హైదరాబాద్

అట్టహాసంగా ఎస్‌సిఆర్‌ఇఎస్ స్వర్ణోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, అక్టోబర్ 17: ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తూ రైల్వేను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని తమిళనాడు మాజీ గవర్నర్, ఏపి మాజీ సిఎం కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. సోమవారం దక్షిణ మధ్య రైల్వే ఎంప్లారుూస్ సంఘ్ ఆధ్వర్యంలో యాబై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రైల్ కళారంగ్‌లో అట్టహాసంగా స్వర్ణోత్సవాలను నిర్వహించారు. రోశయ్య మాట్లాడుతూ రైల్వేలను ప్రజలు తమ సొంత ఆస్తులుగా భావిస్తారని, ఆ నమ్మకాన్ని మరింత ఇనుమడింపజేస్తూ రైల్వే కార్మికులు ఉద్యోగులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎంప్లారుూస్ సంఘ్‌లో సుదీర్ఘకాలంగా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటూ మర్రి రాఘవయ్య ఓ మహానేతగా కార్మికుల గుండెల్లో గూడు నిలిచిపోయారని అన్నారు. యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సంస్థ మరెన్నో మైళ్లును దాటుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రైల్వే బోర్డు స్ట్ఫా మెంబర్ ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ దేశ ప్రగతిలో రైల్వేల భాగస్వామ్యం విడదీయరానిదని అన్నారు. రైల్వేల అభివృద్ధికి ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల్లో భాగంగా ప్రజల నుంచి ఇప్పటికే లక్ష వరకు సూచనలు సలహాలను స్వీకరించామని తెలిపారు. రైల్వే కుటుంబంలో బాగస్వామ్యమైన కార్మికులు సైతం తమ విలువైన సూచనలు అందించాలని కోరారు. ఇప్పటి వరకు అందంచిన అధికారులు కార్మికుల పరస్పర సహకారంతో ఇక ముందు కూడ రైల్వేల అభివృద్ధికి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వేల అభివృద్ధికి కార్మికులు అధికారుల పాత్ర ఎంతో ఉందని గుర్తుచేశారు. మాజీ ప్రధాని పివి నర్సింహ్మారావు హయాంలో ఏపికి పదివేల కోట్ల రూపాయలు కేటాయించి ఎంతో మేలు చేశారని గుర్తు చేశారు. దక్షిణ మధ్య రైల్వే జిఎం రవీంద్రగుప్త మాట్లాడుతూ కార్మికులు లేనిదే సంస్థ లేదని, అభివృద్ధిలో వారి భాగస్వామ్యంతోనే ముందుకు సాగుతున్నామని, వారే రైల్వేలకు వెన్నముక లాంటి వారన్నారు. కార్మిక సంఘాలు, యాజమాన్యం ఒకే కుటుంబంగా ముందుకు సాగుతూ రైల్వేల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లారుూస్ సంఘ్, ఎన్‌ఎఫ్‌ఐఆర్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య మాట్లాడుతూ ఆనాడు సిఎంగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి సహకారంతో దక్షిణ మధ్య రైల్వే రూపుదాల్చుకుందని తెలిపారు. అప్పుడు ఆవిర్భవించిన ఎంప్లారుూస్ సంఘ్ నేటికి యాభై వసంతాలు పూర్తి చేసుకుందని అన్నారు. గడిచిన కాలంలో యాజమాన్యానికి కార్మికులకు మధ్య వారధిగా ఎన్నో సమస్యలను పరిష్కరించి ఇటు రైల్వేల అభివృద్ధికి అటు కార్మికులు వారి కుటుంబాల సంక్షేమానికి కృషి చేస్తూ ఎన్నో విజయాలను సొంతం చేసుకుందన్నారు. ఇందులో బాగంగా దాదాపు యాబై మందికిపైగా సంస్థ ఆవిర్భావం నుంచి నేటి వరకు వివిధ విభాగాల్లో సేవలు అందించిన నేతలకు అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. మర్రి రాఘవయ్య ఆధ్యక్షతన జరిగిన ఈ ఉత్సవాలకు మోహన్‌రావు వందన సమర్పణ గావించారు. కార్యక్రమంలో చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఎంవి రమణారెడ్డి, సంఘ్ అధ్యక్షుడు ప్రభాకర్ ఆండ్రూ, సహాయ ప్రధాన కార్యదర్శి భరణి భానుప్రసాద్, సంఘ్ నేతలు భిక్షపతి, ఆదం సంతోష్, వీరభద్రయ్య, రమా పల్లవి పాల్గొన్నారు.