హైదరాబాద్

నేటి నుంచి నగరంలో అంతర్జాతీయ పశుపోషణ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జనవరి 26: నేటి నుంచి నగరంలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ పశుపోషణ సదస్సును నిర్వహిస్తున్నట్టు ప్రొఫెసర్ మహేందర్ తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సదస్సుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ ఏనిమల్ ప్రొటెక్షన్ అండ్ మేనేజ్‌మెంట్, పివి.నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సులను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా ఈ సదస్సును నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈనెల 31 వరకు కొనసాగే ఈ సదస్సులో దేశ, విదేశాలకు చెందిన పశువైద్య నిపుణులు పాల్గొని వివిధ అంశాలపై సమగ్రంగా చర్చిస్తారని చెప్పారు.