హైదరాబాద్

మెడికల్ హబ్‌గా నగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, అక్టోబర్ 6: హైదరాబాద్ మహానగరాన్ని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం రాజ్‌భవన్ రోడ్‌లోని నూతనంగా నిర్మించిన ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. మహబూబ్‌నగర్, ఇఎస్‌ఐ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. వీటితో పాటు మూడూ ప్రైవేట్ మెడికల్ కాలేజీల ద్వారా అత్యుత్తమ వైద్యులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. వైద్య చికిత్సలో కీలక భూమిక పోషించే నర్సింగ్ వృత్తి నోబుల్ వత్తి అని అన్నారు. అవసరాలకు తగినట్టు నర్సింగ్ కాలేజీలకు సైతం తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. అనంతరం నర్సింగ్ కాలేజీలో జరిగిన బతుకమ్మ వేడుకలను మంత్రి ఆసక్తిగా తిలకించారు. నర్సింగ్ కాలేజీ ప్రాంగణంలో శిధిలావస్థలో ఉన్న పాత భవాన్ని తొలగించాలని మంత్రి లక్ష్మారెడ్డికి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. ఈ సమావేశంలో స్థానిక కార్పోరేటర్ విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.