హైదరాబాద్

పలు ప్రాంతాల్లో నీటి సరఫరా 10, 11న బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఈనెల 10, 11 తడేదీల్లో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు జలమండలి నేడొక ప్రకటనలో పేర్కొంది. నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్న కృష్ణా ఫేజ్-3 జలాల తరలింపు పథకంలో నీటి సరఫరా అయ్యే 1400 ఎంఎం డయా పింపింగ్ మెయిన్‌కు సంబంధించిన లీకేజీల పనులు చేపడుతున్నారు. అత్తపూర్ వద్ద జరిగిన ఈ లీకేజీ పనుల మరమ్మతులను ఈనెల 10 తేదీన చేపడుతున్న కారణంగా పలు ప్రాంతాల్లో ఈనెల 10, 11న నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు జలమండలి ట్రాన్స్‌మిషన్ అధికారులు తెలిపారు.
* ఈనెల 10 తేదీన నీటి సరఫరా ఉండని ప్రాంతాలు: గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హూడా కాలనీ.
* ఈనెల 11న నీటి సరఫరా ఉండని ప్రాంతాలు: జూబ్లీహిల్స్, ప్రశాసన్‌నగర్, నందగిరిహిల్స్, జర్నలిస్ట్ కాలనీ, ఫిలింనగర్ మురికివాడ ప్రాంతాలు.
ప్రభుత్వ పాఠశాలల్లో
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
కీసర, నవంబర్ 8: ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత వచ్చేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి ఆదేశించారు. మల్కాజ్‌గిరి తహశీల్దార్ కార్యాలయం నుంచి విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు సంవత్సరాలకు సంబంధించి వివిధ స్కూళ్ల ఉత్తీర్ణత శాతాన్ని తెలుసుకున్నారు. హరితహారం, స్కూళ్లలో మరుగుదొడ్ల సమస్యలపై వివరాలు అడిగారు. విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్నందున వారి సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో డిఇఓ ఉషారాణి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.