హైదరాబాద్

గ్రేటర్‌ను సందర్శించిన చైనా బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: జిహెచ్‌ఎంసిని చైనాలోని క్విన్‌డావ్ నగరానికి చెందిన మున్సిపల్ స్టాండింగ్ కమిటీ శుక్రవారం సందర్శించింది. ఈ మేరకు బృందం మేయర్ బొంతు రామ్మోహన్‌ను అధికారికంగా కలుసుకుని పలు అంశాలపై చర్చించింది. ముఖ్యంగా క్విన్‌డావ్, గ్రేటర్ హైదరాబాద్ నగరాల అభివృద్ధి అభివృద్ధి, పౌరసేవల నిర్వాహణ వంటి అంశాల్లో పరస్పరంగా సహకరించుకునేందుకు వీలుగా జిహెచ్‌ఎంసితో సిస్టర్ సిటీ ఒప్పందాన్ని చేసుకునేందుకు బృందం సుముఖంగా ఉందని, ఇందుకు గాను తనను క్విన్‌డావ్ నగరానికి ఆహ్వానించినట్లు మేయర్ రామ్మోహన్ తెలిపారు.
క్విన్‌డావ్ నగర మున్సిపల్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ వ్యాంగ్‌వెన్‌హువా నేతృత్వంలో పదకొండు మంది సభ్యులతో కూడిన ఈ బృందం జిహెచ్‌ఎంసితో కలిసి విద్యా, సాంస్కృతిక, నిర్మాణ రంగాల్లో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.
సేలింగ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ చైనాగా పిలువబడే క్విన్‌డావ్ నగరం చైనాలోని టాప్ పది నగరాల్లో ఒకటిగా బృందం వివరించింది. పర్యాటక, పారిశ్రామిక, హస్తకళలకు క్విన్‌డావ్ నగరం పేరుగాంచిందని వివరించింది. ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ దాదాపు కోటి పై చిలుకు జనాభా ఉన్న హైదరాబాద్ నగరం భిన్న మతాలకు, సంస్కృతులకు నిలయమని వివరించారు. ఉత్త, దక్షిణ భారతదేశాలను కలిపే ఈ నగర అభివృద్ధి, వౌలిక సదుపాయాల కల్పనలో భాగస్వాములు కావాలని క్విన్‌డావ్ బృందాన్ని కోరారు. తమ నగరాన్ని సందర్శించాలని చైనా బృందం మేయర్‌ను కోరింది. క్విన్‌డావ్ నగరం సెక్రటరీ జనరల్ యాంగ్‌పెంగ్ మింగ్, డిప్యూటీ గవర్నర్ జనరల్ వ్యాంగ్ జెంగ్‌కాయ్, జెన్‌ఝూ, ఛున్‌యూ, క్సియూన్లీ, లీయింగ్, ఝుంగ్‌బో, షాన్‌నాన్‌తో పాటు డిప్యూటీ జనరల్ మేనేజర్ జుంగ్ హాంగ్‌సాంగ్, సర్వీస్ మేనేజర్ లివీ తదితరులున్న ఈ చైనా బృందాన్ని కలిసిన వారిలో జిహెచ్‌ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు బంగారు ప్రకాశ్, సునరితారెడ్డి, మనె్నం కవితారెడ్డి, జి. అంజయ్య, కొండూరి నరేందర్ ఉన్నారు.