హైదరాబాద్

సర్కిళ్లు పెంచినా.. గాడిన పడని పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: కోటి మంది జనాభాకు అతిముఖ్యమైన, అత్యవసరమైన సేవలందించే జిహెచ్‌ఎంసిలో ప్రస్తుతం అభివృద్ది, పరిపాలన పరంగానూ స్తబ్దత నెలకొంది. మెరుగైన సేవలు, పరిపాలన సౌలభ్యమంటూ ఎప్పటికపుడు అధికారులు కొత్త సంస్కరణలను తెరపైకి తెస్తున్నా, సిబ్బంది అధికారులు పనితీరులో గానీ, ప్రజలకు సేవలందుతున్న తీరులో గానీ పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం దిశగా ఉన్న బల్దియాను గట్టెక్కించేందుకు వర్తమాన ఆర్థిక సంవత్సరంలో రూ. 1800 కోట్ల మేరకు ఆస్తిపన్ను వసూలు చేసే లక్ష్యంతో కలెక్షన్, అలాగే వచ్చే సంవత్సరం నిర్వహించనున్న స్వచ్ఛ సర్వేక్షన్ 2017లోని పది టాప్ టెన్ నగరాల్లో స్థానం దక్కించుకునేందుకు ఈ రెండు తరహా విధులు తప్ప, జిహెచ్‌ఎంసిలో వేరే హడావుడి అంటూ కన్పించటం లేదు. కొద్ది రోజుల క్రితం వరకు కూడా పాలక మండలి పెద్దలు అభివృద్ది అంటూ ఎంతో హడావుడి చేసినా, ప్రస్తుతం అది కూడా చల్లబడింది. నిధులు, సిబ్బంది కొరత కారణంగా ప్రస్తుతం జిహెచ్‌ఎంసి యంత్రాంగంలో ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్ విభాగాల మినహా మిగిలిన విభాగాలన్నీ కూడా ఆస్తిపన్ను కలెక్షన్, స్వచ్ఛ విధులకే పరిమితమయ్యాయి. నగర పాలక సంస్థలో గడిచిన పదేళ్ల క్రితం గ్రేటర్‌గా రూపాంతరం చెంది, ఆ తర్వాత పరిపాలన సౌలభ్యం, మెరుగైన సేవలంటూ 18 సర్కిళ్లుగా, ఏడాదిన్నర క్రితం 24గా, కొద్దిరోజుల క్రితం 30 సర్కిళ్లుగా ఎప్పటికపుడు మార్పులు జరిగినా ప్రజలకేమాత్రం ప్రయోజనం సమకూరటం లేదు.
గ్రేటర్‌గా ఏర్పడకముందున్న ఏడు సర్కిళ్లున్న సమయంలో ఏ ప్రాంతం ఏ సర్కిల్ పరిధిలోకి వస్తుందన్న అయోమయం నేటికీ కొనసాగింది. కొద్దిరోజుల క్రితం గ్రేటర్ సర్కిళ్లను 30కు పెంచుకున్నా, అందుకు తగిన విధంగా సిబ్బంది సమకూరనలేదు. అంతకు ముందున్న 24 సర్కిళ్లలో పది సర్కిళ్లకు ఇన్‌ఛార్జి డిప్యూటీ కమిషనర్లతోనే కాలం గడిపిన అధికారులు ఇపుడు 30 సర్కిళ్లుగా ఏర్పడిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో నగరంలో జరిగిన భారీ ప్రాజెక్టుల విషయాన్ని పరిశీలిస్తే మెట్రోరైలు తప్ప చెప్పుకోదగిన పెద్ద పనులేమీ జరగలేదు. స్వరాష్ట్రం, స్వపరిపాలనలోనైనా నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూపొందించిన బృహత్తర అభివృద్ధి పనులకు ఆదిలోనే అడ్డంకులెదురవుతున్నాయి. ఇందుకు నిధుల కొరత ఇపుడిపుడే తలెత్తిన కొత్త సమస్యే అయినా, సిబ్బంది కొరత జిహెచ్‌ఎంసిని దాదాపు దశాబ్దం కాలంగా వెంటాడుతూనే ఉంది. రాష్ట్రంలో జిల్లాల పునఃవ్యవస్ధీకరణకు ముందు జిహెచ్‌ఎంసిలో నలుగురైదుగురు ఐఏఎస్ అధికారులుండగా, ఇపుడు ముఖ్యమైన విభాగాలకు సైతం పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించే అదనపు కమిషనర్లు సైతం కరవయ్యారు. ఇదివరకున్న ఐఏఎస్ అధికారులు సురేంద్రమోహన్, గౌరవ్ ఉప్పల్, శివకుమార్ నాయుడు ఇతర జిల్లాలకు బదిలీ అయి వెళ్లటంతో జిహెచ్‌ఎంసిలో ఐఏఎస్ అధికారుల సంఖ్య కమిషనర్‌తో ఒక్కరికే పరిమితమైంది.