హైదరాబాద్

టెండర్ల గడువు తగ్గించాలని సర్కారుకు గ్రేటర్ కమిషనర్ లేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: మహానగర పాలక సంస్థ నగరంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి చేపట్టే టెండర్ల ప్రక్రియ గడువును తగ్గించాలని కోరుతూ కమిషనర్ జనార్దన్ రెడ్డి బుధవారం రాష్ట్ర ప్రభుత్వ పురపాలక, నగరాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. 2003 జూలై 1న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ద్వారా ఇంజనీరింగ్ పనులు చేపట్టడానికి టెండర్ల మొదటి సారి చేపట్టే స్వీకరణ ప్రక్రియకు 14 రోజులు గడువుగా, రెండో సారి టెండర్ల ఆహ్వానానికి కనీసం ఏడు రోజుల గడువు ఉండాలని అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు కమిషనర్ తన లేఖలో పేర్కొన్నారు. అయితే నగరంలో అత్యవసరమైన పనులైన రోడ్ల మరమ్మతులు, డ్రెయిన్‌లకు స్వల్ప మరమ్మతులు, రోడ్ల తవ్వకం, వాటి పునరుద్దరణ తదితర అత్యవసర నిర్వాహణ పనులను వెంటనే చేపట్టాల్సి వస్తుందని కూడా కమిషనర్ ప్రతిపాదనల్లో సర్కారుకు వెల్లడించారు. ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాల వల్ల పెద్ద ఎత్తున దెబ్బతిన్న రోడ్లు, డ్రెయిన్‌లను యుద్దప్రాతిపదికన పునరుద్దరించాల్సి వచ్చిందని కమిషనర్ తన లేఖలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో అత్యవసర పనులను చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం అమల్లో ఉన్న టెండర్ల స్వీకరణ గడువు 14 రోజులను ఏడు రోజులకు, రెండోసారి ఆహ్వానించినట్లయితే కాల్ సమయాన్ని ఏడు రోజుల నుంచి మూడు రోజులకు కుదించాలని కోరుతూ కమిషనర్ జనార్దన్ రెడ్డి ప్రతిపాదనలు పంపారు. టెండర్ల గడువును కుదించుకోగలిగితే పనులు కూడా త్వరగా ప్రారంభమయ్యే అవకాశముంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరికి లాభం ?
ప్రస్తుతం ఈ ప్రొక్యూర్‌మెంట్‌తో విధానంతో టెండర్లను స్వీకరిస్తున్న జిహెచ్‌ఎంసికి డబుల్ బెడ్ రూంతో పాటు వివిధ పలు ప్రాజెక్టులకు కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదు. ఇక టెండర్ల ప్రక్రియ గడువును మరింత కుదిస్తే ముందుకొచ్చే కాంట్రాక్టర్ల సంఖ్య మరింత తగ్గే అవకాశం లేకపోలేదు. దీంతో ఎవరికి లాభం అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టెండర్లను ఆన్‌లైన్‌లో చేపడుతున్నందున, దానిపై అవగాహన లేక ఎంతో కొంత మంది కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకొస్తుండగా, గడువు కుదిస్తే ఎక్కువ మంది కాంట్రాక్టర్ల నుంచి బిడ్లు వచ్చే అవకాశాలు అంతంతమాత్రమేనని కొందరు కాంట్రాక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.