హైదరాబాద్

ఓపెన్ గ్యార్బెజీ పాయింట్ల తొలగింపునకు కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 26: క్లీన్ సిటీ..గ్రీన్ సిటీ..హెరిటెజ్ సిటీ..ఇవన్నీ నగరానికి ఒకప్పుడు వచ్చిన అవార్డులు..కానీ సిటీ గ్రేటర్‌గా రూపాంతరం చెంది దశాబ్దకాలం గడిచినా నేటికీ ఓపెన్ గ్యార్బెజీ పాయింట్లు ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే సంవత్సరం కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ చేపట్టే స్వచ్ఛ సర్వేక్షణ్ 2017లో స్థానం దక్కటం కష్టమన్న విషయాన్ని గుర్తించిన అధికారులు ఈ ఓపెన్ గ్యార్బెజీలను తొలగించేందుకు ప్రత్యేక కార్యచరణను అమలు చేసేందుకు జిహెచ్‌ఎంసి సిద్దమైంది. గతంలో కూడా వీటి తొలగింపునకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ ప్రాంతాల్లో చెత్తను తొలగించి, మళ్లీ వేయకుండా ఉండేందుకు గాను అందమైన ముగ్గులను వేయటం, స్థానిక వ్యాపార సంస్థల సముదాయాల సహకారంతో నిరంతరం నిఘా, గస్తీని ఏర్పాటు చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్లీ పాయింట్లను చెత్త వేయటం మొదలైంది. దీంతో జిహెచ్‌ఎంసి తొలగించిన 1116 పాయింట్లలో 60 శాతం పాయింట్లలో మాత్రమే చెత్త పడకపోగా, మిగిలిన 40 శాతం పాయింట్లు మళ్లీ చెత్తతో దర్శనమిచ్చాయి. వీటిని కూడా పూర్తి స్థాయిలో తొలగించేందుకు గాను ఈ సారి ప్రజల భాగస్వామ్యంతో ముందుకెళ్లేందుకు జిహెచ్‌ఎంసి సిద్దమైంది. ఇపుడు కూడా ఒకసారి చెత్తను తొలగించిన ఓపెన్ గ్యార్బెజీ పాయింట్లలో అందమైన ముగ్గులు వేయటం, స్థానికుల సహకారంతో నిఘాను ఏర్పాటు చేయటంతో పాటు ప్రత్యేకంగా స్వచ్ఛ వాలంటీర్‌ను నియమించాలని భావిస్తోంది. ఈ 40 శాతం ఓపెన్ గార్బెజీ పాయింట్లను జిహెచ్‌ఎంసి తొలగింగలిగితే దేశంలోనే ఇతర కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలవనుంది. అంతేగాక, స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 కింద ఎంపిక చేయనున్న టాప్ 10 నగరాల్లో స్థానం దక్కించుకునే అవకాశముంది. ఈ పాయింట్లను తొలగించే విషయంలో కమిషనర్ జనార్దన్ రెడ్డి మరో సారి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.
దీంతో చాలాకాలంగా చెత్త పడి ఉన్న ఇందిరాపార్కు సమీపంలోని అశోక్‌నగర్ నాలా, నింబోలిఅడ్డా కంగారినగర్, అంబర్‌పేట, సిపిఎల్ రోడ్డు, అంబర్‌పేట జిందాతిలిస్మాత్ రోడ్, డి మార్ట్ రోడ్డు, హర్షమహల్, ఉప్పల్ సర్కిల్‌లోని ప్రగతినగర్, బాలానగర్, ఫిరోజ్‌గూడ, జైపురికాలనీ, అల్వాల్ సత్యాపెట్రోల్ బంకుల్లోని ఓపెన్ పాయింట్లను ఎత్తివేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఓపెన్ గ్యార్బెజీ పాయింట్లలోని చెత్తను జిహెచ్‌ఎంసి తొలగించిన తర్వాత మళ్లీ చెత్త వేసేవారిని సిసి కెమెరాల ద్వారా గుర్తించి కౌనె్సలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. అదే వ్యాపార సంస్థలు వంటివి వ్యర్థాలను వేస్తే వారిని గురించి, భారీగా జరిమానాలు వసూలు చేయాలని నిర్ణయించారు. దీనికి తోడు ఇంటి నుంచి సేకరించే చెత్తను కూడా ప్రజలు తడి,పొడి చెత్తను వేర్వేరుగా ఇచ్చేలా అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాలను సర్కిల్ స్థాయిలో డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షించనున్నారు. ఇక చెత్త ఆటో టిప్పర్లు వెళ్లలేని ఇరుకురోడ్లు, గల్లీల్లో నుంచి కూడా చెత్త సేకరించేందుకు గాను అదనంగా ట్రై సైకిళ్లను కేటాయిస్తున్నారు.