సిస్టమ్‌లను ఏర్పాటు పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఈ నెల 8న ఇరవై అడుగుల ఎత్తుతో పేర్చనున్న బతుకమ్మ చుట్టూ ఒకేసారి పదివేల మంది మహిళలు బతుకమ్మ ఆడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం నుంచి స్వయం సహాయక బృందాల మహిళలకు ప్రత్యేక శిక్షణనివ్వనున్నారు. బుధవారం రెండు వేల, మరుసటి రోజైన గురువారం కూడా రెండు వేల మంది మహిళలకు శిక్షణనిస్తూ, వారు తమ బృందంలోని మహిళలకు శిక్షణనిచ్చేలా వారిని తీర్చిదిద్దేందుకు సిద్దమయ్యారు. ప్రకృతిని ఆరాధించే పండుగైన బతుకమ్మ సంబరాలను ఈ సారి నగర ప్రతిష్ట మరింత పెంచేలా నిర్వహించనున్నట్లు మేయర్ బొంతురామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇందుకు గాను మహిళల సమీకరణ, వారికి శిక్షణనివ్వటంతో పాటు 8వ తేదీన ఎల్బీస్టేడియంకు, ట్యాంక్‌బండ్‌పై జరిగే వేడుకలకు మహిళలను సమీకరించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించారు. ఈ సారి బతుకమ్మ ఉత్సవాల్లో విదేశీ మహిళలు పాల్గొని, ప్రత్యేక ఆకర్షణగా నిలిపే బాధ్యతలను మేయర్ బొంతు రామ్మోహన్ స్వీకరించారు. వచ్చే సంవత్సరం ఏకంగా లక్ష మంది విదేశీయులు ఈ ఉత్సవాల్లో పాల్గొనే కాస్త ముందు నుంచే చొరవ తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా పర్యాటకుల సంఖ్య పెరిగితే విదేశీ మారక ద్రవ్యం అధికంగా రావటం ద్వారా హైదరాబాద్ అభివృద్ధి నిధుల సమీకరణ సులువవుతోందని భావిస్తున్నారు. అంతేగాక, 9వ తేదీన ట్యాంక్‌బండ్‌పై జరిగే సంబరాల్లో ప్రత్యేక స్టాళ్ల ద్వారా తెలంగాణ వంటకాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున బాణా సంచాలను కాల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేగాక బతుకమ్మ ప్రత్యేకతను, ప్రాధాన్యతను చాటిచెప్పేలా వివిధ ప్రధాన కూడళ్లలో ప్రత్యేక స్వాగతతోరణాలను ఏర్పాటు చేస్తున్నారు.
300 ప్రత్యేక ప్రదర్శన
బతుకమ్మ సంబరాల్లో భాగంగా కృష్ణానదిలో ఉపయోగించే 300 పుట్టీలతో ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పుట్టిల్లో ప్రత్యేక లైటింగ్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నట్లు అధికారులు వెల్లడించారు.