హైదరాబాద్

పేదల సొంతింటి కల ‘డబుల్ బెడ్ రూం’ ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: మహానగరంలోని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు సర్కారు ప్రతిపాదించిన డబుల్ బెడ్ రూం స్కీం మరో అడుగు ముందుకు పడింది. నిన్నమొన్నటి వరకు టెండర్ల ప్రక్రియను చేపట్టిన అధికారులు టెండర్లు ఖరారైన ప్రాంతాల్లో వెంటనే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలంటూ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ పూర్తయిన ఉప్పల్‌లోని సింగం చెరువు తండలో 176, , సరూర్‌నగర్‌లోని ఎరుకల నాంచారమ్మబస్తీలో 288 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి వెంటనే పనులు ప్రారంభించాలని, వారానికోసారి ఈ పనుల పురోగతిపై హౌజింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. వీటితో పాటు మరో 15 ప్రాంతాల్లో 4వేల 926 ఇళ్ల నిర్మాణానికి పరిపాలన సంబంధిత అనుమతులు జారీ చేశామని, వీటికి సంబంధించి టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కూడా ఆదేశించామని తెలిపారు. అయితే ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించటం ద్వారా సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. నగరంలో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం, వాంబే పథకాల్లో భాగంగా 31 కాలనీల్లో నిర్మించిన 24వేల 600 ఇళ్లకు సంబంధించిన మిగిలిన పనులు, వౌలిక సదుపాయాల కల్పనకు కావల్సిన రుణాన్ని పొందటంలో హడ్కోతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మిణ ప్లాన్‌ల ఆమోదం, సాంకేతికపరమైన అనుమతులకు టౌన్‌ప్లానింగ్ విభాగంతో సమన్వయం పొందాలని హౌజింగ్ అధికారులకు కమిషనర్ సూచించారు. ఈ ఇళ్ల నిర్మాణం ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈనెల 26న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.