హైదరాబాద్

సమాచార శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: సమాచార పౌర సంబంధాల శాఖ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకను కమిషనర్ కార్యాలయం ఆవరణలో బుధవారం ఘనంగా నిర్వహించారు. మహిళలతోపాటు కమిషనర్ బతుకమ్మ ఆడారు. అంతకు ముందు కార్యాలయం వద్దగల కనక దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ నవీన్ మిట్టల్ అధికారులకు, ఉద్యోగులకు, మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ గెజిటెడ్ భవన్‌లో అధికారుల సంఘం చైర్మన్, వ్యవస్థాపక అధ్యక్షుడు వి శ్రీనివాస్‌గౌడ్ బతుకమ్మ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహిళల రక్షణకు తగు చర్యలు తీసుకుంటున్నందుకు, వారి రక్షణకు షీ టీమ్స్ ఏర్పాటు చేసి వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ భవన్‌లో గురువారం బతుకమ్మ వేడుకను నిర్వహించనున్నట్టు శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.