హైదరాబాద్

విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: తెలుగు మాట్లాడేవారు రెండురాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ హైదరాబాద్ అందరిటీ అనీ, అన్ని భాషలు, ప్రాంతాలవారు ఉండవచ్చునని, గతంలో హైదరాబాద్ సంస్థానంలో గుల్బర్గా, బీదర్, బళ్లారితో కలిసి ఉండేవారని తెలంగాణ ఐటి శాఖమంత్రి కె.టి.ఆర్ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణవారే తప్ప వేరే వారుండకూడదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారని అది నిజం కాదని హైదరాబాద్ అందరిదని ఆయన స్పష్టం చేశారు. కన్నడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం రవీంద్రభారతిలో జరిగిన కన్నడ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి కెటిఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. డబల్ బెడ్‌రూం ప్లాట్ల్‌లు, కళ్యాణలక్ష్మీ పథకం ప్రాంతీయ బేధం లేకుండా అర్హులైన అందరికీ వర్తింపజేస్తామని ఆయన పేర్కొన్నారు. కన్నడ భవనానికి స్థల విషయంలో, రిజర్వేషన్‌లు, ఉద్యోగుల నియామకం కోర్కెలను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జగద్గురు చెన్న బసవన్న స్వామి (న్యూఢిల్లీ), సద్గురు శ్రీ ప్రభులింగస్వామి, జయమృత్యుంజయస్వామి (కర్నాటక), సాహితీవేత్త కెవి తిరుమలేష్, హాస్యనటుడు వైద్యనాధ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత సంస్థ అధ్యక్షులు అనిల్‌కుమార్ స్వాగతం పలికారు.