హైదరాబాద్

చెత్త వాహనాలపై ప్రకటనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: మనం రోడ్డుపై ప్రయాణిస్తున్నపుడు ముందునుంచో, వెనక నుంచో చెత్త తరలించే వాహనం వచ్చిందంటే చాలు వాహనం వేగాన్ని పెంచటమో, లేక పక్కకు తప్పుకోవటమో చేస్తుంటాం. అందులో నుంచి దుర్వాసన రావటంతో పాటు ఆ వాహనాన్ని చూస్తేనే విస్మయానికి గురయ్యే పరిస్థితులు నెలకొనటం ప్రస్తుత పరిస్థితి. కానీ ఈ పరిస్థితిని మార్చేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు సిద్ధమయ్యారు. మున్ముందు పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కేందుకు ఇప్పటికే అనేక రకాలుగా నిధుల సమీకరణకు విశ్వప్రయత్నాలు చేస్తున్న జిహెచ్‌ఎంసి చివరకు చెత్త వాహనాలపై కూడా వ్యాపార ప్రకటనలను అనుమతించాలని భావిస్తోంది. చెత్త తరలించే వాహనాలను కాస్త ఆకర్షణీయంగా తీర్చిదిద్దటమే గాక, ఆ ఆకర్షణీయత కార్పొరేషన్‌కు ఆదాయాన్ని సమకూర్చేలా ఉండాలన్నది జిహెచ్‌ఎంసి ప్రదానోద్దేశ్యం. ప్రస్తుతం జిహెచ్‌ఎంసి పరిధిలో ఉన్న సుమారు 311 వివిధ రకాల చెత్త తరలింపు వాహనాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల నుంచి శివారులోని జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుకు చెత్తను తరలిస్తున్నాయి. వీటిపై ప్రభుత్వ, ప్రైవేటు అడ్వర్‌టైజ్‌మెంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిహెచ్‌ఎంసిలో ప్రస్తుతం 6 టన్నుల సామర్థ్యం కలిగిన వాహనాలు 159, పది టన్నుల సామర్థ్యం కలిగినవి 54, 25 టన్నుల వాహనాలు 41, ఓపెన్ లారీలు ఎనిమిది, ఆరు టిప్పర్లు, 14 ఎన్‌ఫోర్స్‌మెంట్ వాహనాలు, అయిదు మలేరియా వాహనాలు, వెటర్నరీ విభాగానికి చెందిన 24 వాహనాలకు గాను ముందు, వెనకా, ఇరువైపులా రకరకాల అడ్వర్‌టైజ్‌మెంట్లను అనుమతించాలని జిహెచ్‌ఎంసి భావిస్తోంది. ఇందులో ఇరవై శాతం స్థలాన్ని జిహెచ్‌ఎంసి ప్రజాచైతన్య, అవగాహన నినాదాలను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఈ నిర్ణయం అమలైతే వీటి నిర్వాహణ రంగులు వేసేందుకు జిహెచ్‌ఎంసి ఖర్చు చేస్తున్న రూ. 49లక్షల వరకు ఖర్చవుతోంది. అదే ప్రకటనలిస్తే ఈ వ్యయం మొత్తం మిగిలిపోవటంతో అదనంగా మరో రూ. 39.43లక్షల ఆదాయం సమకూరుతుందన్న అంచనాలున్నాయి. రకరకాల సైజుల్లో అడ్వర్‌టైజ్‌మెంట్లు వస్తున్నందున వీటికి అధికారులు ఇంకా ఛార్జీలను నిర్ణయించలేదు. ఇందుకు గాను ఇప్పటికే బస్సులపై అడ్వర్‌టైజ్‌మెంట్లను అనుమతిస్తున్న ఆర్టీసి అమలు చేస్తున్న ఛార్జీలపై అధ్యయనం చేసి ఛార్జీలు నిర్ణయించాలని భావిస్తోంది. కానీ చెత్త వాహనాలపై వ్యాపార ప్రకటనలకు ఎవరైనా ముందుకొస్తారా? అన్న అనుమానం కూడా లేకపోలేదు. ప్రైవేటు సంస్థలేమీ ముందుకు రాకపోతే జిహెచ్‌ఎంసి ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్సులు వంటి అంశాలకు సంబంధించిన ప్రకటనలు వేసుకోవాలన్న ప్రత్యామ్నాయ ఆలోచనలో కూడా అధికారులున్నట్లు తెలిసింది.