హైదరాబాద్

ఎట్లా బతకాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: వెయ్యి, 500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్న తీసుకున్న నిర్ణయంతో రెక్కాడితే గానీ డొక్కాడని కూలీల బతుకులు ఆగమాగమయ్యాయి. ఈ ఆపరేషన్‌తో ఏ మేరకు నల్లధనం బయటకు వస్తుందో దేవుడెరుగు గానీ బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకుని నగరానికొచ్చిన కూలీల బతుకులు దుర్భరంగా మారాయి.
అంతంతమాత్రంగా ఉన్న నిర్మాణ రంగం మొదలుకుని కనీసం ఇళ్లకు మరమ్మతులు చేసుకునే వారు సైతం నోట్ల మార్పిడి నేపథ్యంలో పనులను వాయిదా వేసుకున్నారు. వౌలాలీలో మహ్మద్ షుఖూర్ అనే వ్యక్తి వంద గజాల స్థలంలో నిర్మించుకుంటున్న ఇళ్లు పనులు నాలుగురోజుల క్రితం అర్థాంతరంగా ఆగిపోయాయి. ఆయన కూడబెట్టుకున్న డబ్బు సరిపోక అదనంగా డబ్బు అవసరమైంది. దీంతో ఆయన ఇంట్లోనున్న బంగారం మొత్తాన్ని అమ్మితే, పాతనోట్లతో వచ్చిన రూ. 4.10 లక్షల తీసుకునేందుకు మేస్ర్తిలు, లేబర్లు నిరాకరించారు. ఈ రకంగా పెద్ద నోట్ల రద్దుతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. దీంతో నగరంలోని నాంపల్లి, టోలీచౌకీ, చింతల్‌బస్తీ, ఖైరతాబాద్, నారాయణగూడ, నింబోలి అడ్డా, మల్లేపల్లి తదితర కూలీల అడ్డాల్లో కార్మికులు పనుల కోసం పడిగాపులు గాస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మహబూబ్‌నగర్, నల్గొండ, అదిలాబాద్, వరంగల్ ఇతర జిల్లాలతో పాటు శ్రీకాకుళం, కృష్ణా, గోదావరి, రాయలసీమ జిల్లాల నుంచి ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో లక్షల సంఖ్యలో రోజువారీ కూలీలు పనిచేస్తున్నారు. పెద్దనోట్లను రద్దు చేయటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నిర్మాణదారులు తమ వద్దనున్న నోట్లను మార్చుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అంతంతమాత్రంగా కొనసాగుతున్న భవన నిర్మాణ రంగంలో వారంలో ఆదివారం మినహా మిగిలిన ఆరో రోజుల్లో మూడు, నాలుగు రోజులు మాత్రమే పని దొరుకుతోంది. నోట్లు ఈ నెల 8న రద్దు చేసినా, ఆ మరుసటి రోజు నుంచి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఫలితంగా కూలీలకు పని దొరక్క ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఒక వేళ ఎవరైనా పనికి తీసుకెళ్లినా, వారు రూ. 500 నోటు ఇస్తున్నారని కొందరు కూలీలు తెలిపారు. అయితే రోజూ నిత్యావసర వస్తువులు తీసుకునే కిరాణ కొట్టు యజమానిని బ్రతిమాలినా వస్తువులు ఇవ్వటం లేదు. కొందరైతే ఇచ్చిన నోటులో ఇరవై నుంచి ముప్పై శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారు. సరే నగదు మార్పిడి చేసుకుందామంటే అందుకు కావల్సిన పత్రాలు లేక ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతున్నారు. ఎక్కడి నుంచో బతుకుదెరువు కోసం వలస వచ్చిన తాము ఆధార్ కార్డు వంటివి వెంట తీసుకురాలేదని కూలీలు వాపోయారు.
కాలా దందా!
నల్లధనాన్ని వెలకితీసేందుకు, నకిలీ కరెన్సీకి బ్రేక్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రద్దు నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతోందో గానీ సామాన్యులను మాత్రం కష్టాలు రెట్టింపవుతున్నాయి. రద్దయిన వెయ్యి, 500 నోట్ల నల్లధనం నగరంలో యదేచ్ఛగా వైట్‌గా మారుతోంది. కొందరు రాజకీయ నేతలు, బడా వ్యాపారులు ఎక్కువ మొత్తంలో కమీషన్లను డిమాండ్ చేస్తూ ప్రతిరోజు లక్షల రూపాయలను మార్చుతున్నారు. వెయ్యి, 500నోట్లను మార్చేందుకు బ్యాంకు సిబ్బంది అదనపు పనిగంటలు, సెలవుల్లో కూడా విధులు నిర్వహిస్తున్నారని పాలకులు ఘనంగా ప్రకటించుకుంటున్నా, దీంతో సామాన్యులు, పేదలకు ఎలాంటి ప్రయోజనం చేకూరటం లేదు. ఖాతాల్లో లక్షలు, వేలు ఉన్నా రోజు వంద నోటు కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. మరికొన్ని ఏటిఎంలలో గంటల తరబడి క్యూలో నిల్చుండి, తీరా వంతు రాగానే ఏటిఎంలలో డబ్బు అయిపోవటం వంటి సంఘటనలతో జనం బేజారవుతున్నారు. ఇక లైన్లలో నిల్చుండి బ్యాంకులో రోజుకి పరిమితంగా 4వేల నగదు తీసుకుంటే అందులో కొన్ని బ్యాంకులు రెండు 2వేల నోట్లనే ఇస్తుండగా, మరికొన్ని ఒకటి 2వేల నోటు, మరో ఇరవై వంద నోట్లను ఇస్తున్నాయి. వంద నోట్లు ఖర్చయిన తర్వాత 2వేల నోటుకు ఖాతాదారులకు చిల్లర దొరకటం లేదు. ఆదివారం కూడా ఉదయం ఏడు గంటలకు ముందు ఓ ఏటిఎం వద్ధ అయిదుగురు క్యూలో ఉన్నారంటే పేద, మధ్య తరగతులకు నగదు మార్పిడి ఎలా జరుగుతుందో అంచనా వేయవచ్చు. రోజులు గడుస్తున్నా కొద్దీ సామాన్య ఖాతాదారుల అవస్థలు పెరుగుతున్నాయే తప్ప, తగ్గటం లేదు. కోట్లలో వ్యాపారం చేస్తూ బ్యాంకుల్లో లక్షల్లో వైట్ మనీని దాచుకున్న కొందరు బడా వ్యాపారులు, రాజకీయ ప్రముఖులకు సేవలందించటంలోనే పలు బ్యాంకుల సిబ్బంది సమయాన్ని గడుపుతున్నారు. కొత్త అకౌంట్లను తెరిచేందుకు అధికారులు అంగీకరించకపోయినా, ఉన్న అకౌంట్ల ద్వారానే కమీషన్లపై బ్లాక్ మనీని వైట్‌గా మార్చుతున్నారు. మరికొన్ని బ్యాంకుల్లో లెక్కపత్రాల్లేని కోట్లాది రూపాయలను లక్షలుగా దశల వారీగా కరెన్సీలను మార్చుకుంటున్నారు. నగరంలో కొన్ని బ్యాంకుల శాఖల్లో కీలకమైన విధులు నిర్వహిస్తున్న అధికారుల