హైదరాబాద్

శివార్లలో నీటి కటకటకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: చుక్క నీటి కోసం చుక్క లు చూస్తున్న నగర శివార్లకు వచ్చే ఎండాకాలం నాటికి అవసరానికి తగిన విధంగా మంచినీరు సరఫరా అందుబాటులోకి రానుంది. శివార్లలోని 12 మున్సిపాల్టీలను పదేళ్ల క్రితమే గ్రేటర్‌లో విలీనం చేసినా, నేటికీ పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా లేదు. ఈ క్రమంలో శివార్ల దాహర్తిని తీర్చేందుకు నాబార్డ్ ఆర్థిక సహాయం రూ. 1900 కోట్లతో ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. జలమండలి ఆధ్వర్యంలో కొనసాగే ఈ భారీ పనులకు సంబంధించి జరపనున్న రోడ్ల తవ్వకాలకు జిహెచ్‌ఎంసి షరతులతో కూడిన అనుమతులిచ్చినట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. సుమారు 2700 కిలోమీటర్ల జరపనున్న ఈ తవ్వకాల అనుమతులకు సంబంధించి జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దానా కిషోర్, జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డిలు మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రేటర్‌లో ప్రస్తుతం 9వేల కిలోమీటర్ల మేరకున్న రోడ్లలో మూడో వంతు అంటే దాదాపు 2700 కిలోమీటర్ల వరకు తవ్వకాలు జరిపి, 600 కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసేందుకు జలమండలి సన్నద్దమవుతోంది. అయితే ఇప్పటికే రోడ్ల తవ్వకాల విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్న జిహెచ్‌ఎంసి ఈ అనుమతుల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించి, రోడ్ల తవ్వకాలు సరే పనురుద్దరణ విషయమై జలమండలి నుంచి స్పష్టమైన హామీ తీసుకున్న తర్వాతే అనుమతి ఇచ్చింది. ఈ పనులన్నీ వచ్చే వేసవి కాలం ప్రారంభమయ్యే నాటికి పూర్తి చేయనున్నట్లు జలమండలి వెల్లడించింది. ఇందుకు సంబంధించి తాను ప్రత్యేక బాధ్యతలను తీసుకుంటున్నట్లు కూడా జలమండలి ఎండి దాన కిషోర్ వెల్లడించారు.
అంతేగాక, ఈ రోడ్లకు పునరుద్దరణ పనులను సకాలంలో పూర్తి అయ్యేలా జలమండలి, జిహెచ్‌ఎంసి, రెవెన్యూ, ట్రాఫిక్ విభాగాలు చక్కటి సమన్వయంతో వ్యవహారించాలని కూడా కమిషనర్ సూచించారు. మే మాసం కల్లా ఈ పనులన్నీ పూర్తయితే వర్షాకాలానికి ముందే రోడ్లను రీ కార్పెటింగ్ చేయవచ్చునని జిహెచ్‌ఎంసి భావిస్తోంది. అంతేగాక, పైప్‌లైన్ నిర్మాణం కోసం జలమండలి జరిపే ప్రతి పదిహేను కిలోమీటర్లలో పనులు పూర్తయిన వెంటనే రోడ్ల పునరుద్ధరణ పనులకు నియమిత గడువు విధించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంటింటికి పూర్తి స్థాయిలో మంచినీటి సౌకర్యాన్ని అందించేందుకు చేపట్టిన ఈ అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణం వల్ల శివార్లలోని కొన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో వాటిని దూరం చేసేందుకు ప్రయత్నిస్తామని జిహెచ్‌ఎంసి కమిషనర్ తెలిపారు.
సకాలంలో పనులు పూర్తి చే స్తాం
శివార్లలోని ఇంటింటికి మంచినీరు అందించాలన్న సంకల్పంతో చేపడుతున్న ఈ అతిపెద్ద ప్రాజెక్టు పనులను వచ్చే మే మాసం చివరికల్లా పూర్తి చేసే బాధ్యత తనదేనని జలమండలి ఎండి దానకిషోర్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, మంజీరా, సింగూర్‌లకు అనుబంధంగా 56 రిజర్వాయర్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. సుమారు 2700 కి.మీ.ల మేరకు రోడ్ల తవ్వకాలు జరుపుతున్నా, 600 కి.మీ.ల విస్తీర్ణంలో మాత్రమే ఈ భారీ పైన్‌లైన్ నిర్మాణం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేస్తామని, ఇందుకు స్వయంగా తానే బాధ్యత తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ప్రజల రక్షణే ధ్యేయం
చేవెళ్ల, నవంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు, ప్రజాభద్రత కోసం మోడల్ పోలీసుస్టేషన్‌లుగా తీర్చిదిద్దేందుకు ఎన్ని నిధులైనా ఇస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలో ఏసిపి కార్యాలయాన్ని మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్య ప్రారంభించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాల మేరకు చేవెళ్ల, షాబాద్, శంకర్‌పల్లి, మొయినాబాద్ మండలాలను రంగారెడ్డి జిల్లాలో కలిపినట్టు చెప్పారు. ప్రజల రక్షణకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. జిల్లాల పూర్వవిభజనలో భాగంగానే చేవెళ్ల డివిజన్ సైబరాబాద్ పరిధిలోకి వచ్చిందన్నారు. ఫ్రెండ్లి పోలీసులో భాగంగా పోలీసు శాఖను పటిష్టపరుస్తున్నామన్నారు. మోడల్ పోలీసుస్టేషన్ల కోసం ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అనంతరం సైబరాబాద్ కమిషనర్ సందీస్ శాండిల్య మాట్లాడుతూ ప్రజల కోసం పోలీసు శాఖ నీతి నిజాయితీగా పని చేస్తుందన్నారు. సైబరాబాద్‌లో కొత్తగా ఏర్పడిన ప్రాంతంలో మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల, రాజేంద్రనగర్, ఏసిపిలు శృతకీర్తి, గంగారెడ్డి, చేవెళ్ల ఆర్‌డివో చంద్రమోహన్, ఎంపిపి బాల్‌రాజ్, జడ్పీటీసి శైలజ సత్యనారాయణరెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మెన్ విజయలక్ష్మి శర్వలింగం, వైస్ చైర్మన్ మాణిక్యరెడ్డి, జిల్లా సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షులు మధుగుప్త, డిసిపి మాజీ అధ్యక్షుడు వెంకట్‌స్వామి, జిల్లా కార్యదర్శి గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నాగమ్మ, ఎస్సై విజయభాస్కర్, శ్రీ్ధర్, వరప్రసాద్, వివిధ పార్టీల నాయకులు ఉన్నారు.