హైదరాబాద్

ఇంజక్షన్ వికటించి బాలింత మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బికాలనీ, నవంబర్ 6: కూకట్‌పల్లి ఓమ్ని ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి బాలింత మృతి చెందింది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే బాలింత మృతి చెందిందని ధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగి ఆసుపత్రిలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళితే మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూంనగర్‌కు చెందిన సంగమేశ్వర్ భార్య స్రవంతి(25) నిండు గర్భిణి కావడంతో ఆమె సొంతూరు సదాశివపేట్‌లోని మాతృశ్రీ హస్పిటల్‌లో గత నెల 31న ఆడపిల్లకు జన్మనిచ్చింది. కాగా స్రవంతి ఊపిరితిత్తుల్లో నీరు చేరడం మూలంగా డాక్టర్ల సలహా మేరకు కూకట్‌పల్లిలోని ఓమ్ని ఆసుపత్రిలో నవంబర్ 1న చేర్పించారు. కాగా నాలుగు రోజుల పాటు ఓమ్ని వైద్యులు స్రవంతికి చికిత్స చేసి అనంతరం ఆమెకు ఎటువంటి ఇబ్బందులు లేవని డిశ్చార్జ్ చేసి తీసుకుపోవాలని బంధువులకు చెప్పారు. అయితే శనివారం సాయంత్రం డిశ్చార్జ్ సమయంలో ఆసుపత్రి సిబ్బంది స్రవంతికి ఇంజక్షన్ చేయగా అది వికటించడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కాగా అప్పటికే స్రవంతి మృతి చెందినప్పటికీ విషయంలో బయటికి చెప్పకుండా వైద్యం చేస్తున్నట్లు నటించారని బంధువులు ఆరోపించారు. దీంతో స్రవంతికి ఇంజక్షన్ వికటించి మరణించిన విషయం బంధువులు తెలుసుకొని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం చేసినప్పటికీ స్రవంతి మృతి చెందినట్లు సదరు డాక్టర్లు వారికి నచ్చచెప్పబోయారు. ఆరోగ్యంగా ఉండి డిశ్చార్జ్ చేసే సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా స్రవంతి మరణించిందంటూ బంధువులు విలపించారు. దీంతో వైద్యులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సంఘటనా ప్రాంతానికి చేరుకున్న కూకట్‌పల్లి సిఐ పురుషోత్తంయాదవ్ బాధితులకు న్యాయం చేస్తానంటూ భరోసా కల్పించారు.