హైదరాబాద్

డిప్యూటీ రెవెన్యూ సర్వేయర్లుగా పదోన్నతులు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్, అక్టోబర్ 23: కమ్యూనిటీ సర్వేయర్లను డిప్యూటీ రెవెన్యూ సర్వేయర్లుగా గుర్తించి, పదోన్నతులను కల్పించిన తర్వాత అయ్యే ఖాళీలను ఇతరులతో భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర సెర్ప్ కమ్యూనిటీ సర్వేయర్ల సంక్షేమ సంఘం కోరింది. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సెర్ప్ కమ్యూనిటీ సర్వేయర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.నాగు (ఖమ్మం), ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు ఫాకీర్ సాహెబ్ మాట్లాడుతూ డిఆర్‌డిఎ (సెర్ప్)లో 2006 సంవత్సరంలో సాంకేతిక విద్యనభ్యసించి క్షేత్ర ప్రయోగ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే రోస్టర్ విధానం ప్రకారం కేటాయించబడిన కమ్యూనిటీ సర్వేయర్ల పోస్టులకు రాతపరీక్ష, వౌఖిక పరీక్ష ద్వారా ఎంపికయ్యామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే సెటిల్‌మెంట్, ల్యాండ్ రికార్డ్సు ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసి విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ జిల్లాలో 123 మంది సర్వేయర్లు పదేళ్ల నుంచి విధుల్లో ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మిషన్ కాకతీయ, నీటి పారుదల ప్రాజెక్టులు, భూ సేకరణ పనుల్లో పాల్గొని సర్వేలు చేసినట్లు వెల్లడించారు. కమ్యూనిటీ సర్వేయర్లకు హెచ్‌ఆర్ పాలసీ, 58 సంవత్సరాల ఉద్యోగ భద్రత ఉన్న తమకే పదోన్నతులు కల్పించాలని అన్నారు. కొత్తగా నియమించటం వల్ల ప్రభుత్వానికి ఏటా అదనంగా ఆర్థిక భారం పడుతోందని వివరించారు. సమావేశంలో వివిధ జిల్లాల నుంచి సర్వేయర్లు పాల్గొన్నారు.