హైదరాబాద్

ఆన్‌లైన్ సేవలకు స్పందన ‘అదుర్స్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: నగరంలోని కోటి మంది జనాభాకు జిహెచ్‌ఎంసి అందించే ఏ సేవలోనైన మధ్యవర్తులు, దళారుల జోక్యాన్ని అడ్డుకునేందుకు ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ సేవలకు చక్కటి స్పందన వస్తోందని అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏడాది క్రితం డా.బి.జనార్దన్ రెడ్డి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూణే నగర మున్సిపల్ కార్పొరేషన్ మాదిరిగా భవన నిర్మాణ అనుమతుల జారీ ప్రక్రియను గత జూన్ 2వ తేదీన ఆన్‌లైన్ చేసిన సంగతి తెలిసిందే! అయితే ఈ సేవను ప్రవేశపెట్టిన కొత్తలో ఆర్కిటెక్చర్లు, బిల్డర్లు డాక్యుమెంట్లను, ప్లాన్‌లను అప్‌లోడ్ చేసేందుకు కొంత ఇబ్బందులెదుర్కొన్నా, ప్రస్తుతం ఆశించిన స్థాయిలో ఆన్‌లైన్ సేవలందించగల్గుతున్నామని కమిషనర్ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బల్దియా ఇప్పటికే గుర్తించిన దాదాపు 700 మంది ఆర్కిటెక్చర్లకు ఈ ఆన్‌లైన్ విధానం, సేవల వినియోగం వంటి అంశాలపై శిక్షణ కూడా ఇప్పించారు. నిర్మాణ అనుమతులు గానీ, బర్త్,డెత్ సర్ట్ఫికెట్లు గానీ కోరే వారు కార్యాలయాల చుట్టూ ఎలాంటి ప్రదిక్షణలు చేయకుండా, నేరుగా రాకుండా ఇరవై నాలుగు గంటల్లో ఎపుడైనా ఆన్‌లైన్‌లో ఈసేవలను పొందేందుక వీలుగా సులభతరమైన పరిపాలన విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకు గాను అధికారులకు కూడా ప్రత్యేకంగా మొబైల్ టాబ్లెట్లు అందజేశారు. దీంతో పాటు ప్రజల నుంచి ఫిర్యాదులను, వాటి తాలుకూ ఛాయాచిత్రాలను సైతం ఆప్‌లోడ్ చేసేందుకు వీలుగా ‘మై జిహెచ్‌ఎంసి’ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. గత సెప్టెంబర్ మాసం చివరి నెలలో కురిసిన అతి భారీ వర్షాలకు సంబంధించిన ఫిర్యాదులు సైతం ఈ యాప్‌కు ఎక్కువగానే వచ్చాయి. ఈ ఆన్‌లైన్ సేవలను మరింత వేగవంతంగా అందించేందుకు వీలుగా టౌన్‌ప్లానింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణను కూడా ఇచ్చినట్లు కమిషనర్ వెల్లడించారు.
బల్దియాదే కీలక పాత్ర
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానం దక్కించుకునేందుకు జిహెచ్‌ఎంసి ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ బిల్డింగ్ అప్రూవల్ విధానం కీలక పాత్ర పోషించిందని కమిషనర్ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరంలో నిర్మాణ రంగంలో సంబంధిత అనుమతులను జారీ చేయటంలో ఉద్యోగుల జోక్యాన్ని తగ్గించటమే గాక, వేగవంతంగా అనుమతులు జారీ చేయటం, అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయటంతో ఈ ఆన్‌లైన్ అప్రూవల్ విధానంతో సత్ఫలితాలు వచ్చాయన్నారు.
ఆన్‌లైన్ బిల్డింగ్ అప్రూవల్‌కు వచ్చిన దరఖాస్తుల వివరాలు
* అప్‌లోడ్ అయిన మొత్తం దరఖాస్తులు-3973
* సర్కిళ్ల స్థాయిలో పరిశీలనలో ఉన్నవి-3440
* తిరస్కరించినవి-9
* వివిధ రకాల డాక్యుమెంట్లు సమర్పించాల్సినవి-546
* ప్రధాన కార్యాలయానికి అందినవి-248
* ఇప్పటికీ పరిష్కారమైనవి-2352
* అనుమతి పత్రాలు జారీ చేసినవి-1305
* వివిధ దశల్లో పరిశీలనలో ఉన్నవి-1621