హైదరాబాద్

‘బంపర్ ఆఫర్’తో గ్రేటర్‌కు రూ. 65 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన వెయ్యి, 500 నోట్లతో జిహెచ్‌ఎంసికి పన్ను, ఇతర ఛార్జీలు చెల్లించే వారి సంఖ్య పెరుగుతోంది.
ఇందుకు గాను అన్ని సర్కిళ్లలో, ప్రధాన కార్యాలయాల్లో, ఈసేవా, మీ సేవా కేంద్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లు, సిటిజన్ సర్వీసు కేంద్రాలు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సుమారు 13 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటాయని కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆస్తిపన్ను, ఓపెన్ ల్యాండ్ ట్యాక్సు, ట్రేడ్‌లైసెన్సు ఛార్జీలు, అలాగే నోటీసులు జారీ చేసిన ఎల్‌ఆర్‌ఎస్‌కు రెండో విడత ఛార్జీలు వంటివి రద్దయిన నోట్లతో చెల్లించుకోవచ్చునని శుక్రవారం ప్రకటించటంతో ఆ ఒక్కరోజే సుమారు రూ. 55 కోట్ల వరకు జిహెచ్‌ఎంసికి ఆదాయం సమకూరగా, శనివారం ఒక్కరోజు సుమారు రూ. 10 కోట్ల పైచిలుకు కలెక్షన్ వచ్చింది.
ఈ రెండురోజుల్లో కలిపి సుమారు 30వేల మంది వరకు బకాయిదారులు తమ పన్నులు, ఇతర ఛార్జీలను చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 21వేల మంది రూ. 10వేల లోపు పన్నులు చెల్లించగా, 6వేల 584 మంది రూ. 5వేల నుంచి పదివేల మధ్య పన్నును చెల్లించారు.
అలాగే వెయ్యి 193 మంది ఖాతాదారులు సుమారు రూ. 50వేల నుంచి లక్షల లోపు, అలాగే 655 మంది బకాయిదారులు లక్ష నుంచి రూ. 2లక్షల మధ్య పన్ను చెల్లించారు. అలాగే 288 మంది రెండు లక్షల నుంచి ఐదు లక్షల మధ్య చెల్లించగా, రూ. 5లక్షల కన్నా ఎక్కువ చెల్లంచిన వారు 38 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రద్దయి నోట్లతో పన్ను, ఇతర ఛార్జీలను స్వీకరించే ఈ అవకాశం సోమవారం రాత్రి వరకు అందుబాటులో ఉంటుందని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి నగరవాసులను కోరారు. ఈ బంపర్ ఆఫర్‌తో శుక్ర,శనివారాల్లో వసూలైన రూ. 55 కోట్లు, రూ. 10 కోట్లతో కలిపి ఈ ఏటా ఆస్తిపన్ను కలెక్షన్ రూ. 610 కోట్ల పై చిలుకు దాటింది. ఇది గత ఏడాదితో పోల్చితే సుమారు రూ. 160 కోట్లు అధికంగా వసూలైనట్టు అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు జిహెచ్‌ఎంసికి, ఆస్తిపన్ను, ఓపెన్‌ల్యాండ్ ట్యాక్సు, ట్రేడ్‌లైసెన్సు ఛార్జీలకు సంబంధించి బకాయిపడ్డ మొత్తంలో ఏటా 24శాతం వడ్డీని వర్తింపజేస్తున్నట్లు, ఇపుడు రద్దయిన నోట్లతో ఈ పన్ను చెల్లిస్తే వడ్డీ నుంచి మినహాయింపు లభిస్తోందని కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. క్రితం సంవత్సరం వరకు ప్రతి ఏటా మార్చి మాసంలో ప్రభుత్వం ఆస్తిపన్ను వడ్డీకి మినిహాయింపునిచ్చిందని, కానీ ఈ ఏట ఆ అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు. బకాయిదారులు ముందుకొచ్చి పన్ను చెల్లించేందుకు వీలుగా గంటకోసారి వారికి ఎస్‌ఎంఎస్‌లో పంపుతున్నామని, అధిక మొత్తంలో బకాయిలున్న యజమానులకు నేరుగా ఫోన్‌లో సంప్రదిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.

ఆరు నెలల నుంచి నీటి బిల్లులు చెల్లించని కనెక్షన్ల తొలగింపునకు రంగం సిద్ధం

డివిజన్‌ల వారీగా టార్గెట్‌లు
మొండి బకాయిలు కలిగిన
55 కనెక్షన్ల తొలగింపు
రెవెన్యూ సమీక్షలో జలమండలి
ఎండి దానకిషోర్ ఆదేశాలు
రెండో రోజు రూ.4.36కోట్లు వసూళ్లు
హైదరాబాద్, నవంబర్ 12: జలమండలి క్యాష్ కౌంటర్లలో నీటి బిల్లులు చెల్లించడానికి వినియోగదారులు ఆసక్తి కనపరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కరెన్సీ నోట్లతో నీటి బిల్లులు చెలించవచ్చని జలమండలి ప్రకటించడంతో శనివారం నగరంలోని వివిధ కౌంటర్లలో సూమారు 32వేల మంది వినియోగదారులు నీటి బిల్లులు చెల్లించడంతో జలమండలి ఖజానాకు రూ.4.36 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం వెయ్యి, 500 నోట్ల రద్దు చేసింది. దీంతో చాలామంది నోట్లను మార్పిడి చేసుకునేందుకు బ్యాంకులకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో జలమండలికి చెల్లించాల్సిన నీటి బిల్లులను పాత నోట్లతో జలమండలి చెల్లించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జలమండలి ఎండి ఎం.దానకిషోర్ గురువారం గ్రేటర్ ప్రజలకు ఈ బంపర్ ఆఫర్‌ను ప్రకటించిన విషయం విదితమే. రద్దు చేసిన వెయ్యి, 500 నోట్లతో నీటి బకాయి బిల్లులను చెల్లించేందుకు వీలు కల్పిస్తున్నామని తెలిపారు. జలమండలి పరిధిలోని అన్ని క్యాష్‌కౌంటర్లలో వినియోగదారులు నీటి బిల్లులు చెల్లించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎండి కోరారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని జలమండలికి సంబంధించిన అన్ని కౌంటర్లలో నీటి బిల్లులు చెల్లించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
జలమండలి ఎండి దానకిశోర్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు నీటి బిల్లులు చెల్లించేందుకు ముందుకు వచ్చారని, రెండు రోజుల్లో సుమారు లక్ష మంది వినియోగదారులు నీటి బిల్లులు చెల్లించడంతో రూ.22 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. మొదటి రోజు శుక్రవారం రూ.17.5కోట్లు, రెండో రోజు శనివారం 32వేల మంది వినియోగదారులు నీటి బిల్లులు చెల్లించడంతో అదనంగా రూ.4.36కోట్లు వసూళ్లు అయ్యాయి. ఈనెల 14వ తేదీ వరకు పాత కరెన్సీ పెద్ద నోట్లతో నీటి బిల్లులను జలమండలి క్యాష్ కౌంటర్లలో చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు. కోత్తగా నీటి కనెక్షన్లు తీసుకుంటున్నవారు వాటికి సంబంధించిన చార్జీల బిల్లులను కూడా క్యాష్ కౌంటర్లలో చెల్లించవచ్చని ఎండి వినియోగదారులకు సూచించారు.
ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో శనివారం రెవిన్యూ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జలమండలి ఎండి ఎం.దానకిశోర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ఆరు నెలల నుండి నీటి బిల్లులు చెల్లించని నీటి కనెక్షన్లను వెంటనే తొలిగించాలని ఎండి అధికారులను ఆదేశించారు. గత ఆరు నెలల నుండి నీటి బిల్లులు చెల్లించని వినియోగదారులు వెంటనే నీటి బిల్లులు చెల్లించాలని, లేని యెడల నీటి కనెక్షన్ తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
డివిజన్‌ల వారీగా టాప్‌లో ఉన్న బిల్లులు చెల్లించని మొండి బకాయిదారుల నీటి కనెక్షన్‌లను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో రంగంలో దిగిన అధికారులు ఒకే రోజు వివిధ ప్రాంతాల్లో 55 నీటి కనెక్షన్లను తొలగించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్న జలమండలి ప్రతి నెల సుమారు రూ.40 కోట్ల వరకు విద్యుత్ బిల్లులు చెల్లిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వినియోగదారులు తమ వంతు బాధ్యతగా ముందుకు వచ్చి సకాలంలో నీటి బిల్లులు చెల్లించి బోర్డు మనుగడకు దోహదపడాలన్నారు. గ్రేటర్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నీటి కనెక్షన్లు కలిగిన వినియోగదారులు వరుసగా ఆరు నెలలు బిల్లులు చెల్లించకుంటే ఎలాంటి నోటీసులివ్వకుండా నీటి కనెక్షన్‌ను తొలగిస్తామని ఎండి హెచ్చరించారు.
ఇలాంటి కనెక్షన్లు కలిగిన వారికోసం దాదాపు వంద రెడ్ బ్రిగేడ్ నీటి కనెక్షన్లు తొలగించే బృందాలను రంగంలోకి దింపినట్టు ఎండి చెప్పారు. బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన రెవెన్యూ సమీక్షా సమావేశంలో ఎండితో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు డాక్టర్ పి.సత్యసూర్యనారాయణ, డి.శ్రీ్ధర్‌బాబు, ఆజ్మీర కృష్ణ , టి.రవీందర్‌తో పాటు సిజిఎం, జిఎం, డిజిం, మేనేజర్‌లు పాల్గొన్నారు.
కొత్త మార్కెట్‌కు తరలిన వ్యాపారులు ..రైతులకు తప్పిన ఇబ్బందులు

ధారూర్, నవంబర్ 12:చాలా కాలంగా ధారూర్ మెయిన్ రోడ్డుపై నిర్వహిస్తున్న మార్కెట్‌ను వ్యాపారులు కొత్త మార్కెట్‌లోకి తరలి వెళ్లారు. గత వారం మంత్రి మహేందర్ రెడ్డి కొత్త మార్కెట్‌ను ప్రారంభించి వ్యాపారులకు దుకాణాలను కేటాయించారు. వ్యాపారులకు కేటాయించిన దుకాణాలకు తరలివెళ్లారు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పాయి. మార్కెట్ యార్డులో నీటి సౌకర్యం, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను కల్పించారు. కొత్త మార్కెట్ యార్డులోకి వ్యాపారులు దుకాణాలను తరలించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధారూర్, పెద్దేముల్, కోట్‌పల్లి మండలాల నుండి రైతులు తాము పండించిన మక్క, వరి, తదితర పంటలను తీసుకువస్తారు. గతంలో వికారాబాద్ మార్కెట్‌కు అనుబంధంగా కొనసాగు ధారూర్ మార్కెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మార్కెట్‌గా అవతరించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరవాత మార్కెట్ యార్డులో గిడ్డంగులను నిర్మించారు. తెంలగాణ రాష్ట్రంలో మొదటి సారిగా మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు కల్పించి గిరిజనుడైన టిఆర్‌ఎస్ నాయకుడు రాజునాయక్‌కు మార్కెట్ కమిటీ చైర్మెన్ పదవి కట్టబెట్టింది.

కెపిహెచ్‌బిలో
తెదేపా సభ్యత్వ నమోదు
కెపిహెచ్‌బికాలనీ, నవంబర్ 12: కెపిహెచ్‌బికాలనీ మహారాష్ట్ర బ్యాంక్ సెంటర్‌లో శనివారం టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి కెపిహెచ్‌బి కాలనీ డివిజన్ టిడిపి కార్పోరేటర్ మందడి శ్రీనివాస్‌రావు ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ సభ్యత్వాలను నమోదు చేసుకొని రశీదులను పొందాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కెపిహెచ్‌బికాలనీ నుండే అత్యధికంగా సభ్యత్వ నమోదును చేసి ప్రథమ స్థానంలో నిలిపి పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నేడు కెపిహెచ్‌బికాలనీ సర్దార్‌పటేల్‌నగర్, ధర్మారెడ్డి ఫేజ్-1లలో సభ్యత్వ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో డివిజన్ టిడిపి అధ్యక్షుడు జాస్తి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి సర్వేశ్వర్(నాని), నారాయణరాజు, పద్మచౌదరి, చందర్‌రావు, దీపక్, సాంబశివరావు, సుబ్బారావు, వాసిరెడ్డిరాజు, రాజీవ్, రవి, గపూర్, సత్తార్ పాల్గొన్నారు.

శిల్పారామంలో అలరించిన గాత్ర కచేరీ
గచ్చిబౌలి, నవంబర్ 12: వారాంతపు కార్యక్రమంలో భాగంగా శిల్పారామంలో సాయంత్రం నిర్వహించిన కూచిపూడి నృత్యప్రదర్శన అలరించింది. అరుణ రాయ్ వారి శిష్యబృందంతో కర్ణాటక గాత్ర కచేరి అలరించింది. త్యాగరాజు, పురంధర దాసు, ముత్తుస్వామి దీక్షితార్, అన్నమయ్య లాంటి వాగ్గేయకారులు రచించి ఆలపించిన సంకీర్తలను అరుణ రాయ్, పూరి, ఒమేద, విష్ణు, లక్షణ, విజయ్ పాడారు. గుణరంజన్ మృదంగ సహకారం అందించారు. అనంతరం చూడామణి ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలోని గజాననయుక్తం, శంభోశంకర శివ, ధిల్లాన అంశాలను అద్భుతంగా నృత్యంచేసి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం శిల్పారామం అధికారులు కళాకారులను ఘనంగా సన్మానించారు.
ఉప్పు తిప్పలు.. నోటు పాట్లు

జీడిమెట్ల, నవంబర్ 12: ఉప్పు కొరత రాబోతుందన్న పుకార్లు.. షికార్లు చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు ఆందోళనకు గురై కిలోల కొద్దీ ఉప్పును కొనుగోలు చేసుకుంటున్నారు. ఇదే అదునుగా చేసుకుంటున్న కిరాణ దుకాణాల యజమానులు ఏకంగా మూడింతల పాటు రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉప్పు కొరత పుకార్లు షికార్లు చేస్తోంది. దీంతో నియోజకవర్గంలోని ప్రజలు కిలోల కొద్దీ ఉప్పును కొనుగోలు చేసుకుని జాగ్రత్త పడుతున్నారు. ఓ వైపు సైబరాబాద్ పోలీసులు ఉప్పు కొరత పుకార్లేనని పుకార్లు చేసే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని చెప్పినా ప్రజలు మాత్రం కిలోల కొద్దీ ఉప్పును కొనుగోలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా అతి తక్కువ ధర పలికే ఉప్పును ఎవరూ దొంగిలించరని భావించిన రేషన్ డీలర్‌లు ఉప్పు బస్తాలను రేషన్ దుకాణం షట్టర్ ఎదుటే ఉంచుతారు. అయితే ఉప్పు కొరత కాబోతుందన్న పుకార్లతో కొంతమంది వ్యక్తులు పలు రేషన్ దుకాణాల ముందు ఉన్న ఉప్పును సైతం తీసుకువెళ్లారు. కిరాణా దుకాణాల్లో కిలో ఉప్పు ధర మామూలు సమయంలో రూ. 10 నుండి రూ. 20లు ఉంటే ప్రస్తుతం కిలో ఉప్పు ధరను రూ.40 నుండి రూ. 80ల వరకు పెంచేశారు. అయినా వినియోగదారులు ముందస్తుగా మూడు, నాలుగు కిలోల ఉప్పును కొనుగోలు చేసుకుని జాగ్రత్త పడుతున్నారు.
అధిక ధరలకు ఉప్పును విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్..
అధిక ధరలకు ఉప్పును విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. షాపూర్‌నగర్‌లో గాదె శ్యామ్, శ్రావణ్, నగేశ్‌లు అధిక ధరలకు ఉప్పును విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 180 బ్యాగుల ఉప్పు బస్తాలను స్వాధీనం చేసుకుని పౌరసరఫరా శాఖ అధికారులకు అప్పగించారు.
ఇటు నోట్లు అటు ఉప్పు కోసం పరుగులు
ధారూర్: ఎన్నడూ కనీవిరుగని రీతిలో జనం నిత్యం వంటకాల్లో వాడుకునే ఉప్పు కొనేందుకు అప్పు చేయాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ఉప్పు కిలో రూ.500లకు పెరిగిందని ఓ చానల్‌లో బ్రేకింగ్ వచ్చిందని ప్రచారం జరగడంతో శనివారం ఉదయం దుకాణాలు తెరవకుముందే ఉప్పు విక్రయించే దుకాణాల వద్ద జనం బారులు తీరారు. ఒక్కొక్కరు ఉప్పు దొరుకుతుందో లేదో అన్నట్టుగా 25 కిలోల సంచులు ఇంటికి తీసుకెళ్ళడం ఆశ్చర్యాన్ని కలిగిందింది. ఓపక్క నోట్ల మార్పిడి కోసం పరుగు తీస్తూ, మరో పక్క ఉప్పు కోసం పరుగులు తీశారు. రద్దైన 500, 1000 రూపాయల నోట్లు చేతిలో ఉండటం, మరో పక్క ఉప్పు కోసం డబ్బులు లేకపోవడంతో వారి ఇక్కట్లు వర్ణనాతీతం. చిల్లర ఎవరూ ఇవ్వకపోవడంతో డబ్బులు అప్పుగా తీసుకుని మరీ ఉప్పు కొన్నారు. ఉప్పు ధర పెరిగడంలో నిజం ఉందో లేదోగాని ఉప్పు వ్యాపారులకు మాత్రం భలే గిరాకీ తగిలింది.
చిన్న నోట్ల కొరత నేపథ్యంలో ఉప్పు ధరలకు రెక్కలు
రాజేంద్రనగర్: భారత ప్రభుత్వం కరెన్సీ రద్దుతో చిన్న నోట్ల కొరత విపరీతంగా పెరిగిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని వదంతులు వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. ఉప్పుకు తీవ్ర కొరత ఏర్పడిందన్న వదంతులు మార్కెట్‌లో పుకార్లు చేస్తుండడంతో ప్రజలు వదంతులను నమ్మి ఉప్పు కొనుగోలుకు పోటీపడ్డారు. దీంతో దుకాణాల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడడంతో ఇదే అదునుగా భావించిన వ్యాపారస్థులు ఉప్పు ధరను ఆకాశానికి పెంచేశారు. ఉప్పుకొరత విపరీతంగా ఏర్పడిందని, కొంత మంది బ్రోకర్లు వదంతులను రెచ్చగొట్టి ఉప్పు ధర రూ.400 నుంచి రూ.500కు చేరుతుందని వినియోగదారులను ఆందోళనకు గురి చేశారు. దీంతో ప్రజలు కిరాణా షాపుల వద్ద పెద్ద ఎత్తున గుమిగూడి ఎగబడుతూ ఉప్పుప్యాకెట్లను కొనుగోలు చేశారు.
దుకాణాల యజమానులు ఇదే అదునుగా భావించి కిలో ఉప్పును రూ.20 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. ఉప్పుకు ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ కొనుగోళ్లల్లో ఎలాంటి మార్పులు రావడం లేదు. శుక్రవారం సాయంత్రం నుంచి ఉప్పు ధర పెరిగిందని పుకార్లు షికార్లు చేయడంతో ప్రజలు ఉప్పు దొరకదనే భయంతో బారులు తీరి దుకాణాల వద్ద కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రతి వంటకానికి అవసరమైన ఉప్పు ప్రస్తుతం అందని ద్రాక్షలా మారిపోయింది. దళారుల ప్రభావంతో ఉప్పు ధర ఆకాశానికి ఎగిసింది. మార్కెట్‌లో ఉప్పు కొరత ఉందని వార్తలు షికార్లు చేస్తుండడంతో ఎవరెన్ని చెప్పినా ప్రజలు పెడచెవిన పెడుతూ కొనుగోళ్లు చేస్తున్నారు. దళారులు ఇదే అదునుగా భావించి ఉప్పును దాచి కొరతకు కారణమవుతున్నారు.
పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజల అష్టకష్టాలు ...
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల కరెన్సీ రద్దుతో మార్కెట్‌లో చిన్న నోట్ల కొరత విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తోడు ఏటిఎంలలో డబ్బులు లభ్యం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉప్పు కొరతను సృష్టించడంతో మార్కెట్‌లో ఉప్పు ధరకు రెక్కలొచ్చాయి. కొంత మంది వ్యాపారస్థులు కుమ్మక్కై మార్కెట్‌లో ఉప్పు కొరతను సృష్టించి ఎక్కువ మొత్తంలో విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కిరాణాషాపులు, రేషన్ దుకాణాలలో ఉప్పు కొరత సృష్టిస్తూ ఇష్టానుసారంగా కిలో రూ.50 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. సంబంధిత అధికారులు ఉప్పు కొరత అవాస్తవమని ప్రకటనలు చేస్తున్నప్పటికీ వదంతులు ఆగకపోవడంతో ప్రజలు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. వదంతులు నమ్మవద్దని, ప్రజలకు అధికారులు విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు వెంటనే రంగంలోకి దిగి రేషన్ షాపులు, కిరాణా దుకాణాలపై దాడులు నిర్వహించి కొరతను అరికడితేనే ఉప్పు ధర సామాన్యుడికి అందుబాటులోకి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఉప్పుకూ తప్పని కరెన్సీ దెబ్బ..
ధారూర్: పెద్ద నోట్ల రద్దు పెద్ద దుమారానే్న రేపుతోంది. చిన్న వ్యాపారాల నుండి పెద్ద వ్యాపారుల వరకు తప్పని తిప్పలు ఇప్పుడు ఉప్పుపై కూడా పడింది. మార్కెట్‌లో ఉప్పు దొరకడం లేదనే వార్త దావనంలా వ్యాపించి ఆనోటా ఈనోటా కిలో ఉప్పు ప్యాకెట్ రెండు వందలకు పెరిగింది.
ధారూర్‌లో క్రైస్తవ మెథడిస్ట్ జాతర కావడంతో జాతరలో ఉప్పుకొరత ఏర్పడింది. దీంతో పక్కనే ఉన్న స్టేషన్ ధారూర్ గ్రామంలో దుకాణాల్లో భక్తులు ఒకేసారి ఉప్పు ప్యాకెట్లకై వెళ్ళగా ఉప్పు కొరత ఏర్పడింది. దీంతో ధారూర్ మండల కేంద్రంలో గల దుకాణాలకు పాకింది. శనివారం ధారూర్ మార్కెట్ కావడంతో ఉప్పు కొరత వార్త దావానంలా వ్యాపించింది. దీనికి తోడు టెలివిజన్ ప్రసారాల్లో ఉప్పు ధర పెరిగిందని ప్రసారం కావడంతో ప్యాకెట్ ఉప్పుకు మరింత డిమాండ్ పెరిగింది. ధారూర్‌లో మార్కెట్‌లో కిలో ఉప్పు రూ.100 నుండి 200గా పలుకుతోంది.
ఉప్పు ధరకూ రెక్కలు
చేవెళ్ల, నవంబర్ 12: రానున్న రోజుల్లో ఉప్పు ధరలు పెరుగుతాయని చేవెళ్లలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శనివారం చేవెళ్ల మండల కేంద్రంలో పాటు అన్ని గ్రామాల్లో ఉప్పు ధరలు పెరుగుతాయని పుకార్లు పెరగడంతో దుకాణాల్లో ఉప్పుకోసం జనం ఎగబడ్డారు. అయితే కొందరు వ్యక్తులు హైదారాబాద్ నగరంతో పాటు దేశంలో ఉప్పు కొరత వస్తుందని ఉప్పుకొనుగోలు చేయాలని లేదంటే ముందు ముందు కేజీ రూ.300 నుండి 700 వరకు పెరుగుతుందని సమాచారం రావడంతో మండల ప్రజలు ఉప్పు కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. సాధారణంగా ఉప్పుకిలోరూ.10 ఉండగా పుకార్లతో కేజీ రూ. 50వరకు పెంచి అమ్ముకొన్నారు. అయినా ప్రజలు ఉప్పును కొనుగోలు చేశారు. దీంతో ఇదే అదునుగా చేసుకుని దుకాణదారులు రెండు రెట్లు ఎక్కువగా ధరలను పెంచి ఉప్పును అమ్ముకున్నారు.
వికారాబాద్ జిల్లా వెనుకబాటుతనం ఆశ్చర్యమే

ధారూర్, నవంబర్ 12: హైదరాబాద్ నగరానికి దగ్గరలోనే ఉన్నా వికారాబాద్ జిల్లా వెనుకబాటుతనం చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని జిల్లా కలెక్టర్ డి.దివ్య అన్నారు. వికారాబాద్ జిల్లా ఏర్పాటై నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 30 రోజులు జిల్లా అంతటా తిరిగి చూడడానికే సరిపోయిందని చెప్పారు. జిల్లాలో కేవలం 52 శాతం మాత్రమే అక్షరాస్యులున్నారని, పెద్దవారిలోనూ నిరక్షరాస్యులున్నారని తెలిపారు. జిల్లాలోని తాండూర్ జిల్లా ఆసుపత్రి, వికారాబాద్ ఏరియా ఆసుపత్రుల పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని స్పష్టం చేశారు. తాండూర్ జిల్లా ఆసుపత్రిలో పరిపాలనా విభాగం సరిగ్గాలేదని, వైద్యుల కొరత ఉందని, అనుభవమున్న వైద్యులు లేరని, సిబ్బందికి మార్గదర్శనం చేసే వారు లేరని, రోగులకు తగినంత సిబ్బంది లేరని, మంచినీటి వాటర్‌ప్లాంటు ఆరు నెలలుగా పనిచేయడం లేదని, మత్తు ఇంజక్షన్ ఇచ్చే వైద్యుడు లేక శస్త్ర చికిత్సలు చేయడం లేదని, భవనం, నిధులు ఉన్నా సిబ్బంది కొరత కారణంగా రోగులకు సేవలందడం లేదని పేర్కొన్నారు. వికారాబాద్ ఏరియా ఆసుపత్రిలోనూ సమస్యలు అనేకం ఉన్నాయని వివరించారు. తాను భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసేటపుడు భద్రాచలం ఏరియా ఆసుపత్రి రూపురేఖలు మార్చామని గుర్తుచేశారు. రాష్ట్రానికే ఆసుపత్రి ఆదర్శంగా నిలిచిందని, నెలకు 473 చొ