హైదరాబాద్

అధికారులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆక్టోబర్ 6: ప్రజలిచ్చే ఫిర్యాదుల పట్ల అధికారులు, సిబ్బంది భాద్యత యుతంగా వ్యవహరించాలని జలమండలి మెయింటనెన్స్ విభాగం డైరెక్టర్ జి.రామేశ్వరరావు అన్నారు. జలమండలి ఆధ్వర్యంలో వినియోగదారులు ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు గాను జల్‌యాప్‌ను ప్రారంభించింది. జలమండలి ప్రధాన కార్యాలయంలోని మెట్రో కస్టమర్ కేర్ (ఎంసిసి)కు అందే ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం సంబంధిత అధికారి, లైన్‌మెన్‌లకు తక్షణమే అందే విధంగా ఏర్పాట్లు చేశారు. మెయింటనెన్స్ విభాగంలో పనిచేసే అధికారులతో పాటు ఫీల్డులో పనిచేసే లైన్‌లెన్, వర్క్ ఇన్‌స్పెక్టర్లకు ఆండ్రాయిడ్ ఫోన్లను జలమండలి అందజేసింది. ఆండ్రాయిడ్ ఫోన్‌ల పనితీరు తదితర అంశాలపై డైరెక్టర్ రామేశ్వరరావు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నారాయణగూడాలోని డివిజన్-5 మెయింటనెన్స్ విభాగం కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఓఆండ్‌ఎం డైరెక్టర్ (పిఅండ్‌ఎ) అజీరా కృష్ణ, సర్కిల్-1 సిజిఎం రవి, జిఎం రాజలతో కలిసి సమావేశమయ్యారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకున్న కార్యక్రమాల్లో ఆండ్రాయిడ్ ఫోన్ సిబ్బంది, అధికారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రామేశ్వరరావు తెలిపారు.