హైదరాబాద్

నగర జాయింట్ పోలీసు కమిషనర్ శివప్రసాద్‌కు రాష్టప్రతి పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: నగర జాయింట్ పోలీసు కమిషనర్ ఎం. శివప్రసాద్‌కు (ఐపిఎస్) అత్యున్నతమైన రాష్టప్రతి ఉత్తమ పురస్కారం లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. శివప్రసాద్‌కు అత్యున్నతమైన రాష్టప్రతి మెడల్ రావడం పట్ల పోలీసు అధికారులు, అనధికారులు హర్షం వెలిబుచ్చారు. పోలీసులకు ఆయన ఆదర్శం అని అందరూ ప్రశంసించారు.ప్రస్తుతం నగర జాయింట్ పోలీసు కమిషనర్‌గా, సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ సంచాలకులుగా ఉన్న శివప్రసాద్ గతంలో నార్త్ జోన్ డిసిపిగా, టాస్క్ ఫోర్సు డిసిపిగా, కర్నూలు జిల్లా ఎస్‌పిగా, సైబరాబాద్ జాయింట్ సిపిగా బాధ్యతలు నిర్వహించారు. రాజ్‌భవన్‌లో ముగ్గురు గవర్నర్ల వద్ద ఎడిసిగా సమర్థవంతంగా పని చేశారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇన్‌స్పెక్టర్ సాయి వరకు ఉత్తమ ఆయుధ శిక్షణ, దర్యాప్తులో మెళుకువలు తదితర వాటిలో సుమారు 22 బ్యాచ్‌లకు శిక్షణ పూర్తి చేయించడంలో ముఖ్య భూమికను పోషించారు. వినాయక నిమజ్జనం, హనుమాన్ జయంతి, శ్రీరామ నవమి, మొహర్రం, బక్రీదు, బతుకమ్మ ఉత్సవాలు, రంజాన్ తదితర పండుగ రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి-్భద్రతలు కాపాడారు
అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు : జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి
వికారాబాద్, జనవరి 25: అంకితభావంతో పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు తప్పనిసరిగా లభిస్తుందని రంగారెడ్డి జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి అన్నారు. సోమవారం స్థానిక బస్‌డిపో ఆవరణలో రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలపై వారోత్సవాల్లోనే కాకుండా ప్రతిరోజు జాగ్రత్తలు తీసుకునేందుకు పోలీసు శాఖ ప్రణాళిక సిద్ధం చేసిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ నాగరాజు, రీజినల్ మేనేజర్ గంగాధర్, డిసిటిఎం డి.విజయ్‌కుమార్, డిసిఎంఇ సిహెచ్ వెంకన్న, వికారాబాద్ బస్‌డిపో మేనేజర్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
ప్రమాదరహిత డ్రైవర్లకు అవార్డులు
దాదాపు 20 నుండి 30 సంవత్సరాల వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా బస్సు నడిపిన డ్రైవర్లకు అవార్డులు, రివార్డులను అందజేశారు అతిథులు. రంగారెడ్డి రీజినల్ స్థాయిలో 29 సంవత్సరాల 10 నెలల కాలంలో ప్రమాదం లేకుండా బస్సు నడిపిన హైదరాబాద్-1 డిపోకు చెందిన కెఎన్ రావు, 28 సంవత్సరాలను ప్రమాద రహిత విధి నిర్వహణకుగాను ఎన్.లక్ష్మిపతి, 27 సంవత్సరాలకు కె.జనార్ధన్‌ను సన్మానించారు. 20 నుండి 27 సంవత్సరాల విధి నిర్వహణలో ప్రమాదం లేకుండా వాహనం నడిపిన హైదరాబాద్-2 డిపోకు చెందిన కె.చంద్రయ్య, జికె రెడ్డి, కె.సత్తయ్య, పికెట్ డిపోకు చెందిన కెపి రెడ్డి, వి.శివయ్య, ఎం.కృష్ణ, పరిగి డిపోకు చెందిన ఎంవి రావు, సి.అంజయ్య, ఎండి మక్బూల్, తాండూర్ డిపోకు చెందిన ఎం.రషీద్, బిఎస్ కుమార్, ఎంఎ వహీద్, వికారాబాద్ డిపోకు చెందిన ఎండి అఫ్జల్, ఎండి అనీఫ్, జి.కృష్ణయ్యను ఘనంగా సన్మానించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.