హైదరాబాద్

దీపంతో మనిషి జీవితంలో వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, నవంబర్ 28: మనిషి జీవితంలో దీపం వెలుగు నింపుతుందని మైసూరు దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. భక్తి టివి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దిపోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాష్యం చేశారు. మనిషిలో ఆరోగ్యం, జ్ఞానం, సంపదనను కలిగించువాడు హనుమంతుడని పేర్కొన్నారు. 68 దేశాలలో 900వందల కోట్ల మంది హనుమన్ చాలీసాను పఠిస్తున్నారని తెలిపారు. కలియుగంలో అగ్నిని ఆరాధన చేయడం ఎంతో శుభసూచకమన్నారు. దీపాలతో జ్ఞానాన్ని పొందుతున్నారని తెలిపారు. సనతాన ధర్మన్ని కాపాడటానికి జ్యోతి దోహదపడుతుందన్నారు. కలియుగంలో కన్నుల పండువగా జరుగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు మళ్లీ జన్మలో కూడా కోటి దీపోత్సవ ఉత్సవాల్లో పాల్గొనాలని భక్తులను ఆశీర్వదించారు.
దీప దానం చేస్తున్న భక్తిటివి ఆధినేత నరేంద్ర చౌదరి ఎంతో పుణ్యాన్ని దక్కించుకున్నారని తెలిపారు. ఒంటి మిట్ట శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభంగా వేద పండితులు నిర్వహించారు. శ్రీ అంజనేయ స్వామికి అష్టోత్తర శతనామావళితో కోటి తమలపాకుల పూజ కార్యక్రమం భక్తులతో జరిపించారు. అనంతరం శ్రీ సీతారాముల వారిని హనుమంత వాహనంపై ఊరేగించారు.