హైదరాబాద్

చైనా వస్తువులపై వ్యతిరేకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, అక్టోబర్ 29: పాకిస్తాన్‌కు ప్రత్యక్ష, పరోక్షంగా సహాయసహకారాలందిస్తున్న చైనా దేశ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ చైనా వస్తువుపై రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోంది. పదిరోజుల క్రితం వికారాబాద్ పట్టణంలో ఏర్పాటైన స్వదేశీ పరిరక్షణ సమితి కరపత్రాల ద్వారా ప్రచారాన్ని ప్రారంభించింది. కరపత్రంలో చైనావస్తువులను కొని వాడితే భారతదేశానికి ఎలా నష్టం వాటిల్లుతుందో కరపత్రంలో స్పష్టంగా వివరించారు. స్వదేశీ పరిరక్షణ సమితి పట్టణంలోని పాఠశాలలు, కళాశాలల్లో కరపత్రాలను పంచడంతో విద్యార్థులు తోటి స్నేహితులు, తల్లిదండ్రులకు, బంధువులకు చైనా వస్తువులను బహిష్కరించాలని అవగాహన కల్పిస్తున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం మండలంలోని కొటాలగూడ గ్రామ పంచాయతీ చైనా వస్తువులను బహిష్కరిస్తూ తీర్మానించగా, శనివారం నారాయణపూర్ గ్రామ సర్పంచ్ సుభాన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ సువర్ణ సహా వార్డు సభ్యులు చైనా వస్తువులు అమ్మరాదు, కొనరాదని తీర్మానించారు. పట్టణంలోని శ్రీ సరస్వతి జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు సైతం చైనావస్తువులను బహిష్కరించాలని కోరుతూ కరపత్రాలను పంచుతూ ర్యాలీ నిర్వహించారు.

కరపత్రాలను పంచుతున్న శ్రీ సరస్వతీ జూనియర్ కళాశాల విద్యార్థులు.