హైదరాబాద్

గ్రేటర్ బరిలో ఉద్యమకారులు ఉన్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పట్టులేకున్నా మేయర్ పీఠం దక్కించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమకారులను మరిచిపోయిందని మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి విమర్శించారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలోని 61 డివిజన్లలో కనీసం కార్యకర్తలేని తెలంగాణ రాష్ట్ర సమితి ఇతర పార్టీలనుండి నాయకులను కొనుగోలుచేసి బరిలోకి దింపిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. గురువారం స్థానికంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఉద్యమాలు చేసి జైళ్లపాలైనవారిని మరిచిపోయిన పార్టీ కేవలం రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్, టిడిపిలతోపాటు ఇతర పార్టీల్లో బలమైన నాయకులకు వలపన్ని కొనుగోలు చేసిందని ఈ డివిజన్లలో ఉద్యమం సమయంలో జైళ్లకు వెళ్లిన నాయకులు బరిలో ఉంటామని మొరపెట్టుకున్నా కేవలం డబ్బు లేదన్న కారణంగా కార్యకర్తలు కరవవుడంతో ఎలాగైనా మేయర్ పీఠం దక్కించుకునేందుకు తెరాస పన్నాగం పన్నిందని ఆయన ఆరోపించారు. గ్రేటర్‌లో ఉనికి లేని తెరాసకు అభ్యర్థులు కరువని ఊహించిన పార్టీ యంత్రాంగం కాంగ్రెస్ పార్టీనుండి అధిక శాతం నాయకులను ఆకర్షించి ప్రలోభాలకు గురిచేసి డబ్బు ఎరవేసి తెరాసనుండి బరిలోకి దింపడంతోపాటు ఆయా డివిజన్లలో కోట్ల రూపాయలు గుమ్మరిస్తూ మద్యాన్ని ఏరులుగా పారిస్తున్నారని ఆయన విమర్శించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో గత 20 నెలల్లో తెరాస చేసిందేమీ లేదని కాంగ్రెస్ హయాంలోనే రాబోయే ఇరవై ఏళ్లలో జంటనగరాల ప్రజలు ఎదుర్కొనే మంచినీటి సమస్యను అంచనా వేసి కృష్ణ జలాలకు తోడుగా గోదావరి జలాలను తెప్పించేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలతో ముందుకు వెళ్లిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయనఅన్నారు. ఔటర్ రింగ్‌రోడ్ నిర్మాణం, మెట్రో రైలు ఏర్పాటు, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా నగరం నడిబొడ్డులో ఫ్లైవోవర్ల నిర్మాణం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన అన్నారు. జాతీయ రహదార్లపై ట్రాఫిక్ జామ్ అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నవాహన దారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకోసం నాగోల్‌నుండి జూపార్కు వరకు మూసీకి ఇరువైపులా వందల అడుగుల విస్తీర్ణంలో రోడ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని అందులో 80 శాతం మేరకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికస్థానాలు దక్కించుకుని మేయర్‌గా విక్రమ్‌గౌడ్ ఎన్నుకోబడతారని ఆయన జోస్యం చె ప్పారు. విజ్ఞులైన ఓటర్లు వాస్తవాలను గమనించి ప్రజాస్వామ్యంలో నిస్వార్ధంగా పనిచేసే వారిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
హోరాహోరీ!

జోరందుకున్న అభ్యర్థుల ఎన్నికల ప్రచారం
మల్కాజిగిరి, జనవరి 28: కేసిఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని, ఈపథకాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఈస్ట్‌ఆనంద్‌బాగ్ డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్థి ఆకుల నర్సింగరావు ధీమా వ్యక్తం చేశారు. గురువారం డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా ఇంటింటిప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను నేరుగాకలిసి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటు వేయాలని అభ్యర్థించారు. డివిజన్ ఇన్‌చార్జి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ టిఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణ, ఉపేందర్, శోభన్‌బాబు పాల్గొన్నారు.