హైదరాబాద్

గాంధీలో హోంగార్డుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, అక్టోబర్ 25: గాంధీ ఆసుపత్రి పరిసరాలు హోంగార్డుల ఆందోళనలతో మంగళవారం అట్టుడికింది. రోజంతా జరిగిన ఆందోళనలతో గాంధీ ఆసుపత్రిలో వేదికగా జరిగిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కొంతమంది హోంగార్డులు గాంధీ ఆసుపత్రి భవనం పై అంతస్తుకు చేరుకుని తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడటంతో పోలీసులు ఉరుకులు పరుగులు తీశారు. ఎట్టకేలకు పోలీసు ఉన్నతాధికారులు, డిసిపి సుమతి అత్యంత చాకచక్యంతో ఆందోళనకారులకు నచ్చజెప్పి కిందకు దించడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గత కొద్దిరోజుల నుంచి హోంగార్డులను పోలీస్ కానిస్టేబుళ్లుగా క్రమబద్ధీకరించాలని ఆందోళన చేపట్టారు. కాగా ఆందోళన చేస్తున్న వారి ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం రాత్రి పోలీసులు వారి దీక్షను భగ్నం చేశారు. నిరసనకారులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీంతో కృష్ణ(25) అనే హోంగార్డు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. కృష్ణను గాంధీ ఆసుపత్రికి తరలించగా అతను చికిత్స తీసుకుని వెళ్లిపోయాడు. అయితే దీక్షను భగ్నం చేసే క్రమంలో పోలీసులు పలువురు హోంగార్డులను అరెస్టు చేశారు. అనంతరం విడుదల చేయడంతో వారు కృష్ణ ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడని తెలుసుకుని ఒక్కసారిగా పెద్దయెత్తున గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఉన్న జయశంకర్ విగ్రహం వద్ద బైఠాయించి పెద్దయెత్తున ఆందోళన చేపట్టారు.