హైదరాబాద్

టిడిపి పాలనలోనే నగర అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, జనవరి 28: నేనవరికీ భయపడను.. అవసరమైతే ఇక్కడే ఉంటానని టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రోడ్‌షోలో భాగంగా గురువారం మదీనగూడ వద్ద ప్రసంగించారు. నేను భయపడ్డానని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇందిరా గాంధీకే భయపడలేదని పేర్కొన్నారు.
నాకు ఇక్కడేంటీ పని అంటూ కొందరు అంటున్నారు.. నా రాజకీయ జీవితం ఇక్కడే ప్రారంభమైంది.. ఇక్కడే ఉంటానని, తెలుగుజాతి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానని స్పష్టం చేశారు. టిడిపి హయంలో హైదరాబాద్‌లో అభివృద్ధి జరిగిందని చెప్పారు. అప్పటి జనాభా ప్రకారమే తాగునీరు, డ్రైనేజీ వసతి కల్పించామని పేర్కొన్నారు.
ఒకరిద్దరు స్వార్థపర ఎమ్మెల్యేలు టిడిపిని వీడినా ఎలాంటి నష్టం లేదని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేయాలని నేనొక్కడినే చెప్పానని తెలిపారు. శేరిలింగంపల్లిలో ఒకప్పుడు తుమ్మ చెట్లు ఉండేవని, నా వల్లే పెద్ద పెద్ద బిల్డింగ్‌లు వచ్చాయని పేర్కొన్నారు. చందానగర్ అభ్యర్థి ఊరిటి వసుంధర, మియాపూర్ అభ్యర్థి బండారు మోహన్ ముదిరాజ్, హైదర్‌నగర్ అభ్యర్థి రంగరాయ ప్రసాద్, హఫీజ్‌పేట అభ్యర్థి షాహియాన్, వివేకానందనగర్ కాలనీ అభ్యర్థి మాధవరం రోజా రంగారావు, ఆల్విన్ కాలనీ అభ్యర్థి భానుప్రసాద్‌ను గెలిపించాలని కోరారు. చంద్రబాబు వెంట టిడిపి శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, టిటిడిపి కార్యానిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌గౌడ్, వేం నరేందర్‌రెడ్డి, ఊరిటి వెంకట్రావు, అక్తర్, ఉప్పలపాటి శ్రీకాంత్, అక్బర్‌ఖాన్, వెంకటేశ్‌గౌడ్, బిజెపి నేతలు ఎం.్భంరావు రాచమళ్ల నాగేశ్వర్‌గౌడ్, పొరెడ్డి బుచ్చిరెడ్డి ఉన్నారు.
పసలేని బాబు ప్రసంగం
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగం చప్పగా సాగింది. నేనెవరికీ భయపడను అంటూ పదే పదే చెప్పినప్పటికీ ఎవరినీ విమర్శించే ధైర్యం చేయలేదు. తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ గురించి ప్రస్తావించ కుండా కాంగ్రెస్‌కు భయపడనని చెప్పడం గమనార్హం. బాబు ప్రసంగంలో వాడివేడి లేకపోవడంతో కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారని ఓ నేత వ్యాఖ్యానించారు. ఆశించిన స్థాయిలో జనం రాకపోవడంతో అగ్రనేతలు అసంతృప్తి చెందారు. మిత్రపక్షమైన బిజెపి నుంచి డజనుకు మించి నాయకులు కనబడలేదు.

కాంగ్రెస్ అభ్యర్థి అంథోని ప్రచారం
ఈస్ట్‌ఆనంద్‌బాగ్ డివిజన్ పరిధిలోని ప్రేమ్‌విజయ్‌నగర్ కాలనీలో డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి అంథోని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో పార్టీ సీనియర్ నాయకులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
గడ్డిఅన్నారంలో..
దిల్‌సుఖ్‌నగర్: హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ది చెందాలంటే గ్రేటర్ ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ని గెలిపించాలని గడ్డిఅన్నారం డివిజన్ కార్పోరేటర్ అభ్యర్థి భవాణి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా గురువారం డివిజన్ పరిదిలోని పలు కాలనీలల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కోన్నారు.ప్రజలపట్ల ఫ్రబుద్వం చేపుతున్న ఆదరణను వివరించారు.ప్రభుత్వం ప్రవేశపెడుతన్న సంక్షేమ పథకాలను గురించి ఓటర్లకు తెలియజేశారు.పెంచిన వృద్దాప్య పింక్షన్లు,నిరంతర విధ్యుత్ సరఫర,హస్టల్ విధ్యార్థులకు సన్నబియ్యం భోజనం ఎంగానో దోహదపడుతున్నాయన్నారు.తనను కార్పోరేటర్‌గా గెలిపిస్తే ఎన్నో ఏండ్లుగా ఏదుర్కోంటున్న త్రాగునీటి సమస్య,డ్రైనేజీ వ్యవస్థ ఆదునీకరణ చేపడుతాన తెలిపారు.కావన నన్నుగెలిపించాలని ఓటర్లను తమదైన శైలిలో కోరారు. ఈ కార్యక్రమంలో పీచర వెంకటేశ్వర్ రావు, ప్రేమ్‌నాథ్‌గౌడ్, బద్దూరి ఆనంద్, రవీందర్ పాల్గోన్నారు.
చైతన్యపురిలో..
చైతన్యపురి డివిజన్ టిడిపి అభ్యర్థి వెంకట్‌గాంధీ ఏ ఇతర పార్టీల అభ్యర్థులకు కోవర్టుకాదని ఎల్బీనగర్ నియోజకవర్గం టిడిపి సమన్వయ కర్త సామ రంగారెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీ అభ్యర్థికి స్థానికంగా మద్దతుదారులు అధికంగా ఉండటంతో వారు ఓర్వజాలక ప్రతిపక్షాలు పుకార్లు పుట్టిస్తున్నారని గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. చైతన్యపురి డివిజన్‌లో టిడిపి విజయ డంకా మ్రోగిస్తుందని ఆవభావాన్ని వ్యక్తం చేశారు. వెంకట్‌గాంధీ మాట్లాడుతూ ప్రజాదరణ పొందని కొందరు ప్రతిపక్షనాయకులు తనపై బురదజల్లుతున్నారని రాజకీయంగా వారిని ఎదుర్కోనేదమ్ము తనకువుందని వివరించారు. కార్యక్రమంలో దినేష్, బాబురావునాయక్, విష్ణువర్ధన్‌రెడ్డి, నాగబాబు పాల్గొన్నారు.
స్వతంత్ర అభ్యర్థి ప్రచారం
రాజేంద్రనగర్: మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలో స్వతంత్ర అభ్యర్థి పెద్ది చక్రదారి ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలతో దీటుగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లక్ష్మిగూడ, రాజీవ్‌గృహకల్ప, హౌసింగ్‌బోర్డుకాలనీలలో ఇంటింటికీ తిరుగుతూ బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ ప్రజాప్రతినిధుల స్వార్థ ప్రయోజనాల వల్ల డివిజన్ అన్ని రంగ్లా వెనుకబడి పోయిందని ధ్వజమెత్తారు. డివిజన్ అభివృద్ధే ధ్యేయంగా, ప్రజాసేవే లక్ష్యంగా తాను పని చేస్తానని ప్రజలకు భరోసా కల్పిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. విద్యావంతుడినని, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌పై పూర్తిగా అవగాహన ఉందని, రాజకీయ నాయకులు ఉదయం లేచినప్పటి నుంచి అబద్ధాలతో మభ్యపెడుతూ కాలం వెల్లబుచ్చుకుంటున్నారని ఆరోపించారు. బ్యాట్ గుర్తుకు ఓటేసి తనను బలపరచాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వెంకటేష్ సాగర్, లక్ష్మణ్, ప్రభాకర్, హరి, నర్సింహ్మా, గోవింద్, బాల్‌రాజ్ పాల్గొన్నారు.
రాజేంద్రనగర్‌లో..
రాజేంద్రనగర్ డివిజన్‌ను అభివృద్ధి పరిచింది కాంగ్రెస్‌యేనని రాజేంద్రనగర్ కార్పొరేటర్ అభ్యర్థి బత్తుల దివ్య అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజేంద్రనగర్ బుద్వేల్‌లో స్థానిక బస్తీల్లో డివిజన్ అధ్యక్షుడు సామ ఇంద్రపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ఓటు అభ్యర్థించారు. రాజేంద్రనగర్‌ను సబితా ఇంద్రారెడ్డి చొరవతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వివరించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో రాజేంద్రనగర్ డివిజన్ మొదటిస్థానంలో నిలిచిందని ప్రజలు గ్రహించాలని సూచించారు. కార్యక్రమంలో పి.రాజేష్ ముదిరాజ్, నరేష్ యాదవ్ పాల్గొన్నారు.
మైలార్‌దేవ్‌పల్లిలో..
రాజేంద్రనగర్: కాంగ్రెస్‌ని గెలిపిస్తే మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ను గ్రేటర్‌లోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి సానెం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాటేదాన్, గణేష్‌నగర్, శాంతినగర్, టిఎన్జీవోస్ కాలనీ బస్తీలలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు. టిఆర్‌ఎస్, తెదేపా మోసపూరితమైన మాటలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఎన్నికల్లో తన పబ్బం గడుపుకోవడానికి కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను నిలువునామోసం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేరిందని, అది మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లక్ష్మిగూడలో రాజీవ్‌గృహకల్ప స్కీమ్ కింద ఇళ్లు కట్టించారని చెప్పారు. కార్యక్రమంలో సంరెడ్డి ప్రమోద్‌రెడ్డి, డి.రమేష్ ముదిరాజ్, నోముల రాముయాదవ్, సానెం రాజు ఉన్నారు.
సూరారం డివిజన్‌లో..
జీడిమెట్ల: హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడిదేనని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. గురువారం సూరారం డివిజన్‌లో టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి మనె్నరాజును గెలిపించేందుకు స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్‌తో కలిసి టిడిపి ఎమ్మెల్యే రాధాకృష్ణ ముమ్మర ప్రచారం చేశారు. డివిజన్‌లోని శ్రీకృష్ణనగర్, లక్ష్మినగర్‌లలో ఇంటింటికీ తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి మనె్నరాజును భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయికి తెలియజెప్పి ఎంతో అభివృద్ధి చేసింది టిడిపియే అన్నారు. టిడిపితోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రజలంతా అభివృద్ధిని కోరుకుంటే సైకిల్ గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. కార్పొరేటర్ అభ్యర్థి మనె్నరాజు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులను ప్రజలు ఎన్నుకోవాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు రజితరత్నం, మురళిగౌడ్, బాలేష్‌కుమార్, పాల్గొన్నారు.
ఎంపి దయాకర్ ప్రచారం
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతోనే హైదరాబాద్‌ని విశ్వనగరంగా తీర్చిదిద్దడం సాధ్యమని వరంగల్ ఎంపి పసనూరి దయాకర్ అన్నారు. గురువారం జగద్గిరిగుట్ట డివిజన్ బీరప్పనగర్, పొలాలబస్తీ, షిరిడీహిల్స్, శివానగర్ బస్తీలలో టిఆర్‌ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి కె.జగన్‌తో కలిసి ఆయన ముమ్మర ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను పంచి కారుగుర్తుకు ఓటువేసి టిఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ నిరుపేద ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అని, అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌కు ఓటువేస్తేనే నగరాభివృద్ధి సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో నాయకులు జోద్‌రెడ్డి, సీతమ్మ, మహంకాళి, సురేశ్, సువర్ణ పాల్గొన్నారు.
జీడిమెట్లలో..
జీడిమెట్ల: టిఆర్‌ఎస్‌తోనే జీడిమెట్ల డివిజన్ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర టిఆర్‌ఎస్ నాయకుడు కెఎం ప్రతాప్ అన్నారు. గురువారం జీడిమెట్ల డివిజన్ టిఆర్‌ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి కె.పద్మను గెలిపించాలని కోరుతూ కెఎం ప్రతాప్ జోరుగా ప్రచారం చేశారు. డివిజన్‌లోని కుర్మబస్తీ, బోలాశంకర్‌నగర్, ప్రశాంత్‌నగర్‌లలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంచి కారు గుర్తుకు ఓటువేసి టిఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. జీడిమెట్ల గ్రామం, శ్రీకృష్ణనగర్‌ల నుండి పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో రాజిరెడ్డి, అరుణారెడ్డి, బండిబిక్షపతి, సుక్కమ్మ, నల్ల వేణుగోపాల్‌గౌడ్, మహేశ్, జైపాల్‌రెడ్డి, సంపత్‌గౌడ్, సతీశ్, మల్లిఖార్జున్, శ్రీకాంత్, వెంకట్, నవీన్, దామోదర్, శివ, దివాకర్ పాల్గొన్నారు.
జగద్గిరిగుట్టలో..
సమస్యలు లేని డివిజన్‌గా జగద్గిరిగుట్టను తీర్చిదిద్దుతానని డివిజన్ కార్పొరేటర్ స్వతంత్ర అభ్యర్థి సాయికుమార్ పంతుల అన్నారు. గురువారం జగద్గిరిగుట్ట డివిజన్ మైసమ్మనగర్, సోమయ్యనగర్‌లలో సాయికుమార్ ముమ్మరంగా ప్రచారం చేశాడు. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను పంచి కప్పుసాసర్ గుర్తుకు ఓటువేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజలంతా కప్పుసాసర్ గుర్తుకు ఓటువేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
లంగర్‌హౌస్‌లో..
నార్సింగి: ప్రజలు గెలిపిస్తే లంగర్‌హౌస్ డివిజన్‌ను నెంబర్‌వన్‌గా అభివృద్ధి చేస్తానని టిఆర్‌ఎస్ అభ్యర్ధి జి.్భగ్యలక్ష్మీ భూపతిరెడ్డి అన్నారు. గురువారం ప్రచారంలో భాగంగా లంగర్‌హౌస్‌లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. లంగర్‌హౌస్‌లో టిఆర్‌ఎస్ గెలుపుఖాయమని అన్నారు. డివిజన్‌లో ప్రజలు చూపిస్తున్న ఆదరణతో భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయం అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని తెలిపారు. డివిజన్‌లో రోడ్లు కూడా సరిగ్గా లేవని, గెలిచిన వెంటనే ప్రజలతో ఉండి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ గోవింద్‌రాజ్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ సత్యంరెడ్డి, వసంత్‌రెడ్డి, పల్లవి, భూపతిరెడ్డి, వినోద్, జగదీశ్‌యాదవ్,, కృష్ణాయాదవ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
గుడిమల్కాపూర్‌లో...
ముఖ్యమంత్రి కేసిఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్ధి బంగారి ప్రకాష్ అన్నారు. గురువారం డివిజన్‌లో పలు కాలనీల్లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. మెహిదీపట్నం డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నప్పుడు తాను నెంబర్ వన్ డివిజన్‌గా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా దీంతో తమకు అవార్డు కూడా వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రజలందరూ కారు గుర్తుకు ఓటువేయాలని అయన ప్రజలను కోరారు. ప్రచారంలో శ్రీ్ధర్‌సాగర్, రామారావు, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.
కార్వాన్‌లో...
ముఖ్యమంత్రి చేపడుతున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, పింఛన్లతో పాటు వివిధ సంక్షేమ పథకాలే తనను కార్వాన్ ప్రజలు గెలిపిస్తారని డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్ధి చెన్న నరేందర్ దేవ్ అన్నారు. గురువారం కార్వాన్‌లో ప్రచారంలో భాగంగా పలుబస్తీలలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. డివిజన్ అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జి శ్రీనివాస్ యాదవ్, వెంకట్, కార్మిక సంఘం నాయకుడు రామారావు పాల్గొన్నారు.
హైదర్‌నగర్ డివిజన్‌లో..
కెపిహెచ్‌బి కాలనీ: పేద ప్రజలకు న్యాయం జరగాలంటే గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధులను గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం హైదర్‌నగర్ డివిజన్ టిడిపి కార్పొరేటర్ అభ్యర్ధి రంగరాయప్రసాద్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రోడ్