హైదరాబాద్

వాట్సాప్‌లో పరిచయం.. ఆపై ఫోన్‌లోనే ప్రేమాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, నవంబర్ 8: వాట్సాప్‌లో పరిచయమైన యువతిని మాయమాటలతో నమ్మించి పెద్దయెత్తున అందినంత దండుకుని బ్కాల్‌మెయిల్‌కు పాల్పడుతున్న యువకుడిని చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారసిగూడ ఎస్‌బిహెచ్ బ్యాంక్‌లేన్‌లో నివాసం ఉండే యువతి(22) బిటెక్ వరకు చదువుకుంది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో వాట్సప్‌లో సీతాఫల్‌మండికి చెందిన సుధాకర్‌రెడ్డి కుమారుడు ఆకాశ్‌రెడ్డి(19) అనే యువకుడు పరిచయమయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇదంతా కేవలం ఫోన్ సంభాషణల ద్వారానే ప్రేమను పెంచుకుంది. ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఆకాశ్‌రెడ్డికి చేరాయి. దీంతో అతను డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. పలు దఫాలుగా రూ.4లక్షల 50వేలు ఆకాశ్‌రెడ్డి స్నేహితుడికి ఇచ్చి పంపించింది. డబ్బులు ఇవ్వడంతో పాటు మరో రు.50వేలు ఆశాశ్‌రెడ్డి అకౌంట్‌లోనూ వేసింది. యువతి చెల్లిలికి ఎంబిబిఎస్‌లో సీటు వస్తుందనే ఆశతో తల్లిదండ్రులు రూ.12లక్షలు తెచ్చి బీరువాలో దాచి ఉంచారు. అందులో నుంచి రు.5లక్షలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. అప్పటికే ఇంకా డబ్బులు ఇవ్వాలని లేదంటే ఫొటోలు ఇంటర్‌నెట్‌లో పెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేస్తుండడంతో బాధితురాలు జరిగిన విషయాన్ని ఇక దాచలేక తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రుల సహకారంతో చిలకలగూడ పోలీసులను ఆశ్రయించి ఆదివారం రోజు ఆకాశ్‌రెడ్డిపై ఫిర్యాదు చేసింది. ఆదివారం కేసును నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తూ నిందితున్ని మంగళవారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి రూ.2లక్షల 50వేలు స్వాధీనం చేసుకున్నారు. కేసును చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు.