హైదరాబాద్

‘ట్రాఫిక్’ మెగా అదాలత్‌కు అపూర్వ స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా జరిమానాల భారీనపడిన వాహనదారులు ఒకేసారి బిల్లును చెల్లిస్తే మొత్తంలో సగం మాఫీ చేస్తామని హైదరాబాద్ నగర ట్రాఫిక్(1) డిసిపి ఎవి రంగనాథ్ తెలిపారు. గోషామహల్‌లోని పోలీస్ స్టేడియంలో ఈనెల 5, 6, 7 తేదీల్లో మెగా అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. గోషామహల్ పోలీస్టేడియంలో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్‌ను డిసిపి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. బుధవారం వాహనాదారుల సౌకార్యర్ధం నిర్వహిస్తున్న కార్యక్రమానికి వాహనాదారుల నుంచి మంచి స్పందన లభిస్తొందని అన్నారు. మెగా అదాలత్‌లో పాల్గొనే చలాన్ చెల్లించే వ్యక్తి వాహనానికి సంబంధించిన చాలాన్ లిస్టుతో పాటు తమ పెర్లను ధరఖాస్తుపై రాసి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఒక్కరోజే 3057 మంది వాహనాదారులు జరిమానాలను చెల్లించారని దీంతో రూ.24.08లక్షలు వసూళ్లు అయ్యాయని తెలిపారు. ఈ అదాలత్‌లో వాహనదారులకు విధించిన పెనాల్టీ మొత్తంలో సగం మాఫీ చేస్తామని చెప్పారు. ట్రాఫిక్ చలాన్‌లకు సంబంధించిన కేసుల నుంచి వాహనాదారులు బయట పడటానికి అవకాశం కల్పించిందని, రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాహనాదారుల ఉల్లంఘనలను పరిగణలోకి తీసుకుని పాయింట్ల ద్వారా లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. పాయింట్ల ఆధారంగా వాహనాదారుడి లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టాడానికి వాహనాదారులకు ట్రాఫిక్‌పై పూర్తి స్థాయి అవగాహనను కల్పించేందుకు కౌన్సిలింగ్ కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నమని పేర్కొన్నారు. సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్, మొబైల్ మాట్లాడుతూ వాహనాలను నడుపుతూ వెలాది మంది సిసి కెమెరాలకు చిక్కుతున్నారని, ఇలా పట్టుబడని వందాలాది మందికి ప్రతిరోజు ఇ-చలాన్‌లు పంపుతున్నారని చెప్పారు. వాహనాలు కొన్నపుడు, అమ్మినపుడు పెండింగ్ చలాన్‌లు చాలా కీలకమని సందర్భంగా తెలిపారు. వాహనాలు రిజిస్ట్రేషన్ చేసేందుకు రవాణా శాఖ విభాగంలో తప్పకుండా ఎన్‌ఓసి సర్ట్ఫికెట్‌లను సమర్పించిన తరువాతే రిజిస్ట్రేషన్ చేస్తారని, ఈ పరిస్థితుల్లో వాహనాదారులు పెండింగ్ చలాన్‌లకు సంబంధించిన సొమ్మును చెల్లించేందుకు ఇది మంచి అవకాశమని దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
గోషామహల్‌లోని పోలీస్టేడియంలో నిర్వహించనున్న మెగా అదాలత్‌ను రద్దీని బట్టి పొడిగిస్తామని డిసిపి రంగనాథ్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం నాలుగు తురువాత వహనాదారులను గోషామహల్ స్టేడియంలోకి అనుమతించలేదు. వందాలాది మంది వాహనాదారులు చలాన్‌లు చెల్లించడానికి వచ్చి వారిని ట్రాఫిక్ పోలీసులు అనుమతించకపోవడంతో నిరుత్సాహంతో వెనుదిరిగారు.