హైదరాబాద్

సిటీలో ‘హోం స్టే’ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: మహానగర చారిత్రక శోభ తిలకించేందుకు వచ్చే పర్యాటకుల కోసం రాష్ట్ర పర్యాటక శాఖ, జిహెచ్‌ఎంసిలు సంయుక్తంగా ‘హోం స్టే’ విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని గోవా, కేరళ, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ విధానాన్ని నగరంలో కూడా అమలు చేస్తే నగరానికి పర్యాటకుల సంఖ్య పెరగటంతో పాటు గృహా యజమానులకు ఆదాయ మార్గాలను పెంపొదించటంతో పాటు నగర ప్రతిష్టను మరింత పెంపొందించే అవకాశముంటుందని ఉభయ శాఖలు భావిస్తున్నాయి. భిన్న మతాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు ప్రధాన కూడలిగా ఉన్న హైదరాబాద్ నగరంలో ఈ విధానాన్ని అమలు చేస్తే సత్ఫలితాలుంటాయని భావిస్తున్న పర్యాటక శాఖ ఇందుకు జిహెచ్‌ఎంసి సహాయాన్ని కోరుతుంది. ఈ అంశంపై విస్త్రృతంగా చర్చించేందుకు జిహెచ్‌ఎంసిలో పర్యాటక శాఖ కమిషనర్ సునితా భగవత్, ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేంద్ర, జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్(పరిపాలన) రామకృష్ణారావు, అదనపు కమిషనర్ (యూసిడి) భాస్కరచారి, జోనల్ కమిషనర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ హోం స్టే విధానం అమలు చేసేందుకు నగరంలో ఆధునిక సౌకర్యాలు, పరిశుభ్రమైన వాతావరణం కలిగిన గృహాలను ఎంపిక చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ గృహాల్లో ఒక రూం నుంచి ఐదు రూంలు కల్గి ఉండి, కనీసం పది పడకల ఇళ్లను ఎంపిక చేసి, వీటిని సిల్వర్, గోల్డ్ అనే రెండు క్యాటగిరీలుగా పర్యాటకులకు అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. అంతేగాక, ప్రస్తుతమున్న హాస్టళ్లు, గెస్ట్‌హౌస్‌లు, క్లబ్ హౌస్‌లు, పెయింగ్ గెస్ట్‌లు, నివాసాలను ఈ హోం స్టే విధానం పరిధిలోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. అంతేగాక, ఈ విధానం అమలు విజయవంతమయ్యేందుకు కాలనీ సంక్షేమ సంఘాల సహకారం కూడా తీసుకోవాలని భావిస్తున్న అధికారులు ఈ అంశంపై త్వరలోనే వారికి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యుడాట్‌తెలంగాణటూరిజం.జివోవిడాట్‌ఇన్’ అనే వెబ్‌సైట్‌లో చూడవచ్చునని వివరించారు.
ఈ గృహాలకు డొమెస్టిక్ విధానం
సర్కారుకు ప్రతిపాదనలు
హోం స్టే విధానం పరిధిలోకి వచ్చే భవనాలకు డొమెస్టిక్ విధానం కింద ఆస్తిపన్ను వర్తింపజేయనున్నట్లు, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపనున్నట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. నగరానికొచ్చే పర్యాటకులకు, నగరవాసుల మధ్య సాంస్కృతిక వారధిగా ఉండేలా ఉపయోగపడే ఈ విధానంపై అవగాహన పెంపొందించేందుకు నగర వాసుల్లోవిస్త్రృత అవగాహన కల్పించాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు.
నగర జీవన విధానాన్ని దగ్గరగా పరిశీలించే అవకాశం
పర్యాటక శాఖ కమిషనర్ సునితా భగవత్
ప్రస్తుతం నగరంలో పర్యాటకుల కోసం ఉన్న హోటళ్లు, ఇతర హౌజ్‌ల మాదిరిగా గాక, కాస్త కుటుంబపరమైన వాతావరణంలో గడిపే అవకాశం ఏర్పడుతోందని పర్యాటక శాఖ కమిషనర్ సునిత భగవత్ అన్నారు. కమర్షియల్ రేట్లలో కాకుండా నామమాత్రంగా ఛార్జీలకే పర్యాటకులకు బస కల్పించే ఈ హోం స్టే విధానం ద్వారా విదేశీ, స్వదేశీ పర్యాటకులకు నగర జీవన విధానాన్ని సంస్కృతి, సంప్రదాయాలను మరింత దగ్గరగా పరిశీలించే అవకాశమేర్పతుందని కూడా స్పష్టం చేశారు.

ఆర్థిక పటిష్టతతోనే మెరుగైన సేవలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 14: అంతర్గత ఆదాయ వనరులను పెంపొందించుకున్నపుడే ప్రజల అవసరాలకు అనుగుణంగా స్థానిక సంస్థలు మెరుగైన సేవలందించగలవని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం జిహెచ్‌ఎంసిని రాజస్థాన్‌కు చెందిన పలు మున్సిపాల్టీల అధికారుల బృందం సందర్శించింది. ఇందులో భాగంగా ఈ బృందం అధికారికంగా కమిషనర్ జనార్దన్ రెడ్డిని కలిసి జిహెచ్‌ఎంసి అమలు చేస్తున్న పన్నుల వ్యవస్థ, ఆదాయ మార్గాలపై అధ్యయనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ దేశంలో 4వేల 41 మున్సిపాల్టీలుండగా, వీటిలో 90శాతం పై చిలుకు మున్సిపాల్టీలు ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్నాయని వివరించారు.
తమ పరిధిలోని పన్నులను ఎప్పటికపుడు పునఃసమీక్షించటం, వంద శాతం పన్నుల సేకరణ, అనధికార గృహాలను పన్ను విధానం పరిధిలోకి తేవటం వంటి తదితర చర్యలతో ఆదాయ మార్గాలను పెంపొందించుకునే దిశగా కృషి చేయాలని రాజస్థాన్ బృందానికి సూచించారు. స్థానిక సంస్థల నుంచి సేవలను పెద్ద ఎత్తున ప్రజలు ఆశిస్తున్నారని, వారి అంచనాలకు అనుగుణంగా సేవలు అందించేందుకు ప్రతి మున్సిపాల్టీకి ఆర్థికపరమైన పటిష్టత ఎంతో అవసరమని సూచించారు. సమావేశంలో అదనపు కమిషనర్లు రామకృష్ణారావు, శంకరయ్య, జయరాజ్ కెనడీ, భాస్కరచారి, రవికిరణ్ తమతమ శాఖల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను, పనులను వివరించారు.