హైదరాబాద్

మార్కెట్లు వెలవెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 14: నల్లధనాన్ని బయటకు తీయటంతో పాటు నకిలీ కరెన్సీ చెలామణికి బ్రేక్ వేసేందుకు ప్రభుత్వం వెయ్యి, 500 నోట్లను రద్దు చేయటంతో నగరంలోని వ్యాపార ఇతరత్రా రంగాల్లో అనిశ్చితి నెలకొంది. పప్పు, ఉప్పు మొలుకుని పెద్ద పెద్ద మార్కెట్లలోనూ క్రయ విక్రయాలతో అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు బాగా తగ్గిపోయాయి. ముఖ్యంగా ప్రస్తుతమున్న వెయ్యి, 500 నోటును రద్దు చేయటం, అలాగే ప్రభుత్వం కొత్తగా జారీ చేస్తున్న రూ. 2వేల నోటుకు మార్కెట్‌లో చిల్లర దొరకకపోవటం ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. రద్దయిన కరెన్సీ నోట్లను పెట్రలో బంక్‌లు, ఆసుపత్రుల్లో తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన జారీ చేసిన ఆదేశాలు ఎక్కడా కూడా అమలు కావటం లేదు. పైగా ఖాతాదారులు తమకు కావల్సిన నగదును ఏటిఎంల నుంచి డ్రా చేసుకోవచ్చునని ప్రకటించినా, నగరంలోని చాలా ప్రాంతాల్లోని ఏటిఎంలు సాంకేతిక లోపాల కారణంగా పనిచేయటం లేదు. ఇక పనిచేస్తున్న ఏటిఎంల వద్ధ కిలోమీటర్ల పొడువునా వినియోగదారుల క్యూ ఉంటుంది. గంటల కొద్ది నిరీక్షించి ఏటిఎంలో డబ్బు డ్రా చేయగా, కొన్నింటిని నుంచి కొత్త 2వేల నోట్లు
వస్తున్నాయి. వీటిని మార్చేందుకు ఖాతాదారులు నానా తంటాలు పడుతున్నారు. నిన్నమొన్నటి వరకు ఓ ఖాతా నుంచి ఏటిఎం ద్వారా రూ. 2వేలు డ్రా చేసుకునే అవకాశమివ్వగా, ఆ పరిమితిని సోమవారం నుంచి రూ. 2500లకు, అలాగే బ్యాంకుల్లో ఖాతాల ద్వారా ఒక్కో దాని నుంచి రూ. 4వేలు మాత్రమే డ్రా చేసుకునే అవకాశముండగా, దానికి కూడా అదనంగా రూ. 500లు పెంచారు. 500 కొత్త కరెన్సీ నోటు నేడో, రేపో ఏంటిఎంల నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పెట్రోలు బంక్‌లలో వాహనదారులెదుర్కొంటున్న ఇబ్బందులు ఇంకా పెరిగాయి. రద్దయిన వెయ్యి, 500నోట్లు ఇస్తే ఆ మొత్తానికి పెట్రోలు, డీజిల్ పోయించుకోవాలని, లేని పక్షంలో తమ వద్ద చిల్లర లేదని బంకు సిబ్బంది తేల్చి చెప్పటంతో పలు చోట్ల వాగ్వాదాలు కూడా చోటుచేసుకున్నాయి.
వెలవెలబోయిన మార్కెట్లు
వెయ్యి, 500 నోట్లు రద్దు చేయటంతో నగరంలో వ్యాపారం పూర్తిగా కుదేలైంది. ఖాతాల్లో లక్షల రూపాయలున్నా, జనం మాత్రం వంద నోటు కోసం పరుగులు తీస్తున్నారు. కొత్తగా వచ్చిన 2వేల నోటుకు మార్కెట్‌లో చిల్లర లభ్యం కాకపోవటంతో వ్యాపారాలు గణనీయంగా తగ్గాయి. బేగంబజార్, మోండామార్కెట్‌తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను విక్రయించే మార్కెట్లు సైతం వ్యాపారులు, వినియోగదారుల్లేక వెలవెలబోతున్నాయి.