హైదరాబాద్

బతుకమ్మ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా పూలతో పేర్చి జరుపుకునే బతుకమ్మను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 8న ఎల్బీస్టేడియంలో, 9న ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన గురువారం ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఈ మేరకు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగను జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అంతేగాక, బతుకమ్మను నిమజ్జనం చేసేందుకు గనా ప్రత్యేకంగా కొలనులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెండురోజుల పాటు వరుసగా బతుకమ్మ ఉత్సవాలు జరుగనున్నందున ఎప్పటికపుడు పారిశుద్ద్య పనులు చేపట్టేందుకు గాను వెయ్యి 60 మంది కార్మికులనలు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. దీంతో పాటు మరో 95 మంది శానిటేషన్ ఫీల్డు అసిస్టెంట్లు, 11 బతుకమ్మ యాక్షన్ టీంలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 8న ఎల్బీ స్టేడియంలో గిన్నీస్ రికార్డు సాధించే తరహాలో పదివేల మంది మహిళలతో మహా బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు, అందుకు స్టేడియంలో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బతుకమ్మ నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌తో పాటు సరూర్‌నగర్, ఐడిఎల్ చెరువు, పెద్ద చెరువు తదితర ప్రాంతాల్లో విస్త్రృతంగా ఏర్పాట్లు చేశామన్నారు. బతుకమ్మ ఆడే ప్రాంతాలకు సమీపంలో తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, రోడ్లకు మరమ్మతులు, ప్రత్యేక లైటింగ్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నగరంలోని దాదాపు వంద ప్రాంతాల్లో భారీ సైజుల్లో బతుకమ్మలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బతుకమ్మ పండుగ ఔన్నత్యాన్ని తెలిపే ప్రకటన హోర్డింగ్‌లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు వివరించారు. నగరంలో ఇటీవల జరిగిన వినాయక ఉత్సవాల్లో భాగంగా గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేకంగా నిర్మించిన కొలనులను బతుకమ్మల నిమజ్జనానికి వినియోగించనున్నట్లు తెలిపారు. హుస్సేన్‌సాగర్, జలవిహార్ సమీపంలో ఇటీవల నిర్మించిన గణేష్ నిమజ్జన కొలను వద్ద ఏర్పాట్లను కమిషనర్ పరిశీలించారు. ఈ కొలనును బతుకమ్మల నిమజ్జనానికి స్వచ్ఛమైన నీటితో నింపాలని ఆదేశించారు. ఈ కొలను చుట్టూ బతుకమ్మలు ఆడే విధంగా మైదానాన్ని చదును చేయటంతో పాటు సరైన లైటింగ్, వౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. కమిషనర్‌తో పాటు జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, అదనపు కమిషనర్ రవికిరణ్, శంకరయ్య, సిఇ సుభాష్‌సింగ్ అధికారులు పాల్గొన్నారు.