హైదరాబాద్

కార్మిక సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 28: సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమాకి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం ఆయన నగరంలోని గోషామహల్‌లో వంద పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ ఇప్పటికే కార్మికులకు ఆధునిక వైద్యాన్ని అందించేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోని గోషామహల్ ప్రాంతంలో ఈ వంద పడకల ఆసుపత్రి అందుబాటులోకి వస్తే కార్మికులకు మరింత ప్రయోజనం చేకూరుతోందన్నారు. ఇఎస్‌ఐ ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు కార్మికులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పలు సంస్కరణలు తేనున్నట్లు ఆయన వివరించారు. కేవలం సంఘటిత కార్మికులకే గాక, అసంఘటిత కార్మికులుగా గుర్తించిన భవన నిర్మాణ కార్మికులు, ఆటో రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు వంటి వారికి సైతం మెరుగైన వైద్యం అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి మరో ఇఎస్‌ఐ ఆసుపత్రిని తీసుకువచ్చేందుకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఎంతో కృషి చేశారన్నారు. అంతేగాక, అసంఘటిత కార్మికులకు సైతం ఆధునిక, కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు ఆయన చేస్తున్న కృషిని మహమూద్ అలీ అభినందించారు.
అనంతరం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ గోషామహల్‌లో నిర్మించనున్న వంద పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రి మాధిరిగానే తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఆసుపత్రులు నిర్మించేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే టి. రాజాసింగ్, ఇఎస్‌ఐ డైరెక్టర్ డా.ఆర్.కె.కఠారియా, ఇఎస్‌ఐ మెడికల్ కమిషనర్ డా.పి.కె.జైన్ తదితరులు పాల్గొన్నారు.