హైదరాబాద్

ఆది నుంచే అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: మహా నగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డిపి) ప్రాజెక్టు పనులకు ఆది నుంచే అడ్డంకులు ఎదురయ్యాయి. జిహెచ్‌ఎంసి అధికారులకు ముందు చూపు లేకపోవటంతో ఏ ప్రాజెక్టుకు టెండర్లు ఆహ్వానించినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటం, ఒక వేళ వచ్చినా, సకాలంలో పనులు ప్రారంభం కాకపోవటం అనేవి ఎన్నో సంవత్సరాలుగా అనేక ప్రాజెక్టులకు క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న అడ్డంకులు. కానీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎస్‌ఆర్‌డిపి పనులకు కూడా అవే పాత అడ్డంకులు ఎదురుకావటం గమనార్హం. కొద్దిరోజుల క్రితం వరకు గత జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు, ఇంజనీర్లకు ముందు చూపు లేకపోవటం వల్లే నగరంలో అభివృద్ధి పనులు, ఆధునిక రవాణా వ్యవస్థలు ఓ ప్రణాళిక ప్రకారం జరగలేదని విమర్శించిన నేతలు సైతం పక్కా ప్లాన్ ప్రకారం నగరంలో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నారు. ఇందుకు పరిపాలనపరంగానే గాక, సిబ్బంది పరంగా, క్షేత్ర స్థాయిలో నెలకొన్న అనేక సమస్యలే కారణాలని చెప్పవచ్చు. నగరంలో నిత్యం రద్ధీగా ఉండే రహదార్లలో కొంత వరకైనా ట్రాఫిక్‌ను తగ్గించేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, అప్పటి జిహెచ్‌ఎంసి కమిషనర్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలో ఆగమేఘాలపై ఈ ప్లాన్ ప్రతిపాదనలను తయారు చేశారు. ప్రతిపాదిత అంచనా వ్యయం సుమారు రూ. 25వేల కోట్లతో ఈ ప్లాన్ ప్రకారం మల్టీలేవెల్ ఫ్లై ఓవర్లు, గ్రేడ్ సపరేటర్లు, స్కైవేలు వంటివి నిర్మించుకుంటే రద్దీ ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, సిగ్నల్స్ లేకుండా వాహనదారులు సజావుగా ప్రయాణించే అవకాశం కలుగుతోంది.
అయితే ఇందులో భాగంగా మొదటి దశగా కెబిఆర్ పార్కు చుట్టు ఉన్న అయిదు ప్రధాన జంక్షన్లను కలుపుతూ సుమారు రూ. 1060 కోట్ల పనులను చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియను సైతం నిర్వహించి నెలలు గడుస్తున్నా, నేటికీ పనులు ప్రారంభం కాలేదు. అన్ని పనుల మాదిరిగానే ఈ పనులకు కూడా టెండర్ల సమయంలో తొలుత అన్యూటీ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం భావించింది. అంటే అది నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత బిల్లులు చెల్లంచే ప్రక్రియ కావటంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో టెండరు ప్రక్రియ విధానంలో స్వల్ప మార్పులు చేసి, ఈ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా మరో సారి టెండర్ల ప్రక్రియ చేపట్టి గుత్తేదార్లను ఖరారు చేశారు. జూలై మాసం చవర్లో పనులు ప్రారంభించాల్సి ఉండగా, నేటికీ అతీగతీలేదు. అంతేగాక, నిర్ణీత సమయంలో పనులు ప్రారంభించాల్సిందేనంటూ హడావుడి చేసిన అధికారులు పార్కు చుట్టు పలు నిర్మాణాలకు అనుమతులివ్వటం కూడా నిలిపివేశారు. కానీ నేటికీ పనులు ప్రారంభం కాలేదు. ఈ పార్కు చుట్టు బడా నిర్మాణాలు చేపట్టేందుకు ఓ కన్సార్టియ అనుమతి కోరినా, జిహెచ్‌ఎంసి మంజూరు చేయలేదు.
ఇంత హడావుడి చేసి నెలల తరబడి తమకు అనుమతులివ్వకుండా, టెండర్లు ఖరారైన తర్వాత కూడా పనులు చేపట్టకపోవటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో నిర్ణీత గడువులోపు పనులు ప్రారంభించాలని మున్సిపల్ మంత్రి కెటిఆర్ పట్టుబట్టినా, పార్కు చుట్టూ చెట్లను నరికివేస్తున్నారంటూ ఓ స్వచ్ఛంధ సంస్థ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, అభివృద్ధి పనులతో ఎన్ని చెట్లకు నష్టం వాటిల్లుతుందో అధ్యయనం చేసి పంపాలన్న ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు మరికొంత ఆలస్యమైంది. ఈ రకంగా ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్టుకు మొదటి నుంచి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి.