హైదరాబాద్

రూ. 75 కోట్లతో 486 పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: నగరంలో ఇటీవల అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసి కొట్టుకుపోయిన రోడ్లకు ఎట్టకేలకు జిహెచ్‌ఎంసి మరమ్మతులను ప్రారంభించింది. రోడ్ల నిర్వాహణ అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్, మున్సిపల్ మంత్రి కెటిఆర్‌లు పలు సందర్భాల్లో మండిపడ్డ నేపథ్యంలో ఇపుడు కొత్తగా వేయనున్న బిటి రోడ్ల విషయంలో అధికారులు కాస్త ఆచితూచి వ్యవహారిస్తున్నారు. ఇందుకు గాను కమిషనర్ ప్రత్యేక కార్యచరణను జారీ చేయగా, పనులకు సంబంధించి గురువారం ఇంజనీర్లకు ప్రత్యేక శిక్షణను సైతం ఇచ్చేందుకు సిద్దమైంది జిహెచ్‌ఎంసి. ఈ పనుల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరిగినా, సహించేది లేదని కమిషనర్ హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే బేగంపేట నుంచి పంజాగుట్ట వరకు వైట్ ట్యాపింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టిన జిహెచ్‌ఎంసి బుధవారం నుంచి సుమారు రూ. 75 కోట్లతో దాదాపు 180 కిలోమీటర్ల పొడువు రోడ్లకు మరమ్మతు పనులను ప్రారంభించినట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు రూ. 75 కోట్ల అంచనా వ్యయంతో దాదాపు 486 పనులకు టెండర్లు ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు. వర్షాలు పూర్తిగా తగ్గి, వాతావరణం అనుకూలంగా ఉండటంతో పూర్తి స్థాయిలో బిటి రోడ్డు నిర్మాణాలను చేపడుతున్నట్లు వివరించారు. నూతనంగా నిర్మించే రోడ్ల నిర్మాణం సందర్భంగా క్షేత్ర స్థాయి సిబ్బంది, అధికారులు చేపట్టాల్సిన చర్యలను కమిషనర్ ప్రత్యేకంగా సూచించారు.
రోడ్డు నిర్మాణంలో చేపట్టాల్సిన చర్యలు
* రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను విధిగా పాటించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలి.
* రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను ఐఐటి, జెఎన్‌టియు, ఉస్మానియా విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, క్వాలిటీ కంట్రోల్ విభాగానికి అందించాలి.
* పనులకు సంబంధించి మినిట్ బుక్‌లను ఇంజనీరింగ్ అధికారులే తప్పనిసరిగా నిర్వహించాలి. కాంట్రాక్టర్లకు బుక్‌లు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరాదు.
* పనుల వివరాలను, పురోగతిని పారదర్శకత కోసం ఎప్పటికపుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలి.
* పనులు జరుగుతున్న ప్రాంతాల్లో పనుల తాలుకూ వివరాలు, వాటి విలువ, పూర్తి చేసేందుకు పట్టే సమయం వంటి వివరాలతో బోర్డులను ఏర్పాటు చేయాలి.
* రోడ్ల నిర్మాణ సమయంలో సీవరేజీ, మ్యాన్‌హోల్స్ ఉన్న వద్ద రోడ్డును సమాంతంగా పెంచాలి.
* ట్రాఫిక్ పోలీసులు, జలమండలి శాఖల అధికారులతో సమన్వయంతో రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలి.
* పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ సామర్థ్యతను అంచనా వేసుకుని, పనులు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి.
* మెట్రోరైలు పనులు చురుకుగా సాగుతున్న ఆయా ప్రాంతాల్లో రోడ్లకు మరమ్మతులు చేయాల్సిన బాధ్యత మెట్రోరైలు పైనే ఉందని, ఈ దిశగా మెట్రో రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని కమిషనర్ సూచించారు.
* ఇటీవలే నియమితులైన ఏఇ, ఏఇఇలతో పాటు ఇతర సీనియర్ ఇంజనీర్లతో కలిసి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఉండి మరీ పనులను పర్యవేక్షించాలి.
ఇంజనీర్లకు నేడు ప్రత్యేక శిక్షణ
నగరంలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్లయినా కొంత నాణ్యతతో, పారదర్శకంగా సాగే అంశంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇందుకు గాను ఇంజనీర్లకు గురువారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక శిక్షణనివ్వాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి భావిస్తున్నారు. ముఖ్యంగా నాణ్యత ప్రమాణాలు, మెజర్‌మెంట్ల నమోదు, పనుల వివరాలు, తనిఖీ అంశాలపై ప్రత్యేక శిక్షణనివ్వనున్నారు.