హైదరాబాద్

కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: పరిపాలన సౌలభ్యమంటూ గ్రేటర్‌లోని 24 సర్కిళ్లను ముప్పైకి పెంచిన అధికారులు ఇపుడు కొత్తగా ఏర్పడిన ఆరు సర్కిళ్లకు అధికారులను నియమించేందుకు తర్జనభర్జన పడుతున్నారు. ఒకవైపు కార్పొరేషన్‌లో ప్రతి నెల పదుల సంఖ్యలో సిబ్బంది పదవీ విరమణ పొందుతుండటంతో ప్రస్తుతం పర్మినెంటు ఉద్యోగుల సంఖ్య కేవలం నాలుగు వేలకు పడిపోయింది. పదవీ విరమణ పొందిన వారి స్థానంలో ఔట్‌సోర్సు, కాంట్రాక్టు ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇపుడు కొత్తగా ఏర్పడిన ఆరు సర్కిళ్లకు సంబంధించి ఒక్కో సర్కిల్‌కు డిప్యూటీ కమిషనర్, అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లు, టౌన్‌ప్లానింగ్ అసిస్టెంటు సిటీ ప్లానర్లు, అలాగే వ్యాలుయేషన్ ఆఫీసర్లతో పాటు ఇతర ఉద్యోగులను నియమించాల్సి ఉంది. కానీ ఏడాదిన్నర క్రితం 18 సర్కిళ్ల నుంచి 24 సర్కిళ్లకు పెంచినపుడు కూడా ఇదే తరహాలో అధికారులు, సిబ్బంది కొరత ఎదురైంది. దీంతో ఉన్న అధికారుల్లోనే ఒక్కో అధికారికి ఒక సర్కిల్‌లో పూర్తి స్థాయి బాధ్యతలు, మరో సర్కిల్ ఇన్‌ఛార్జి బాధ్యతలు కట్టబెడుతూ నెట్టుకొస్తున్నారు. కానీ ఇపుడు సర్కిళ్ల సంఖ్య 30కి పెరగటంతో వివిధ సర్కిళ్లలో డిప్యూటీ కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్ ఏసిపి, మెడికల్ అధికారుగా డిప్యూటేషన్ పోస్టింగ్‌లను దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు సచివాలయంలో పైరవీలు మొదలుపెట్టారు. ప్రభుత్వం ఇంకా కొత్తగా అధికారులను కేటాయించకపోవటంతో ఉన్న అధికారులకే అదనపు బాధ్యతలు అప్పగించాలా? లేక ఇప్పటికే అసిస్టెంటు మున్సిపల్ కమిషనర్‌గా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలా? అన్న ఆలోచనలో కూడా ఉన్నతాధికారులున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా సర్కిళ్ల 18 నుంచి 24కు పెరిగినపుడు అప్పటికే అసిస్టెంటు మున్సిపల్ కమిషనర్ స్థాయికి చెంది, ఇతర విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు డిప్యూటీ కమిషనర్లుగా పదోన్నతులను కల్పించి వారికి పలు సర్కిళ్ల బాధ్యతలను అప్పగించారు. ఇపుడు కూడా అసిస్టెంటు మున్సిపల్ కమిషనర్ హోదాల్లో పనిచేస్తున్న వారికి కొత్తగా ఏర్పడిన సర్కిళ్లకు ఇన్‌ఛార్జి డిప్యూటీ కమిషనర్లుగా నియమించి, వారికి జోనల్ కమిషనర్లు సూచనలు, సలహాలు ఇచ్చేలా నియమించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే పారిశుద్ద్య విధులతో ఇతర విధులను నిర్వహిస్తున్న అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్ల విధుల్లో పారిశుద్ద్య విధులను కొత్తగా వచ్చిన అసిస్టెంటు ఇంజనీర్లకు అప్పగించే ఆలోచన కూడా ఉంది.