రంగారెడ్డి

వృద్ధ తల్లిదండ్రులను రక్షించుకునే నైతిక బాధ్యత పిల్లలదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 24: వృద్ధ తల్లిదండ్రులను రక్షించుకునే నైతిక బాధ్యత పిల్లలపై ఉందని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల పోషణ, సంక్షేమ (కేంద్ర) చట్టం, ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రుల, వృద్ధుల పోషణ, సంక్షేమ నియమావళి-2007, సీనియర్ సిటిజన్ల హక్కులు, సౌకర్యాల డిమాండ్‌లపై జిహెచ్‌ఎంసి ఆసరా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పూర్వమున్న సాంప్రదాయక జీవనంలో ఉమ్మడి కుటుంబాలుండి కుటుంబ పెద్దలుగా వయోవృద్ధులకు భద్రత, సంక్షేమం, ప్రాముఖ్యం గౌరవ స్ధానం ఉండేదని, సామాజిక మార్పు క్రమంలో ఆధునిక జీవన విధానంలో మానవ సంబంధాల్లో మార్పులు వచ్చాయని తెలిపారు. ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయి వాటి స్థానంలో చిన్న కుటుంబాలు వచ్చి డబ్బుకు, ఆస్తికి, వినియోగం, విలాసాలు, వినోదాలకు ప్రాముఖ్యత పెరిగి మానవీయ విలువలు క్షీణించిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మనుషుల మధ్య ప్రేమానుబంధాలు, ఆత్మీయత, ఆదరణ అంతరించిపోకుండా రక్షించుకోవాల్సిన అవసరం పిల్లలపై ఉందన్నారు. విలువల కోసం పని చేసినపుడే అన్ని రంగాల్లో రాణిస్తామని, కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నపుడే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. చట్టబద్ధంగా రాజ్యాంగం ప్రకారం హక్కులు అందరికి కల్పిస్తూ నీతి, ధర్మం పాటించినపుడే జన్మకు సార్ధకత ఉంటుందని, అది తప్పినపుడే సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు. వృద్ధుల కోసం కేంద్ర, రాష్ట్రాలు కల్పిస్తున్న రాయితీలు, సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలనిన్నారు. వయోవృద్ధుల సంక్షేమం పట్టని పిల్లలకు త్వరలో ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించి వారిలో పరివర్తన తీసుకొస్తానని వివరించారు. ఇప్పటికే రామంతాపూర్ గుప్త గార్డెన్‌లో సీనియర్ సిటిజన్ భవనం కోసం రూ.15లక్షలు కేటాయించామని, త్వరలో ప్రతి డివిజన్‌లో 150 మంది కెపాసిటీ గల భవనాలను నిర్మించి, వృద్ధాశ్రమాలను సైతం ఏర్పాటు చేయడానికి స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సీనియర్ సిటిజన్స్ ఆసరా కమిటీ ఉపాధ్యక్షుడు ఎస్.కపర్థేశ్వర్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ల పోషణ, సంక్షేమ చట్టంపై అసెంబ్లీ స్థాయిలో చర్చ జరిగినపుడే హక్కులు అమలవుతాయని అభిప్రాయపడ్డారు.
సీనియర్ సిటిజన్లకు ఉచిత బీమా, ఉచిత వృద్ధాశ్రమం, ఇంటి పన్నులో 30శాతం రాయితీ, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో ఉచిత వైద్యం కోసం ఆరోగ్య కార్డులు జారీ చేయాలని, టూరిజం, కార్పోరేషన్ వారి యాత్ర ప్యాకేజీలలో 60 ఏళ్లు పైబడిన వారికి 30శాతం రిబేట్, ఆర్టీసి బస్సులో 30శాతం రిబేట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్కిల్ డిప్యూటి కమిషనర్ విజయకృష్ణ అధ్యక్షతన జరిగిన సదస్సులో కార్పొరేటర్లు బేతి స్వప్న, మేకల అనలారెడ్డి, జిహెచ్‌ఎంసి అడిషనల్ కమిషనర్ వి.్భస్కర్‌రావు, ఆసరా కమిటీ కార్యదర్శి పి.నర్సింహారావు, సంయుక్త కార్యదర్శి జి.రాధాకృష్ణ, కోశాధికారి డి.నర్సింహారెడ్డి, డిపిఓ శ్రీనివాస్, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.