హైదరాబాద్

ఆన్‌లైన్ అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటి నిర్మాణ అనుమతులను జిహెచ్‌ఎంసి ఆన్‌లైన్‌లో అందిస్తున్న సంగతి తెలిసిందే! అయితే ఈ విధానాన్ని మరింత పక్కాగా, పకడ్బందీగా పటిష్టపరిచి మరింత వేగవంతంగా సేవలందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మూడు నెలల క్రితం పూణె నగరం మున్సిపల్ సంస్థకు అధ్యయనం నిమిత్తం వెళ్లిన అధికారులు అక్కడ ఆన్‌లైన్‌లో ఇంటి నిర్మాణ అనుమతులను జారీ చేస్తున్న విధానాన్ని నగరంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే! అయితే ఆన్‌లైన్ నిర్మాణ అనుమతుల విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత జిహెచ్‌ఎంసికి వస్తున్న దరఖాస్తుల సంఖ్య తగ్గకపోయినా, వీటిలో అసంపూర్తిగా పూరించిన, డాక్యుమెంటేషన్ సరిగ్గా లేని దరఖాస్తులు కూడా వచ్చాయి. వీటిని జిహెచ్‌ఎంసి లైసెన్సు కల్గిన ఆర్కిటెక్చర్లు పరిశీలించి తరస్కరించాల్సి వస్తోంది. దీంతో ఆన్‌లైన్ ద్వారా ఆశించిన స్థాయిలో ప్రయోజనం సమకూరక మళ్లీ కథ మొదటికొచ్చినట్టయింది. దీంతో అధికారులు పూణె నగర పాలక సంస అమలు చేస్తున్న ఆన్‌లైన్ విధానానికి మరో అడుగు ముందుకేసి ఈ విధానాన్ని మరింత ప్రయోజనకరంగా, పకడ్బందీగా అమల్లోకి తేవాలని యోచిస్తున్నారు. ఇందుకు గాను జిహెచ్‌ఎంసి లైసెన్సు పొందిన ఆర్కిటెక్చర్లకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందించేందుకు కసరత్తుప్రారంభించారు. ఆన్‌లైన్‌లో ఇంటి నిర్మాణ అనుమతులకు సంబంధించిన దరఖాస్తు, ప్లాన్‌లు, డాక్యుమెంట్లన్ని అప్‌లోడ్ చేసిన తర్వాత అవి ఎంతవరకు సరిగ్గా ఉన్నాయన్న విషయాన్ని పరిశీలించి, దరఖాస్తుదారుడిచ్చిన సమాచారం సక్రమమైతేనే ఫైలు పైకి అప్‌లోడ్ అయ్యేలా సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌తో ఆర్కిటెక్చర్లు సైతం తాము పంపిన సమాచారం సరైందా? లేదా? అన్నని నిర్థారించుకుని, సరైతేనే వివరాలన్నీ అప్‌లోడ్ అయ్యే అవకాశముండటం ఈ సాఫ్ట్‌వేర్ ప్రత్యేకత. ఒక వేళ దరఖాస్తుదారుడిచిన సమాచారంలో లోపమున్నా, డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకపోయినా ఆ సాఫ్ట్‌వేర్ ఆ దరఖాస్తును ఆటోమెటిక్‌గా రిజెక్ట్ చేస్తుంది. ఫలితంగా అన్ని సక్రమంగా ఉన్న దరఖాస్తులు మాత్రమే అధికారులకు చేరి, వారి సమయం వృథా కాకుండా ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ సాఫ్ట్‌వేర్ వినియోగం, ఆన్‌లైన్ సేవల నిర్వాహణ వంటి అంశాలకు సంబంధించి ఆర్కిటెక్చర్లు, టౌన్‌ప్లానింగ్ సిబ్బందికి శిక్షణనిచ్చేందుకు వచ్చే వారం పూణెకు చెందిన నిపుణులను నగరానికి రప్పించేందుకు కూడా గ్రేటర్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో ఇంటి నిర్మాణ అనుమతులు ప్రవేశపెట్టిన నాటి నుంచి కార్పొరేషన్‌కు దాదాపు 3326 దరఖాస్తులందాయి. వీటిలో 897 దరఖాస్తులకు అధికారులు అనుమతులు జారీ చేయగా, మరో 335 దరఖాస్తులు వివిధ దశల్లో పరిశీలనలో ఉండగా, తొమ్మిది దరఖాస్తులను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. వచ్చిన దరఖాస్తుల్లో సర్కిల్ 3లో 250, సర్కిల్ 5లో 44, సర్కిల్ 6లో ఆరు, 15లలో ఎక్కువగా వచ్చినట్లు, ఆన్‌లైన్ అనుమతుల జారీ ఆశాజనకంగా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.