హైదరాబాద్

గ్రేటర్ వాసులకు జల్ యాప్‌తో 9సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రజలకు జలమండలి పరంగా మెరుగైన సేవలు అందించడానికి జలమండలి ఆధ్వర్యంలో ఒకే యాప్‌లో మంచినీరు, డ్రైనేజీ, మ్యాన్‌హోళ్లు, కలుషిత నీటి సరఫరా, లీకేజీలు, నల్ల బిల్లుల కోసం తదితర సమస్యల పరిష్కారానికి సంబంధించిన తొమ్మిది సేవలతో కూడిన వన్ యాప్‌ను ప్రారంభించామని, అది ఎంతో సత్ఫాలితాలనిస్తోందని సర్కిల్-1 మెయింటనెన్స్ విభాగం సిజిఎం రవి, పిఆండ్‌ఎ విభాగం, ఎంసిసి సిజిఎం ఎన్.వెంకటేశ్వరరావు అన్నారు. మొగల్‌పురా వాటర్‌వర్క్స్ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా విచ్చేసి డివిజన్-1 విభాగంలోని వివిధ సెక్షన్‌లలో పనిచేస్తున్న వర్స్ ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మెన్‌లకు తొమ్మిది యాప్‌లతో కూడిని సెల్‌ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సిజిఎంలు మాట్లాడుతూ వినియోగదారులుకు మెరుగైన సేవలు అందించడానికి జల్‌యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. డివిజన్ వన్‌లో 57 మందికి జల్‌యాప్‌తో కూడిన సెల్‌ఫోన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ భార్గవ, డిజిఎం మహ్మద్ ఖాదర్‌మోహినుద్దీన్, మేనేజర్‌లు జాకీర్‌హుస్సేన్, శ్రీనివాస్, ఆనంద్‌రెడ్డి, శ్రీనివాస్, యూసుఫ్, మహేష్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.