హైదరాబాద్

నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేగంపేట, అక్టోబర్ 6: సనత్‌నగర్, సికింద్రాబాద్‌తో పాటు జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని ప్రజలు, పార్టీ శ్రేణులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో తలసాని జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని తన అనుచరులు, అభిమానులతో కలిసి గురువారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి దేవాలంయం ఇఓ అన్నపూర్ణ స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేక్ కట్‌చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి కార్యకర్తలు, అభిమానులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ తనపై అభిమానం చూపుతున్న ప్రతి కార్యకర్తతో పాటు నియోజకవర్గం ప్రజలకు ఎల్లపుడూ రుణపడి ఉంటానని హామీఇచ్చారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మా మూవీ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ నిర్మాత సి.కళ్యాణ్, నియోజకవర్గంలోని కార్పొరేటర్‌లు శేషుకుమారి, అత్తెలి అరుణగౌడు, అకుల రూప, కొలను లక్ష్మి, హేమలత, తరుణి, స్థానిక టిఆర్‌ఎస్ నేతలు శంకర్‌యాదవ్, ధర్మేంద్రయాదవ్, నాగులు, మల్లిఖార్జున్ గౌడు, శ్రీనివాస్‌గౌడు, నరేందర్‌రావు, లక్ష్మిపతి, అరువ గణేష్ తదితరులు పాల్గొన్నారు.