క్రీడాభూమి

హైదరాబాదీయులకు అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, టెన్నిస్ బ్యూటీ సానియా మీర్జా... ఇద్దరూ వేరువేరు ప్రాంతాల్లో జన్మించినా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఇద్దరూ హైదరాబాద్ కీరిత్రపతిష్ఠలను ఇనుమడింప చేస్తున్నారు. సోమవారం కేంద్రం ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డు వీరికి దక్కడంతో హైదరాబాదీలు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత ఏడాది వివిధ టోర్నీల్లో చూపిన ప్రతిభ ఆధారంగా వీరిద్దరికీ కేంద్రం పద్మ భూషణ్ అవార్డును ప్రకటించిందన్న వార్తతో సంతోషంలో మునిగితేలుతున్నారు.

న్యూఢిల్లీ, జనవరి 25: ఇద్దరు హైదరాబాదీలకు అరుదైన గౌరవం దక్కనుంది. వీరిలో ఒకరు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకాగా, మరొకరు ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్. పద్మ భూషణ్ అవార్డుకు ఈఏడాది క్రీడా రంగం నుంచి వీరిద్దరూ ఎంపికయ్యారు. గత ఏడాది అత్యుత్తమ ప్రదర్శనలతో రాణించిన వీరికి పద్మ అవార్డుల జాబితాలో స్థానం దక్కింది. అదే విధంగా ఆర్చర్ దీపికా కుమారికి పద్మశ్రీ అవార్డును ఇవ్వనున్నారు. 2015లో సానియా ‘డ్రీమ్ రన్’ కొనసాగింది. ఆమె రెండు గ్రాండ్ శ్లామ్స్‌సహా మొత్తం తొమ్మిది టైటిళ్లను కైవసం చేసుకొని, గత ఏడాది భారత్‌కు అత్యధిక పతకాలను సాధించిపెట్టిన క్రీడాకారిణిగా గుర్తింపు సంపాదించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో కలిసి టెన్నిస్ మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌లో ఆడుతున్న 29 ఏళ్ల సానియా ఈఏడాది కూడా అదే దూకుడును కొనసాగించడం ఖాయంగా కనిపిస్తున్నది.
వివాదానికి దూరంగా..
గత ఏడాది తలెత్తిన వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని అవార్డుల కమిటీ ఈసారి జాగ్రత్తపడినట్టు స్పష్టమవుతోంది. పద్మ భూషణ్ అవార్డుకు తాను అర్హురాలినికానా అంటూ గత ఏడాది సైనా నిలదీస్తే, అంతర్జాతీయ బాక్సింగ్‌లో దేశ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింప చేసిన తనను విస్మరించారంటూ విజేందర్ సింగ్ ధ్వజమెత్తాడు. వీరిద్దరి ప్రకటనలు అప్పట్లో సంచలనం రేపాయి. సైనాను పద్మ భూషణ్ అవార్డుకు ఎంపిక చేయడంలో ఆమె ప్రతిభతోపాటు గత ఏడాది ఎదురైన అనుభవాలు కూడా కారణంగా కావచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పద్మ అవార్డులకు ఎంపికైన అభ్యర్థుల అర్హతపై నిరసనలు వెల్లువెత్తడం ఆనవాయితీగా మారింది. ఈసారి ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతాయో చూడాలి. ఇలా ఉంటే గత ఏడాది సైనా చక్కటి నైపుణ్యాన్ని కనబరచింది. ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్‌తోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ ఫైనల్ వరకూ చేరి, రన్నరప్ ట్రోఫీలను కైవసం చేసుకుంది. ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్, సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిళ్లను కూడా తన ఖాతాలో చేర్చుకుంది. మరోసారి టైటిల్ నిలబెట్టుకునేందుకు సయ్యద్ మోదీ బాడ్మింటన్ కోసం సిద్ధమైన సైనా తనకు పద్మ భూషణ్ అవార్డు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. తన పేరును ప్రతిపాదించిన క్రీడా మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపింది. గత ఏడాది తాను మంచి ఫామ్‌ను కొనసాగించానని చెప్పింది. ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని సాధించడాన్ని తన కెరీర్‌లో ఒక గొప్ప మైలురాయిగా అభివర్ణించింది. ఈ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పింది.
సైనా 2009లో అర్జున అవార్డును అందుకుంది. 2010లో ఆమెకు పద్మశ్రీ అవార్డు లభించింది. 2009-10 సంవత్సరానికిగాను ఆమె రాజీవ్ ఖేల్ రత్న అవార్డును అందుకుంది. గత ఏడాది పద్మ భూషణ్ అవార్డు వస్తుందని ఆమె ఎంతో ఆశించింది. అయితే, రెజ్లర్ సుశీల్ కుమార్‌కు అవార్డును ప్రకటించడంతో నిరాశ చెందింది. అవార్డుల ఎంపికలో సరైన ప్రమాణాలనుగానీ, విధివిధానాలనుగానీ పాటించడం లేదని ధ్వజమెత్తింది. పద్మ భూషణ్ అవార్డుకు తాను అన్ని విధాలా అర్హురాలినేనని వ్యాఖ్యాంచింది. అయితే, ఆతర్వాత మాట మార్చింది. తాను ఎన్నడూ ఫలానా అవార్డు ఇవ్వాలంటూ డిమాండ్ చేయలేదని తెలిపింది. తమ మాటలను మీడియానే వక్రీకరించిందని ఆరోపించింది. మొత్తానికి గత ఏడాది పద్మ భూషణ్ అవార్డుపై పెల్లుబికిన సైనా ఆగ్రహం ఈసారి అవార్డుకు ఎంపిక కావడంతో చల్లారిపోవడం ఖాయం.
అసాధారణ ఫామ్
సానియామీర్జా గతంలో ఎన్నడూ లేనివిధంగా అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తున్నది. చాలాకాలం క్రితమే సింగిల్స్ విభాగంలో పోటీలకు తెరదింపిన ఆమె మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌పై దృష్టి కేంద్రీకరించింది. మాజీ ప్రపంచ నంబర్ వన్ మార్టినా హింగిస్ మహిళల డబుల్స్ భాగస్వామిగా లభించడంతో సానియా దశ తిరిగింది. ఈ జోడీ వరుస విజయాలతో దూసుకెళుతున్నది. ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ టైటిల్ సాధించే జోరుమీద ఉన్న సానియా ఈఏడాది మరిన్ని టోర్నీలపై కనే్నసింది. గత ఏడాది రాజీవ్ ఖేల్త్న్ర అవార్డును స్వీకరించిన ఆమెకు ఇప్పుడు పద్మ భూషణ్ అవార్డు దక్కింది. గత ఏడాది వింబుల్డన్, యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కూడా అందుకున్న సానియా ఖాతాలో మూడు మిక్స్‌డ్ డబుల్స్ గ్రాండ్ శ్లామ్స్ కూడా ఉన్నాయి. గత సీజన్‌లో 38 మ్యాచ్‌లు ఆడి, 30 విజయాలను నమోదు చేయడం సానియా సామర్థ్యానికి ప్రతీక. ఇప్పటి వరకూ ఒక ఐటిఎఫ్, ఒక డబ్ల్యుటిఎసహా 21 మేజర్ టైటిళ్లను అందుకున్న సానియాకు హైదరాబాద్‌లో టెన్నిస్ అకాడెమీ ఉంది. పలువురు మహిళా స్టార్లను పిలిపించి, అకాడెమీలో శిక్షణ పొందుతున్న వారికి సలహాలు సూచనలు ఇప్పిస్తూ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేస్తున్నది. కాగా పద్మ భూషణ్ అవార్డుపై సానియా సంతోషం వ్యక్తం చేసింది. అవార్డులతో బాధ్యతలు మరింతగా పెరుగుతాయని వ్యాఖ్యానించింది.

అవార్డుకు నేను ఎంపికయ్యానని తెలిసిన వెంటనే ఆశ్చర్యానికి లోనయ్యాను. నిజానికి నేను దీనిని ఊహించలేదు. కనీసం అవార్డు వస్తుందన్న సమాచారం కూడా నాకు లేదు. 25 సంవత్సరాల వయసులోనే ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడంలో ఉన్న ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. నేను సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. సాధ్యమైనన్ని ఎక్కువ టోర్నీల్లో ఆడి, భారత్‌కు పతకాలను సాధించిపెట్టడమే ప్రస్తుతం నా లక్ష్యం.
- సైనా నెహ్వాల్

అవార్డుకు నేను ఎంపికయ్యానని తెలిసిన వెంటనే ఆశ్చర్యానికి లోనయ్యాను. నిజానికి నేను దీనిని ఊహించలేదు. కనీసం అవార్డు వస్తుందన్న సమాచారం కూడా నాకు లేదు. 25 సంవత్సరాల వయసులోనే ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడంలో ఉన్న ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. నేను సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. సాధ్యమైనన్ని ఎక్కువ టోర్నీల్లో ఆడి, భారత్‌కు పతకాలను సాధించిపెట్టడమే ప్రస్తుతం నా లక్ష్యం.
- సైనా నెహ్వాల్