రంగారెడ్డి

కోలుకుంటున్న ‘గాంధీ’ గిరిజన బస్తీ చిన్నారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 22: డెంగీ, విష జ్వరాలతో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న హబ్సిగూడ ‘గాంధీ’ గిరిజనబస్తీ ప్రాంతానికి చెందిన చిన్నారులు మెరుగైన వైద్యంతో క్రమంగా కోలుకుంటున్నారు. రోజు రోజుకు విష జ్వరాల భారిన పడిన చిన్నారుల సంఖ్య 70కి చేరింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం పారిశుద్ధ్యం పనులను రెండవ రోజూ చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ పర్యవేక్షణలో డిప్యూటి కమిషనర్ విజయకృష్ణ, ఎఎంహెచ్‌ఓ స్వామి, ఎంటమాలాజిస్ట్, మలేరియా విభాగం అధికారులు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది బస్తీలో ఇంటింటికి వెళ్లి పరిశుభ్రతపై పర్యవేక్షించారు. దోమల నివారణ కోసం యాంటీ లార్వా ఆపరేషన్ కొనసాగించారు. ఫాగింగ్ చేసి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రతను పాటించాలని ప్రజల్లో అవగాహన కల్పించారు. ఏదైనా సమస్య వస్తే నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ద్వారా పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ప్రభాకర్ బస్తీలో బస చేసి రాత్రంతా కాలనీ ప్రజలతో కలిసి నిద్రించి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజారోగ్యం పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య ఖర్చులను తొలుత భరిస్తే తర్వాత బాదిత కుటుంబాలకు సిఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టిడిపి, కాంగ్రెస్, సిపిఎం నాయకులు బస్తీలో పర్యటించి విష జ్వరాలతో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్తీ వెనుక ఐలా పరిధిలోని పారిశ్రామిక వాడలో పారిశుద్ధ్యం పనులను చేపట్టాలని పలువురు పేర్కొన్నారు. ఐలా అధికారుల నిర్లక్ష్యం వల్ల అపరిశుభ్రతకు ఉప్పల్ పారిశ్రామిక వాడ నిలయంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన తప్పదని హెచ్చరించారు.