హైదరాబాద్

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి కర్తవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, అక్టోబర్ 26: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలని మంత్రి టి.పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. బుధవారం సికిందరాబాద్ అంబర్‌నగర్ ప్రాంతంలో సికిందరాబాద్‌లోని జననీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ హైదరాబాద్-స్వచ్ఛ తెలంగాణ’ గిన్నిస్‌బుక్ ప్రపంచ రికార్డు కోసం దాదాపు 20200 మంది విద్యార్థులతో 15 నిముషాలపాటు రోడ్లను ఊడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది గతంలో ఉన్న 1000 మందితో చేపట్టిన రికార్డును బ్రేక్ చేయడంతోపాటు సరికొత్త రికార్డుకు నాంది పలికింది. కార్యక్రమం గిన్నిస్‌బుక్ రికార్డు ప్రతినిధి జయంత్‌రెడ్డి సమక్షంలో జననీ సంస్థ నిర్వాహకులు లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పద్మారావుతోపాటు మేయర్ బొంతు రామ్మోహన్‌రావు, డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్‌బాబాతోపాటు సికింద్రాబాద్‌లోని కార్పొరేటర్‌లు ఆలకుంట సరస్వతి, సామలహేమ, ధనంజనగౌడ్, భార్గవి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి హాజనైన మంత్రి పద్మారావు మాట్లాడుతూ సిఎం దత్తత తీసుకున్న డివిజన్‌లో స్వచ్ఛ హైదరాబాద్- స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం సరికొత్తప్రపంచ రికార్డును నెలకొల్పడం సంతోషంగా ఉందని అన్నారు. నిర్వాహకులకు ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. స్వచ్ఛ తెలంగాణ స్ఫూర్తి ప్రపంచవ్యాప్తం కావడం ఆహ్వానించ దగిందన్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు వస్తాయని అన్నారు. నేటి ఈ కార్యక్రమ స్ఫూర్తితో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గిన్నిస్‌బుక్ రికార్డు ప్రతినిధి జయంత్‌రెడ్డి మాట్లాడుతూ పదిహేను నిమిషాల ఈ కార్యక్రమాన్ని కెమరాలో బంధించామన్నారు.
గతంలో మెక్సికో దేశంలో 12నిముషాలు వెయ్యిమంది రోడ్లను ఊడ్చి రికార్డును నెలకొల్పారన్నారు. నేడు కెమెరాలో బంధించిన ఈ కార్యక్రమాన్ని పంపించి పరిశీలించి అతి త్వరలో సర్ట్ఫికెట్ అందజేయనున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో బౌద్ధనగర్ డివిజన్‌లోని పలు పాఠశాలల విద్యార్థులు పాలుపంచుకున్నారు. కార్యక్రమంలో పాలుపంచుకున్న పాఠశాలలకు సర్ట్ఫికెట్‌లను అందజేశారు.